Today Telugu Breaking News : ముంచుకొస్తున్న మిచౌంగ్ తుఫాను.. మారిన తెలంగాణ సీఎం అభ్యర్థి పేరు.. ఎంపీ పదవికి ఉత్తమ్ రాజీనామా.. సంక్రాంతికి రైళ్లన్నీ ఫుల్.. ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Today Telugu Breaking News : ముంచుకొస్తున్న మిచౌంగ్ తుఫాను.. మారిన తెలంగాణ సీఎం అభ్యర్థి పేరు.. ఎంపీ పదవికి ఉత్తమ్ రాజీనామా.. సంక్రాంతికి రైళ్లన్నీ ఫుల్.. ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్

 Authored By kranthi | The Telugu News | Updated on :5 December 2023,1:00 pm

ప్రధానాంశాలు:

  •  ఏపీ వైపు దూసుకొస్తున్న మిచాంగ్.. తమిళనాడులో విధ్వంసం

  •  BRS ఎమ్మెల్యేలతో మాజీ సీఎం కేసీఆర్ సమావేశం

  •  ఎంపీ పదవికి రాజీనామా చేయనున్న ఉత్తమ్.. మధ్యాహ్నం లోక్ సభ స్పీకర్ తో భేటీ

Today Telugu Breaking News : తెలంగాణపైనా మిచౌంగ్ తుఫాను(Cyclone Michaung) ప్రభావం.. మిచౌంగ్ ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న చిరుజల్లులు. ఉదయం నుంచి చల్లబడిన వాతావరణం, రాష్ట్రవ్యాప్తంగా వీస్తున్న చల్లని గాలులు. మిచౌంగ్ తుఫాను ప్రభావం నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో రాహుల్ బొజ్జా టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.

మిచౌంగ్ తుఫాను(Cyclone Michaung) ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న సాయంత్రం నుంచి తుఫాను ప్రభావంతో ఎడతెరిపి లేని వర్షం కురుస్తుండటం, పెరిగిన చలితో జనాలు వణుకుతున్నారు. మరో 24 గంటలు అప్రమత్తత అవసరం అని అధికారులు తెలుపుతున్నారు.

ఇవాళ తెలంగాణ సీఎం అభ్యర్థిని(Telangana CM Candidate) ప్రకటించే అవకాశం ఉంది. ఇవాళ ప్రకటిస్తామని ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) స్పష్టం చేశారు. సాయంత్రం లోపు ప్రకటిస్తామన్నారు. ఇప్పటికే భట్టి విక్రమార్క(Bhatti Vikramarka), ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) ఢిల్లీలో ఉన్నారు.

హుజూరు నగర్(Huzur Nagar) నుంచి ఎమ్మెల్యేగా ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) గెలుపొందిన నేపథ్యంలో తన ఎంపీ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయనున్నారు. మధ్యాహ్నం లోక్ సభ స్పీకర్ తో భేటీ అయిన అనంతరం తన రాజీనామా పత్రాన్ని స్పీకర్ కు అందజేయనున్నారు.

ఏపీలో మిచౌంగ్ తుఫాన్(Cyclone Michaung) దాటికి ఏపీ వ్యాప్తంగా వరి ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. దీంతో రైతులు లబోదిగబోమంటున్నారు. దక్షిణ కోస్తాకు ఇప్పటికే ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కోయాల్సిన వరి పంట, కోసిన పంట ధాన్యం మొత్తం తడిసిపోయింది.

సంక్రాంతి పండుగకు(Sankranthi Festival) రైళ్లన్నీ ఫుల్ అయ్యాయి. ప్రత్యేక రైళ్ల కోసం ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. సంక్రాంతి పండుగకు ఏపీ ప్రజలు ఎక్కువగా తమ సొంత ప్రాంతాలకు వెళ్తారు. ఈనేపథ్యంలో రెండు నెలల ముందే పండుగ కోసం టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. ఇంకా నెలన్నర సమయం ఉన్నా ఇప్పటికే ఏపీ వైపు వెళ్లే రైళ్లన్నీ ఫుల్ అయ్యాయి.

ఏపీ నిరుద్యోగులకు(AP Unemployees) ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏపీ గ్రామ సచివాలయాల్లో(AP Gram Secretariates) 1896 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది.

ఏపీకి అమరావతే రాజధాని(AP Capital Amaravathi) అని కేంద్రం స్పష్టం చేసింది. అమరావతి మాస్టర్ ప్లాన్ ను కేంద్రం ఆమోదించింది. దేశంలో ఉన్న 28 రాష్ట్రాల రాజధానుల జాబితాను తాజాగా కేంద్రం విడుదల చేసింది. రాష్ట్రాల రాజధానుల మాస్టర్ ప్లాన్ పై రాజ్యసభలో ఎంపీ జావెద్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్రం ఈ ప్రకటన చేసింది. ఏపీ రాజధానిపై కేంద్రం ప్రకటన చేయడం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

తమిళనాడుపై కూడా మిచౌంగ్(Michaung Cyclone in Tamilnadu) తుఫాన్ విరుచుకుపడుతోంది. భారీ వర్షాలు, వరదలతో చెన్నై అతలాకుతలం అవుతోంది. రోడ్లపై వర్షపు నీరు ప్రవాహంతో వాహనాలు కొట్టుకుపోతున్నాయి. వరదల కారణంగా ఇప్పటి వరకు ఐదుగురు చనిపోయారు. భారీ వర్షాలతో పలు రైళ్లు, విమానాలు రద్దు చేశారు. చెన్నై ఎయిర్ పోర్ట్ రన్ వే పై వర్షపు నీరు వచ్చి చేరింది.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో(BRS New MLAS) మాజీ సీఎం కేసీఆర్(KCR) ఎర్రవెల్లిలోని తన నివాసంలో సమావేశమయ్యారు. ప్రజల తీర్పు గౌరవించాలని కేసీఆర్ అన్నారు. కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం. త్వరలోనే శాసనసభాపక్ష నేతను ఎన్నుకుందామన్నారు. ఈనెల 16 వరకు మన ప్రభుత్వమే ఉంటుందని కేసీఆర్ తెలిపారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది