Telangana Assembly LIVE Updates : అసెంబ్లీలో తెలంగాణ అప్పుల చిట్టా.. లైవ్ అప్‌డేట్స్..!
ప్రధానాంశాలు:
Telangana Assembly LIVE Updates : ఇవాళ్లి నుంచి తిగిరి ప్రారంభం కానున్న అసెంబ్లీ సెషన్.. లైవ్ అప్‌డేట్స్..!
పదేళ్ల బీఆర్ ఎస్ పాలనలో చేసిన అప్పులపై అసెంబ్లీలో చర్చ..
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రభ్వుత్వ క్లారిటీ..
Telangana Assembly Session 2023 LIVE Updates : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యేలకు సభ సంతాపం ప్రకటించనుంది. ఆ తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం వివరించనున్నారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శ్వేత పత్రం విడుదల చేయనున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై రేవంత్ రెడ్డి పీపీటీ ఇచ్చే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర ఆస్తులు వివరాలతో బీఆర్ఎస్ ప్రభుత్వం బుధవారం డాక్యుమెంటరీ విడుదల చేసింది. కెసిఆర్ పాలనలో సృష్టించిన ఆస్తుల జాబితాను రిలీజ్ చేసింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అప్పుల ప్రచారాన్ని తిప్పికొట్టేలా బీఆర్ఎస్ ప్లాన్ రెడీ చేస్తుంది.
పవర్ ప్రాజెక్ట్ , వాటి కోసం చేసిన ఖర్చు, వాటితో చేకూడిన లబ్ది అప్పుల భారాన్ని ప్రభుత్వం ప్రజలకు వివరించనుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందని చర్చ జరగబోతుంది. అభివృద్ధి ముసుగులో ఎంత దోపిడీ జరిగిందనే దానిపైన రేవంత్ సర్కార్ గత ప్రభుత్వాన్ని నిలదీయనుంది. ఒక్కొక్క శాఖపై శ్వేత పత్రాన్ని సిద్ధం చేసింది. అసెంబ్లీ సమావేశం వేదికగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. గత పది ఏళ్లలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో వివరించనున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇరుకన పెట్టేందుకు రేవంత్ ప్రభుత్వం ఈ సమావేశాన్ని వాడుకొనుంది. అభివృద్ధి ముసుగులో బీఆర్ఎస్ ప్రభుత్వ ఎంత దోపిడీ చేసిందో ప్రభుత్వం ప్రజలకు వివరించనుంది.
అధికార ప్రతిపక్ష పార్టీలతో శాసనసభ వేడిగా మారనుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత అప్పుల పాలు చేసిందో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వివరించనన్నారు. ఇక ప్రతిపక్ష పార్టీలు కూడా వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు. మొత్తానికి అయితే అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా జరగనున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలను ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్ తెలుసుకునేందుకు మా వెబ్ సైట్ ను ఫాలో అవ్వండి.