Uber Ola : ఓలా, ఊబర్ యజమానులకు కేంద్రం గుడ్ న్యూస్.. ప్రయాణికులకు బ్యాడ్‌న్యూస్..!
ప్రధానాంశాలు:
ఓలా, ఊబర్ యజమానులకు కేంద్రం గుడ్ న్యూస్.. ప్రయాణికులకు బ్యాడ్‌న్యూస్..!
ఇక పై ఓలా, ఊబర్ ప్రయాణికుల జేబులు ఖాళీ అయినట్లే
Uber Ola : ఓలా, ఊబర్ యజమానులకు కేంద్రం గుడ్ న్యూస్.. ప్రయాణికులకు బ్యాడ్‌న్యూస్..!
Uber Ola : కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్‌లైన్స్ (MVAG) 2025 ప్రకారం.. ఓలా, ఊబర్ వంటి క్యాబ్ సర్వీసుల్లో కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ముఖ్యంగా పీక్ అవర్స్‌లో అగ్రిగేటర్లు ఇప్పుడు బేస్ ఫేర్‌కు గరిష్టంగా రెండింతలు ఛార్జ్ చేయవచ్చు. ఇంతకు ముందు 1.5 రెట్లు మాత్రమే ఉండేది. అదే సమయంలో రద్దీ లేని సమయాల్లో (నాన్-రష్ అవర్స్) కనీసం 50% తగ్గింపుతో ఫేర్ వసూలు చేయాలని ప్రభుత్వం సూచించింది. ఈ మార్పులతో ప్రయాణికులకు గరిష్ట భారం మళ్లీ గమనించదగ్గ పరిణామం అయినప్పటికీ, తక్కువ రద్దీ సమయాల్లో తక్కువ ధరలకు ప్రయాణించే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నాయి.

Uber Ola : ఓలా, ఊబర్ యజమానులకు కేంద్రం గుడ్ న్యూస్.. ప్రయాణికులకు బ్యాడ్‌న్యూస్..!
Uber Ola : భారీగా పెరగనున్న ఓలా, ఊబర్ చార్జీలు
రద్దు ఛార్జీల విషయంలో కూడా కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. డ్రైవర్ గానీ, ప్రయాణికుడు గానీ సరైన కారణం లేకుండా రైడ్ రద్దు చేస్తే, రైడ్ ఫేర్‌లో 10% లేదా రూ. 100, ఏది తక్కువ ఉంటే అది జరిమానా విధించబడుతుంది. డ్రైవర్ రద్దు చేస్తే ఆ జరిమానాలో కొంత భాగం ప్రయాణికుడికి వెనక్కి వస్తుంది. ప్రయాణికుడు రద్దు చేస్తే కొంత భాగం డ్రైవర్‌కు ఇస్తారు. ఇది డ్రైవర్, ప్రయాణికుల మధ్య జరుగుతున్న తరచు రద్దు వివాదాలకు చెక్ పెట్టే విధంగా ఉంటుంది.
బేస్ ఫేర్‌ను నిర్ణయించే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంటుంది. కానీ ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం బేస్ ఫేర్‌ను నిర్దిష్టంగా నిర్ణయించకపోతే, అగ్రిగేటర్ (ఓలా/ఊబర్) తాము వసూలు చేసే ఫేర్‌ను ముందుగానే ప్రభుత్వానికి తెలియజేయాలి. అంతేకాకుండా, డ్రైవర్ ప్రయాణికుడిని పికప్ చేసేందుకు వచ్చే డెడ్ మైలేజ్ ఖర్చును భర్తీ చేయడానికి కనీసం 3 కి.మీ. దూరం వరకు బేస్ ఫేర్ వసూలు చేయవచ్చు. అంటే పికప్ స్థలానికి వచ్చే ప్రయాణానికి అదనపు ఛార్జీ ఉండదు, కానీ రైడ్ తక్కువ దూరం అయితే అది పరిగణనలోకి తీసుకుంటారు. ఈ మార్గదర్శకాలు ప్రయాణికులు, డ్రైవర్లు ఇద్దరికీ సమాన న్యాయం కల్పించేలా రూపొందించబడ్డాయని కేంద్రం స్పష్టం చేసింది.