Free Electricity : రైతులకు మరో గుడ్‌న్యూస్.. ఉచిత విద్యుత్‌పై మరో పథకం..!
Free Electricity : లక్నో : రైతుల సంక్షేమార్థం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నాయి. పెట్టుబడి సాయం, రుణమాఫీ, పంటలకు కనీస మద్దతు ధర కల్పించడం, ఎరువులు, విత్తనాలపై సబ్సిడీ వంటివి అందిస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణలోనైతే ఆ రాష్ర్ట ప్రభుత్వం తమ రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నది. ఇదే బాటలో మరో రాష్ర్టం అడుగులు వేసింది. తాజాగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తమ రైతులకు ఉచిత విద్యుత్‌ను అందించేందుకు […]
ప్రధానాంశాలు:
Free Electricity : రైతులకు మరో గుడ్‌న్యూస్.. ఉచిత విద్యుత్‌పై మరో పథకం..!
Free Electricity : లక్నో : రైతుల సంక్షేమార్థం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నాయి. పెట్టుబడి సాయం, రుణమాఫీ, పంటలకు కనీస మద్దతు ధర కల్పించడం, ఎరువులు, విత్తనాలపై సబ్సిడీ వంటివి అందిస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణలోనైతే ఆ రాష్ర్ట ప్రభుత్వం తమ రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నది. ఇదే బాటలో మరో రాష్ర్టం అడుగులు వేసింది. తాజాగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తమ రైతులకు ఉచిత విద్యుత్‌ను అందించేందుకు ముందుకు వచ్చింది. రైతులకు 12 గంటల పాటు ఉచిత కరెంట్ అందించేందుకు ముందుకు వచ్చింది.
గౌతమ్ గౌతమ్‌బుద్ జిల్లాలో రిజిస్ర్టేషన్లు సైతం ప్రారంభమయ్యాయి. జిల్లాలోని దాదాపు 18 గ్రామాల్లో ఏర్పాటు చేసిన శిబిరాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇంతకుముందు ఇది ఆగస్టు 5 నుండి ఆగస్టు 10 మధ్య జరగాల్సి ఉండగా, ఇప్పుడు చివరి తేదీని ఆగస్టు 16 వరకు పొడిగించారు. నోయిడా విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రవీణ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. కోట్, లుహర్లీ మరియు 33/11 కెవి సబ్‌స్టేషన్‌లకు అనుసంధానించబడిన వివిధ గ్రామాల్లో అలాగే NTPC రోడ్,
దాద్రీ, నాయి బస్తీ, ఫలోడా, జర్చా, డేటావాలి, సైంతాలి, ఖతానా తదితర ప్రాంతాల్లో ఈ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు 8న బీల్, అక్బర్‌పూర్, చాపాల్స్, నరోలిలో, ఆగస్టు 9న రామ్‌గఢ్, నాంగ్లా, చమ్రు మరియు బిసహారాలో క్యాంపులను ఏర్పాటు చేస్తారు. ఇక ఆగస్టు 10న బోడకి, చినసా, పటాడిలో ఏర్పాటు చేయనున్నారు. ప్రైవేట్ మోటారు కనెక్షన్ ఉన్న రైతులకు ప్రయోజనం చేకూర్చడమే ఈ శిబిరాల లక్ష్యం అని, సాధారణ ప్రజలు విద్యుత్ బిల్లులు బకాయిలు చెల్లించి.. ఈ ఉచిత విద్యుత్ పథకానికి నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.