Students : విద్యార్థులకు గుడ్ న్యూస్… కేంద్ర పథకం కింద రూ. 4 లక్షలు…ఇప్పుడే పొందండి…! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Students : విద్యార్థులకు గుడ్ న్యూస్… కేంద్ర పథకం కింద రూ. 4 లక్షలు…ఇప్పుడే పొందండి…!

Students : విద్య లక్ష్మీ పోర్టల్ : కేంద్రం విద్యార్థులకు ప్రత్యేక మార్గాల ద్వారా నిధులను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఈ సొమ్ములో కొంత భాగం వరకు ఉచితం. మరికొంత స్కాలర్ షిప్ రూపంలో వస్తుంది. ఇంకొంత రుణం రూపంలో వస్తుంది. మరికొంత గ్రాంట్ రూపంలో రానున్నది. అయితే ఈ నాలుగు లక్షల రూపాయలను ఎలా పొందాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం ఒక నిబంధన అయితే పెట్టింది. దీని ప్రకారం చూస్తే ఉన్నత విద్యను చదవాలి […]

 Authored By ramu | The Telugu News | Updated on :21 June 2024,9:00 am

Students : విద్య లక్ష్మీ పోర్టల్ : కేంద్రం విద్యార్థులకు ప్రత్యేక మార్గాల ద్వారా నిధులను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఈ సొమ్ములో కొంత భాగం వరకు ఉచితం. మరికొంత స్కాలర్ షిప్ రూపంలో వస్తుంది. ఇంకొంత రుణం రూపంలో వస్తుంది. మరికొంత గ్రాంట్ రూపంలో రానున్నది. అయితే ఈ నాలుగు లక్షల రూపాయలను ఎలా పొందాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం ఒక నిబంధన అయితే పెట్టింది. దీని ప్రకారం చూస్తే ఉన్నత విద్యను చదవాలి అనుకునే వారికి విద్యార్థులకు ఆర్థిక సమస్యలు అడ్డం కాకూడదు అనే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకువచ్చింది. అందుకే కేంద్ర ప్రభుత్వం విద్యాలక్ష్మి పోర్టల్ ను తెచ్చింది. దీంతో విద్యార్థులు రుణాలు మరియు స్కాలర్ షిప్ లను పొందుతారు. ఈ పోర్టల్ ని ప్రోటీన్ ఎగోవ్ టెక్నాలజీ లిమిటెడ్ అనగా NSDL ఈ గవర్నెన్స్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ నిర్వహించింది. ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్,సెంట్రల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్,సెంట్రల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఈ విషయములో ఎంతో కృషి చేసింది. విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ హోటల్ లో తయారు చేసింది. ఈ పోర్టల్ బ్యాంకులో మరియు విద్యార్థుల మధ్య వర్తిగా పని చేయనుంది. కావున విద్యార్థులు సులువుగా రుణాలను పొందుతారు…

Vidyalakshmi central scheme Students విద్యాలక్ష్మి పోర్టల్ యొక్క ప్రయోజనాలు

స్టడీ రుణం కోసం విద్యార్థులు బ్యాంక్ చుట్టూ తిరిగే పని లేదు. ఎందుకు అంటే. వారు విద్యాలక్ష్మి పోర్టల్ ద్వారా రుణాన్ని పొందుతారు. కాబట్టి ఈ పోర్టల్ ద్వారా ఏదైనా ఇతర బ్యాంకు రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థులు ఈ పోర్టల్ లో బ్యాంకులు అందించే రుణం యొక్క పథకం గురించి సమాచారాన్ని కూడా తెలుసుకోవచ్చు. ఏకకాలంలో విద్యార్థులు ఇతర బ్యాంకులకు కూడా దరఖాస్తులు చేసుకోవచ్చు. ఒక దరఖాస్తు ఫారమ్ ను వాడవచ్చు. నేషనల్ స్కాలర్ షిప్ పోర్టల్ కి లింక్ ను సృష్టించటం వలన విద్యార్థులు ఎన్నో ప్రభుత్వ స్కాలర్షిప్ అవకాశాలను పొందుతారు. అర్హత కలిగినటువంటి విద్యార్థులు విద్యాలక్ష్మి పోర్టల్ ను వాడండి. అలాగే వడ్డీ రాయితీలు కూడా మీరు పొందుతారు. ఇది అనేది విద్య రుణ వడ్డీ ప్రయోజనాల కోసం, సెంట్రల్ సెక్టర్ వడ్డీ రాయితీకి కట్టుబడి ఉండేలా చూస్తుంది. కొన్ని సందర్భాలలో రెండవ రుణానికి కూడా అర్హతను పొందవచ్చు..

