Ys Jagan : ఇలా అయితే సమావేశాలు చూసేదెవరూ.. జగన్ అసెంబ్లీకి రావాలంటూ స్పీకర్, మంత్రుల విజ్ఞప్తి !
ప్రధానాంశాలు:
Ys Jagan : ఇలా అయితే సమావేశాలు చూసేదెవరూ.. జగన్ అసెంబ్లీకి రావాలంటూ స్పీకర్, మంత్రుల విజ్ఞప్తి !
Ys Jagan : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) అధ్యక్షుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి తనను సభలో ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి లేఖ రాసి కోరిన విషయం తెలిసిందే. ఈ విషయమై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. లోక్‌సభ, ఢిల్లీ అసెంబ్లీ, అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరిగిన పూర్వాపరాలను పరిశీలిస్తే వైఎస్సార్‌సీపీ నేతకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలన్నారు. సభ మొత్తం బలంతో పోలిస్తే వారి సంఖ్యా బలం తక్కువగా ఉన్నప్పటికీ ప్రతిపక్ష నాయకుడికి ప్రతిపక్ష నాయకుడి పదవిని ఇచ్చినట్లుగా ఆయన పేర్కొన్నారు. వైఎస్ జగన్ అసెంబ్లీ గైర్హాజరవుతున్న సంగతి తెలిసిందే. సభలో తనకు మైకు ఇవ్వరని, తనకు ప్రతిపక్ష హోదా లేకపోతే మాట్లాడే అవకాశం ఉండదని ఆయన చెబుతున్నారు.
ఇటీవల అసెంబ్లీలో ఆర్థికశాఖపై శ్వేతపత్రం విడుదల చేసి, అనంతరం చంద్రబాబు ప్రసగించారు. అయితే… సరిగ్గా అదే సమయంలో జగన్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. శ్వేతపత్రాలపై నిప్పులు కక్కారు. అసలు లెక్కలు ఇవంటూ పలు విషయాలు వెల్లడించారు.ఈ సమయంలో రెండు విషయాలనూ మీడియా ప్రసారం చేసింది. అయితే ఆ సమయంలో అసెంబ్లీ సమావేశాన్ని అందులో చంద్రబాబు నాయుడి ప్రసంగాన్ని ఆన్ లైన్ లో చూసినవారు కేవలం 50 వేల పైచులుకు మాత్రమే ఉండగా జగన్ ప్రెస్ మీట్ ని మాత్రం 7 లక్షల మందికి పైగా వీక్షించారు. దాంతో కూటమి ప్రభుత్వం పునరాలోచనలో పడిందని సమాచారం.
కూటమి ప్రభుత్వం కొలువుదీరిన ప్రారంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే.. ఇకముందు ఎలా ఉంటుందని అంతా చర్చించుకుంటున్నారు. ఇదే కంటిన్యూ అయితే ఏపీ అసెంబ్లీ సమావేశాలు చూసేవారు తగ్గిపోవడంతో పాటు, సరిగ్గా అదే సమయంలో జగన్ ప్రెస్ మీట్ లు చూసేవారి సంఖ్య విపరీతంగా పెరుగుతుండం వల్ల ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. దాంతో ఆలోచనలో పడ్డ ఎన్డీయే ప్రభుత్వం, కూటమి మంత్రులు జగన్ ను రిక్వెస్ట్ చేస్తున్నట్లు సమాచారం. స్పీకర్ అయ్యన్నపాత్రుడు అయితే ఓ అడుగు ముందుకేసి ఏకంగా జగన్ ని బుజ్జగించే పనిలో ఉన్నాట్లు కనిపిస్తున్నారు. ఇందులో భాగంగ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి జగన్ అసెంబ్లీకి రావాలని అంటున్నారు. అసెంబ్లీలో మాట్లాడేందుకు అవకాశం కల్పిస్తామని మంత్రులు చెబుతుండగా.. ఆ విషయంలో తనది భాధ్యత అన్నట్లుగా స్పీకర్ భరోసా ఇస్తున్నట్లు సమాచారం.