Uber Ola : వేర్వేరు ఛార్జీలపై ఉబర్, ఓలాకు కేంద్రం నోటీసులు..!
ప్రధానాంశాలు:
Uber & Ola : వేర్వేరు ఛార్జీలపై ఉబర్, ఓలాకు కేంద్రం నోటీసులు
Uber & Ola : క్యాబ్ అగ్రిగేటర్లు ఓలా మరియు ఉబెర్ లకు కేంద్ర ప్రభుత్వం నోటీసు జారీ చేసింది. వారు ఉపయోగిస్తున్న పరికరాన్ని బట్టి వారి యాప్ లపై వేర్వేరు ధరలను నిర్ణయించడంపై పలువురు వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో కేంద్రం ఈ చర్యలు చేపట్టింది.కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ & నూతన మరియు పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి గురువారం ట్వీట్ చేస్తూ, కేంద్ర వినియోగదారుల రక్షణ అథారిటీ (CCPA) ద్వారా తన విభాగం రెండు కంపెనీలకు నోటీసు పంపిందని, వారి ప్రతిస్పందన కోరుతూ నోటీసు పంపిందని చెప్పారు.
Uber Ola ఎందుకిలా.. కేంద్ర ప్రభుత్వం సీరియస్..
“ఉపయోగిస్తున్న వివిధ రకాల మొబైల్స్ (ఐఫోన్లు/ఆండ్రాయిడ్) ఆధారంగా స్పష్టమైన వేర్వేరు ధరలను గతంలో గమనించిన నేపథ్యంలో, CCPA ద్వారా వినియోగదారుల వ్యవహారాల శాఖ, ప్రధాన క్యాబ్ అగ్రిగేటర్లు ఓలా మరియు ఉబెర్ లకు నోటీసులు జారీ చేసి, వారి ప్రతిస్పందనలను కోరింది” అని జోషి ట్వీట్ చేశారు.
ఆండ్రాయిడ్ ఫోన్‌లను ఉపయోగించే వారి కంటే ఐఫోన్ వినియోగదారుల నుండి ఒకే రైడ్‌కు ఎక్కువ ధరలు వసూలు చేస్తున్నారని వీడియోలతో సోషల్ మీడియాలో వినియోగదారులు అనేక మంది ఫిర్యాదు చేశారు. ఆహార పంపిణీ మరియు ఫాస్ట్ డెలివరీ వాణిజ్య వ్యవహారాలకు సంబంధించి కూడా పౌరులు ఇలాంటి సమస్యనే లేవనెత్తారు.