Harish rao vs Uttam kumar Reddy : హరీష్ రావు vs ఉత్తమ్ కుమార్ రెడ్డి .. ఇద్దరి మధ్య మాటల యుద్ధం.. ఎవరు తగ్గలేదు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Harish rao vs Uttam kumar Reddy : హరీష్ రావు vs ఉత్తమ్ కుమార్ రెడ్డి .. ఇద్దరి మధ్య మాటల యుద్ధం.. ఎవరు తగ్గలేదు..!

 Authored By anusha | The Telugu News | Updated on :21 December 2023,12:40 pm

ప్రధానాంశాలు:

  •  Harish rao vs Uttam kumar Reddy : హరీష్ రావు vs ఉత్తమ్ కుమార్ రెడ్డి .. ఇద్దరి మధ్య మాటల యుద్ధం.. ఎవరు తగ్గలేదు..!

Harish rao vs Uttam kumar reddy : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా కొనసాగుతున్నాయి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రాజెక్టులపై హరీష్ రావు విచారణ చేయండి అని అన్నారు. కచ్చితంగా వారిపై విచారణ జరిపించి తప్పు చేసిన వారిని శిక్షిస్తామని అన్నారు. కాళేశ్వరంతో ఒక్క ఎకరం అయినా సాగు అదనంగా వచ్చిందా అని ప్రశ్నించారు. పాలమూరు ప్రాజెక్టుకి ఎందుకు నిధులు విడుదల చేయలేదని ప్రశ్నించారు. పాలమూరుకి రూ.25 వేల కోట్లు ఖర్చు పెడితే కొత్త ఆయకట్టు లేదని అన్నారు. సీతారాం ప్రాజెక్టుకి ఆయకట్టు సున్నా కొత్త ఆయకట్టు లేకుండా, లక్షల కోట్లు పెడితే వృధా కాదా అని మంత్రి ఉత్తమ్ అన్నారు.మేడిగడ్డపై ఆనాటి సీఎం ఒక్క మాట మాట్లాడలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మేడిగడ్డ ఆనాటి సీఎం ఒక్క మాట మాట్లాడలేదు అని అన్నారు. ఎల్అండ్టీ మాకు ఏం సంబంధం అది అంటోంది. డిసైన్ ఇచ్చారు.. మేము కట్టాం అంతే అంటున్నారని తెలిపారు. అధికారులను అడిగితే ఇంకెవరు సర్ డిజైన్ చేసేది వాళ్లే కదా అన్నారని ఉత్తమ్ అన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ జరుపుతాం. బాధ్యులపై చర్యలు ఉంటాయని ఉత్తమ్ అన్నారు. కేంద్రం బావుల దగ్గర మీటర్లు బిగిస్తేనే రాష్ట్రానికి రావాల్సిన 35వేల కోట్ల రూపాయల బకాయి చెల్లిస్తామని చెప్పారన్నారు. 35వేల కోట్ల కంటే రైతుల ప్రయోజనాలే ముఖ్యమని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ మోటర్లు పెట్టనివ్వలేదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మోటర్లు పెట్టకుండా చూడాలని వాళ్లు కోరుతున్నారు. దీనిపై అభ్యంతరం తెలిపిన ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్లమెంట్ సభ్యుడిగా బావి మోటార్లకు మీటర్లు పెట్టినా రైతులు బిల్లు కట్టాల్సిన అవసరం లేదన్నారు. దీనిపై స్పందించిన హరీష్ రావు కేంద్ర ప్రభుత్వం బిల్లు కట్టాలని మెలికపెడితే రైతులు ఇబ్బందులు పడతారని అన్నారు. అలా జరగకుండా చూడాలని చెప్పారు. బిల్లు కట్టాల్సిన అవసరం లేదని చెబుతున్న మంత్రి మోటర్లకు మీటర్లు బిగించకుండా చూస్తామని ఎందుకు చెప్పడం లేదని ఉత్తమ్ ను ప్రశ్నించారు హరీష్ రావు.

బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో సివిల్ సప్లై శాఖ బియ్యం ఇవ్వడానికి, వడ్లు కొనడానికి పరిమితం అయ్యిందని మంత్రి ఉత్తమ్ కుమార్ తెలిపారు. 3300 కోట్లున్న అప్పు 56 వేల కోట్లు పెరిగిందని ఆరోపించారు. గత ప్రభుత్వం నిరుపేదలకు బియ్యం ఇచ్చే శాఖకు ఇచ్చే సబ్సిడీ ఇవ్వలేదని మండిపడ్డారు. గత పాలన మూలంగా 11 వేల 500 కోట్లు నష్టం జరిగిందని తెలిపారు. 22 వేల కోట్ల ధాన్యం రైస్ మిల్లర్ల దగ్గర పెట్టారు. వివరాలు కూడా లేవన్నారు. కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వం రైస్ కొంటామని అడిగింది. స్టాక్ ఉన్నా అమ్మలేదని ఉత్తమ్ కుమార్ అన్నారు. బీఆర్ఎస్ రాజకీయ కారణాలతో ఉన్న ధాన్యం కూడా అమ్మలేదని మంత్రి ఆరోపించారు.

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది