ys jagan : మున్సిపల్ ఎన్నికల తర్వాత ఆ మంత్రి అవుట్..? జగన్ కీలక నిర్ణయం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

ys jagan : మున్సిపల్ ఎన్నికల తర్వాత ఆ మంత్రి అవుట్..? జగన్ కీలక నిర్ణయం

ys jagan : మంత్రుల పనితీరు సరిగ్గా లేకపోతే రెండున్నర ఏళ్ల తర్వాత పదవి నుండి తప్పించటం ఖాయమని ముఖ్యమంత్రిగా జగన్ తన తొలి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్న సమయంలో చెప్పిన మాటలు. ఇప్పుడు ఆ సమయం దగ్గరపడినట్లు సృష్టంగా తెలుస్తుంది. మంత్రులపై ఆయన ఓ కన్నేసి ఉంచుతున్నారు. మంత్రుల బాడీ లాంగ్వేజ్ నుంచి వారి మాట తీరు వ్యవహారాల వరకు సీఎం అన్ని కోణాల్లో కొందరిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఇక జగన్ తన మంత్రి […]

 Authored By brahma | The Telugu News | Updated on :3 March 2021,1:10 pm

ys jagan : మంత్రుల పనితీరు సరిగ్గా లేకపోతే రెండున్నర ఏళ్ల తర్వాత పదవి నుండి తప్పించటం ఖాయమని ముఖ్యమంత్రిగా జగన్ తన తొలి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్న సమయంలో చెప్పిన మాటలు. ఇప్పుడు ఆ సమయం దగ్గరపడినట్లు సృష్టంగా తెలుస్తుంది. మంత్రులపై ఆయన ఓ కన్నేసి ఉంచుతున్నారు. మంత్రుల బాడీ లాంగ్వేజ్ నుంచి వారి మాట తీరు వ్యవహారాల వరకు సీఎం అన్ని కోణాల్లో కొందరిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.

ఇక జగన్ తన మంత్రి వర్గం నుండి తప్పించే మంత్రుల జాబితాలో మొదటి పేరు ప్రస్తుత దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసు పేరు ఉన్నట్లు వైసీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. రాష్ట్రంలో ఆలయాలపై దాడులతో ప్రభుత్వం ఇరుకున పడింది. అయితే.. దీని నుంచి బయటపడేందుకు అంతే వేగంగా చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో ఆ శాఖ మంత్రి వెల్లంపల్లి పనితీరుపై సీఎం సంతృపితో లేదని, ఈ వివాదంలో టీడీపీకి గట్టిగా సమాధానం చెప్పే విషయంలో మంత్రి సరిగ్గా వ్యవహరించలేదని, మీడియా ముందు కూడా సరిగ్గా హ్యాండిల్ చేయలేదని సీఎం జగన్ భావిస్తున్నట్లు సమాచారం.

Ys jagan

Ys jagan

ys jagan : సన్నిహితుడే కానీ

నిజానికి వెల్లంపల్లి శ్రీనివాసు సీఎం జగన్ కు బాగా సన్నిహితమని వైసీపీ వర్గాలే చెపుతున్నాయి. అయినా కానీ ఈ విషయంలో జగన్ కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే అనేక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. దేవాలయాల మీద జరిగిన దాడుల విషయంలోనే కాకుండా, మంత్రి తన వారికి ప్రాధాన్యం ఇవ్వడం ప్రభుత్వం పనులు అప్పగించడం పైనా జగన్ ఆరాతీసినట్టు తెలిసింది.

ఇది కూడా చ‌ద‌వండి ==> Ramoji Rao : షాకింగ్ నిర్ణయం తీసుకున్న రామోజీ రావు.. ?

మరోవైపు రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో కీలకమైన విజయవాడ మేయర్ స్థానాన్ని ఎలాగైనా వైసీపీ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తుంది. దీనితో ఆ బాధ్యత విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే, మంత్రి పదవి అనుభవిస్తున్న వెల్లంపల్లి శ్రీనివాసు మీద ఎక్కువగా ఉంది. అయితే ఆయన మంత్రి అయిన తర్వాత తన కుల వర్గమైన ఆర్యవైశ్యులు విషయంలో పెద్దగా చేసింది ఏమి లేదని విజయవాడ లోని అయన వర్గం అసంతృప్తితో ఉండనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఈ దశలో అక్కడ తన వర్గాన్ని తన వైపు తిప్పుకొని విజయవాడ మేయర్ సీటు కైవసం చేసుకోవటం వెల్లంపల్లి తక్షణ కర్తవ్యం.. ఇక్కడ ఏమైనా తేడా జరిగితే మాత్రం ఖచ్చితంగా దాని ప్రభావం ఆయన మంత్రి పదవి మీద పడే అవకాశం ఉందని అంటున్నారు వైసీపీ నేతలు

ఇది కూడా చ‌ద‌వండి ==> YS Jagan : ఢిల్లీకి సీఎం జగన్.. దానిపై తాడో పేడో తేల్చుకోవడానికేనా?

brahma

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది