Venu Swamy : వేణు స్వామి నోట్లోంచి 2024 CMఎవరో తెలిసిపోయింది ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Venu Swamy : వేణు స్వామి నోట్లోంచి 2024 CMఎవరో తెలిసిపోయింది !

 Authored By kranthi | The Telugu News | Updated on :14 June 2023,10:00 am

Venu Swamy : ఏపీలో ఎన్నికలు ఇంకా సంవత్సరం సమయం ఉంది. కానీ.. ఇప్పటి నుంచే ఎన్నికలకు ప్రధాన పార్టీలన్నీ సమాయత్తం అవుతున్నాయి. ఈనేపథ్యంలో ఏపీలో రాబోయే ఎన్నికల్లో గెలిచేది ఎవరు.. ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనేదానిపై ప్రస్తుతానికి సస్పెన్సే. కానీ.. 2024 ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో వేణు స్వామి ముందే చెప్పేశారు. ప్రస్తుతం ఏపీలో పొత్తుల రాజకీయం నడుస్తోంది. దీంతో పొత్తులపై కూడా ఆయన ముందే చెప్పేశారు. అసలు పొత్తు కూడా ఏ పార్టీతో ఉంటుందో… ఏ పార్టీలు పొత్తు కుదుర్చుకుంటాయో చెప్పుకొచ్చారు.

అసలు అంచనా వేసిన దానికంటే కూడా విభిన్నంగా వేణు స్వామి ఈసారి పొత్తులు ఉంటాయని స్పష్టం చేశారు. టీడీపీ, జనసేన పార్టీతో పొత్తు ఉంటుందని చెప్పుకొచ్చారు. నిజానికి టీడీపీ, జనసేన పొత్తు అందరూ అనుకున్నదే. టీడీపీ, జనసేన పొత్తులో పలు పరిణామాలు చోటు చేసుకుంటాయని కూడా ఆయన తెలిపారు. ఇక.. తెలంగాణ రాజకీయాలపై కూడా వేణు స్వామి పలు ఆసక్తికర కామెంట్లు చేశారు. తెలంగాణలో బీజేపీ మూడో స్థానానికే పరిమితం అవుతుందని ఆయన స్పష్టం చేశారు.

who will be the next ap cm 2024 Venu Swamy

who will be the next ap cm 2024 Venu Swamy

Venu Swamy : ఏపీలో ఎవరిది అధికారం?

ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఎవరిది అధికారం అనేదానిపై ఇప్పటి వరకు క్లారిటి లేదు. కానీ.. వేణు స్వామి ఏమంటున్నారో తెలుసా? పార్టీల ప్రకారం చూసుకుంటే ఏపీలో మళ్లీ జగన్ దే అధికారం అంటున్నారు. జగన్ గెలుస్తారని, రెండో స్థానంలో చంద్రబాబు ఉంటారని, పవన్ కళ్యాన్ మూడో స్థానంలో ఉంటారని చెప్పుకొచ్చారు. అంటే.. మళ్లీ సీఎం జగనే అన్నమాట. అలాగే.. ఏపీ రాజకీయాల్లో చాలా అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటాయని చెప్పుకొచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో పలు అరెస్టులు కొనసాగుతాయట. ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయట. చివరి వరకు ఏపీలో పొత్తులపై ఎలాంటి క్లారిటీ ఉండదని చెప్పుకొచ్చారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది