Today Top Breaking News : ఓల్డ్ సిటీలోని షాదాబ్ హోటల్‌లో కేటీఆర్ సందడి.. కళ్లు తిరిగి కింద పడ్డ కవిత.. కాంగ్రెస్‌పై ఫ్లెక్సీ వార్
ప్రధానాంశాలు:
బీఆర్ఎస్ పార్టీలో చేరిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అమరేందర్ రెడ్డి
విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పీడ వదిలందన్న బీజేపీ ఎంపీ అర్వింద్ ధర్మపురి
చిదంబరం వ్యాఖ్యల నేపధ్యంలో కాంగ్రెస్ పై కొనసాగుతున్న ఫ్లెక్సీ వార్
Today Top Breaking News : ఎమ్మెల్సీ కవిత(Kalvakuntla Kavitha) అస్వస్థతకు గురయ్యారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని ఇటిక్యాల గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఒక్కసారిగా కవిత కళ్లు తిరిగి స్పృహ తప్పి కిందపడ్డారు. కాసేపటికి తేరుకున్న ఆమె తిరిగి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓల్డ్ సిటీలో మంత్రి కేటీఆర్(Minister KTR) పర్యటించారు. ఓల్డ్ సిటీలో ఫేమస్ అయిన షాదాబ్ హోటల్ లో ఆయన సందడి చేశారు. ఈ సందర్భంగా రెస్టారెంట్ కు వచ్చిన కస్టమర్లతో ఆయన కాసేపు ముచ్చటించారు.
చిదంబరం వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ పై కొనసాగుతున్న ఫ్లెక్సీ వార్. నిన్న రాహుల్ గాంధీ(Rahul Gandhi) రాకను నిరసిస్తూ ఫ్లెక్సీలు వెలిశాయి. ఉద్యమకారులను బలితీసుకున్న కాంగ్రెస్ పార్టీని బతకనీయొద్దు అంటూ హైదరాబాద్ నగరంలో పలు చోట్ల ఫ్లెక్సీలు వెలిశాయి. అమరుడు శ్రీకాంతా చారి ఫోటోతో పాటు తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అమరుల ఫోటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
ఇండియా, ఆస్ట్రేలియా(India VS Australia) ఫైనల్ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా జెర్సీ పసుపు రంగు కాబట్టి.. ఆస్ట్రేలియాకే మద్దతు ఇస్తామని టీడీపీ నాయకులు తెలిపారు.
విజయశాంతి(Vijayashanthi) కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పీడ వదిలిందని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు.
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే పాల్గొన్న కుత్బుల్లాపూర్ సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) మాట్లాడుతుండగా సభకు వచ్చిన జనం వెళ్లిపోయారు. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కాంగ్రెస్ పార్టీని వీడి మంత్రి కేటీఆర్(Minister KTR) సమక్షంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మిర్యాలగూడ నేత అలుగుబెల్లి అమరేంద్ర రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు.