Today Gold Rate : పసిడి ప్రియులకు త్వరలో గుడ్ న్యూస్ .. తులం బంగారంపై రూ.20,000 తగ్గే అవకాశం..!
ప్రధానాంశాలు:
Today Gold Rate : పసిడి ప్రియులకు త్వరలో గుడ్ న్యూస్ .. తులం బంగారంపై రూ.20,000 తగ్గే అవకాశం..!
Today Gold Rate : ప్రస్తుతం బంగారం ధరలు చరిత్రలో ఎన్నడూ లేని స్థాయికి చేరాయి. గత నాలుగు రోజులుగా నిరంతరంగా పెరుగుతున్న ధరలు సామాన్య ప్రజలను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఒక్క గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర రూ.9,566గా ఉండటంతో, చాలా మంది ప్రజలు గోల్డ్ షాపులవైపు వెళ్ళడానికే వెనుకంజ వేస్తున్నారు. డబ్బు ఉన్న వారు ఇప్పుడే కొనుగోలు చేసి భద్రపరచాలనే ఆలోచనలో ఉన్నా, మధ్య తరగతి ప్రజలు మాత్రం ఇలాంటి ధరలకు బంగారం కొనాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నారు.

పసిడి ప్రియులకు త్వరలో గుడ్ న్యూస్ .. తులం బంగారంపై రూ.20,000 తగ్గే అవకాశం..!
Today Gold Rate : తులం బంగారం రూ.55 వేలు కాబోతుంది.. ఎప్పుడంటే !
బంగారం ధరల పెరుగుదలకు ప్రధాన కారణం ప్రపంచ ఆర్థిక, రాజకీయ పరిస్థితులే. అమెరికా, చైనా మధ్య కొనసాగుతున్న ట్రేడ్ వార్, అలాగే అమెరికా డాలర్ విలువ క్షీణత ఈ పెరుగుదలకు బలమైన కారణాలుగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం అమెరికా మార్కెట్లో బంగారం ధర ఒక్క ఔన్స్‌కు 3200 డాలర్లకు దాటగా, ఇది ఇప్పటివరకు నమోదైన అత్యధిక స్థాయి కావడం గమనార్హం. డాలర్ విలువ తగ్గడమే దీనికి ప్రధాన కారణంగా చెబుతున్నారు.
అయితే భవిష్యత్తులో బంగారం ధరలు తగ్గే అవకాశమున్నాయని కూడా విశ్లేషకులు పేర్కొంటున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేటు తగ్గించే అవకాశం ఉందని, దీని వల్ల డాలర్‌పై ఒత్తిడి పెరగొచ్చని, ఫలితంగా బంగారంపై పెట్టుబడిదారులు ప్రాఫిట్ బుకింగ్‌కు మొగ్గు చూపొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావంతో బంగారం ధరలు ప్రస్తుతం ఉన్న స్థాయి నుంచి దాదాపు 15 శాతం వరకు పడిపోయే అవకాశముందని, అప్పుడు ధరలు రూ.55,000 వరకు తగ్గవచ్చని అంచనా. ఇవే కాకుండా భవిష్యత్తులో అమెరికా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడితే బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉండటంతో, కొనుగోలుదారులు కొంతకాలం ఆగడం మేలని నిపుణుల సూచన.
ఇక ఈరోజు ఏప్రిల్ 14 న గోల్డ్ ధర చూస్తే..హైదరాబాద్ – ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,566, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.8,769 మరియు 18 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.7,175 గా ఉంది.