Telangana Assembly LIVE Updates : అసెంబ్లీలో తెలంగాణ కరెంట్ లెక్కలపై చర్చ.. లైవ్ అప్‌డేట్స్..!
ప్రధానాంశాలు:
Telangana Assembly LIVE Updates : అసెంబ్లీలో తెలంగాణ కరెంట్ లెక్కలు.. లైవ్ అప్‌డేట్స్..!
విద్యుత్‌పై శ్వేతపత్రం విడుదల చేసిన మంత్రి భట్టి విక్రమార్క
తెలంగాణ రాష్ట్రం విద్యుత్ రంగం అందోళనకరంగా ఉంది.. భట్టి
Telangana Assembly LIVE Updates : నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలు ఈరోజుకి వాయిదా పడ్డాయి. ఈరోజు 11 గంటలకు ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై గత ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిలదీశారు. గత ప్రభుత్వం చేసిన అప్పుల ను ప్రజలకు వివరిస్తున్నారు. పవర్ ప్రాజెక్ట్, వాటి కోసం చేసిన ఖర్చు, వాటితో చేకూడిన లబ్ధి ,అప్పుల భారాన్ని ప్రభుత్వం ప్రజలకు వివరించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందని చర్చ జరుపుతుంది. అభివృద్ధి ముసుగులో గత ప్రభుత్వం ఎంత దోపిడీ చేసిందో దానిపై రేవంత్ సర్కార్ నిలదీస్తుంది.
ఒక్కొక్క శాఖపై శ్వేత పత్రాలను సిద్ధం చేసింది. నిన్న అసెంబ్లీ సమావేశం వేదికగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గత పదేళ్లలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో వివరించారు.నిన్న అసెంబ్లీ సమావేశంలో ప్రాజెక్టుల గురించి గత ప్రభుత్వాన్ని నిలదీసింది. ఇక ఈరోజు విద్యుత్ రంగంపై చర్చ జరుపుతుంది. ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశంలో రేవంత్ సర్కార్ గత ప్రభుత్వం విద్యుత్ రంగంపై ఎంత అప్పు చేసిందో ప్రజలకు తెలియజేస్తుంది.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గత ప్రభుత్వం విద్యుత్ రంగంపై ఎంత అప్పు చేసిందో స్పీకర్కు తెలియజేశారు.ప్రస్తుతం విద్యుత్ రంగంలో 81,516 కోట్ల అప్పు ఉందని ఆయన తెలిపారు . తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయానికి టీఎస్ జంకో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 4365.26 మెగా వాట్స్ ఉందని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు తర్వాత కాలంలో తెలంగాణలో నాణ్యమైన విద్యుత్ అందించడానికి కీలక పాత్ర పోషించాయని అన్నారు.