Mahesh Kumar Goud : ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి : మహేష్‌కుమార్ గౌడ్
Mahesh Kumar Goud : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తుందని పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి గారి సారధ్యంలో ప్రజలకు సేవలంధిస్తున్నట్టుగా గుర్తు చేశారు. భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం చేపట్టిన జై భీం, జై బాపు, జై సంవిధాన్ కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని పిలుపునిచ్చారు.
Mahesh Kumar Goud : ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి : మహేష్‌కుమార్ గౌడ్
ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జీ మందుముల పరమేశ్వర్‌రెడ్డి శనివారం పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్‌ను కలిశారు. నియోజకవర్గంలో చేపడుతున్న కార్యక్రమాలను గురించి పరమేశ్వర్‌రెడ్డి పీసీసీ చీఫ్‌కు వివరించారు. సన్న బియ్యం పథకం అమలు, లబ్ధిదారుల ఇళ్లల్లో బోజనాలు, రాజ్యాంగ పరిరక్షణ ప్రదర్శనలు, తదితర వాటి గురించి చెప్పారు. దీంతో పరమేశ్వర్‌రెడ్డిని ఈ సందర్భంగా మహేష్‌కుమార్‌గౌడ్ గారు అభినందించారు.
ఇదే తరహాలో ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మహేష్‌కుమార్‌గౌడ్ గారు,సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ది పథకాల విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమాలలో భాగస్వాములు కావాలని సూచించారు. ఈ కార్యక్రమం లో మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్ వజ్రేష్ యాదవ్ గారు,టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి బూపతి రెడ్డి గారు పాల్గొన్నారు
Koppula Narasimha Reddy : మన్సూరాబాద్ డివిజన్ హయత్ నగర్ ప్రాంతంలోని T.Nagar కాలనీ రోడ్డు నెం:-3లో సుమారు 11.00…
Lady Aghori : అఘోరి వర్షిణికి సంచలన హెచ్చరిక చేసారు. ఇకనైనా మమ్మల్ని వదిలేయండి.. లేకపోతే సచ్చిపోతాం అంటూ వారు…
Divi Vadthya : బిగ్‌బాస్ రియాలిటీ షో ద్వారా పాపులర్ అయిన వారిలో దివి వైద్య ఒకరు. హైదరాబాద్‌కు చెందిన…
UPI : డిజిటల్ చెల్లింపుల వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. డీమానిటైజేషన్ తర్వాత దేశవ్యాప్తంగా నగదు లేని లావాదేవీలు విస్తృతంగా జరిగిపోతున్నాయి.…
Ponguleti Srinivasa Reddy : రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి పార్టీలకతీతంగా ‘ఇందిరమ్మ ఇళ్లు’ నిర్మిస్తామని, ఈ నెలాఖరులోగా అన్ని…
GPO Posts : రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పాలనాధికారి (జీపీవో) పోస్టులన్నింటినీ నేరుగా భర్తీ చేయాలని ఆలోచనలో ఉంది. గతంలో…
Janhvi Kapoor : టాలీవుడ్‌లో జాన్వీ కపూర్ మరింత బిజీ అవుతోంది. 2018లో 'ధడక్' సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన…
Fathers Death : ఏ తండ్రికైనా తన కొడుకును పెళ్లి మండపంలో చూడాలని, మనవాళ్ళు , మానవరాళ్లతో ఆటలు ఆడుకోవాలని…
This website uses cookies.