YS Vijayamma : జగన్.. షర్మిల.. మధ్యలో విజయమ్మ..!
ప్రధానాంశాలు:
YS Vijayamma : జగన్.. షర్మిల.. మధ్యలో విజయమ్మ..!
YS Vijayamma : ఏపీలో అధికారం కోల్పోయిన వైసీపీలో రాష్ట్ర రాజకీయాలేమో కానీ కుటుంబ రాజకీయాలు అంతుపట్టలేనట్టుగా ఉన్నాయి. వైఎస్.రాజశేఖర్ రెడ్డి బ్రతికున్నప్పుడు వసుదైక కుటుంబంలా కనిపించిన ఆ ఫ్యామిలీ ఆయన వెళ్లిపోయాక అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నారు. 2014 ఎన్నికల్లో వైఎస్ ఫ్యామిలీ మొత్తం అన్నకు సపోర్ట్ గా నిలిచారు. ఐతే అప్పుడు పార్టీ ఓడిపోయింది. 2019 లో కూడా వైఎస్ జగన్ కు తోడుగా కుటుంబం ఉంది. ఐతే గెలిచి అధికారం లోకి వచ్చాక జగన్ లోని మార్పుని జీర్ణించుకోలేకపోయారు.విజయమ్మ రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. షర్మిల తెలంగాణాలో రాజన్న సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందని పార్టీ పెట్టింది. ఐతే ఆమె ప్రభావం చూపలేదు కానీ దాని వల్ల ఏపీలో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఛాన్స్ దక్కించుకుంది. 2024 ఎన్నికల్లో అన్న వైఎస్ జగన్ కు పూర్తి వ్యతిరేకంగా షర్మిల ప్రచారం చేసింది. విజయమ్మ కూడా రాష్ట్ర రాజకీయాలు తనకు అవసరం లేదని ఫారిన్ వెళ్లిపోయింది. ఇక వైఎస్ వివేకా రెడ్డి హత్య కేసుపై సునీత జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది.
YS Vijayamma జగన్ తో ఇడుపులపాయకు వైఎస్ విజయమ్మ
కుటుంబం మొత్తం జగన్ కి వ్యతిరేకం కాగా ఆ కారణాలు కూడా అతన్ని ఓటమికి దగ్గర చేశాయి. జరిగిన ఎన్నికల్లో షర్మిల కడప లోక్ సభ నుంచి పోటీ చేయగా విజయమ్మ షర్మిల కోసం వీడియో బైట్ ఇచ్చి ఆమెను ఆశీర్వదించమని అన్నారు. కానీ జగన్ కోసం ఎలాంటి మాటా చెప్పలేదు. ఐతే నేడు వైఎస్సార్ జయంతి నాడు మాత్రం కొడుకు, కోడలితో పాటే ఇడుపులపాయకు వచ్చారు. తను కొడుకు పక్షానే ఉన్నానని విషయం అర్ధమవుతున్నా ఎన్నికల్లో షర్మిలకు ఎందుకు బైట్ ఇచ్చారన్నది వైసీ అభిమానులకు అర్ధం కావట్లేదు.
ఇక ఎటొచ్చి వెళ్లినా జగన్, షర్మిల ఇద్దరు తన పిల్లలే కాబట్టి ఒకరిని కాదని మరొకరిని దగ్గరకు తీసుకునే అవకాశం లేదు. అలా అని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇద్దరిని ఒకచోట చేర్చే అవకాశం కూడా లేదు. అటు జగన్ ఇటు షర్మిల మధ్యలో వైఎస్ విజయమ్మ అన్నట్టుగా పరిస్థితి మారింది. మరి వైఎస్ ఫ్యామిలీ మళ్లీ కలిసి పనిచేసే అవకాశం ఉంటుందా లేదా అన్నది ప్రశ్నార్ధకంగానే ఉంది