Vidyalakshmi central scheme Students విద్యాలక్ష్మి పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అర్హత

విద్యార్థులు భారతీయ పౌరులై ఉండాలి. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు 10+2 బోర్డు పరీక్షలలో ఉత్తీర్ణులై ఉండాలి. కాలేజీలో అడ్మిషన్ పొందాలి అని అనుకుంటే వారు మెరిట్ ప్రవేశ పరీక్షలో కూడా ఉత్తీర్ణత సాధించి తీరాలి. భారతదేశంలో లేక ఇతర దేశాలలో విద్యార్థులు చదువుకునేందుకు రుణాల కోసం దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ పోర్టల్ ద్వారా మీరు ఎటువంటి తనిఖీ అనేది లేకుండా రూ. 4 లక్షల వరకు రుణాన్ని పొందవచ్చు. ఈ రుణం వడ్డీ రేటు 8.4 శాతం నుండి మొదలవుతుంది. ఈ రుణం మొత్తాన్ని కూడా 15 సంవత్సరాలలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది..

విద్య లక్ష్మి పోర్టల్ దరఖాస్తు చేసుకోవటానికి అవసరమైన పత్రాలు : KYC పత్రాలు, గత ఆరు నెలల బ్యాంక్ పాస్ బుక్ స్టేట్ మెంట్, గ్యారంటర్ ఫారమ్, పదవ మరియు 12వ తరగతి మార్క్ షీట్లు, గ్రాడ్యుయేషన్ కోర్సులు, ఫీజు వివరాలతో పాటు కాలేజీ లేక యూనివర్సిటీ అడ్మిషన్ కార్డు కాపి.

విద్యాలక్ష్మి పోర్టల్ ను ఎలా నమోదు చేసుకోవాలి : ముందుగా విద్యలక్ష్మి అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్ళాలి. ఆ వెబ్సైట్లో https://www.vidyalakshmi.co.in/students కి వెళ్ళాలి. హోమ్ పేజీలో రిజిస్టర్ క్యాబ్ పై క్లిక్ చేయాలి. రిజిస్ట్రేషన్ కు సంబంధించిన ఒక ఫారమ్ స్క్రీన్ పై వస్తుంది. ఇప్పుడు మీరు మీ పేరు, మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ లాంటి అవసరమైన అన్ని వివరాలను కూడా తెలపాలి. దాని తర్వాత క్యాప్చ కోడ్ ని కూడా నమోదు చేసి, డిక్లరేషన్ ను అంగీకరించాలి. అది అయిన తర్వాత సబ్మిట్ బటన్ ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు యాక్టివేషన్ లింకు, మీ రిజిస్టర్ ఈమెయిల్ ఐడి వచ్చిద్ది. అప్పుడు ఆ లింకు పై క్లిక్ చేయాలి. దీంతో రిజిస్టర్ అనేది పూర్తి అవుతుంది..

Vidyalakshmi central scheme Students విద్యాలక్ష్మి పోర్టల్ ను లాగిన్ చేయడం ఎలా

పోర్టల్ లాగిన్ ట్యాబ్ పై క్లిక్ చేయాలి. తర్వాత దానిపై విద్యార్థి లాగిన్ క్లిక్ చేయాలి. అప్పుడు స్క్రీన్ పై లాగిన్ పేజీ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు మీ రిజిస్టర్ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, క్యాప్చ కోడ్ నమోదు చేయాలి. దాని తర్వాత మీరు నమోదిత ఖాతాకు లాగిన్ చేయడానికి లాగిన్ బటన్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది.

Students విద్యార్థులకు గుడ్ న్యూస్ కేంద్ర పథకం కింద రూ 4 లక్షలుఇప్పుడే పొందండి

Students : విద్యార్థులకు గుడ్ న్యూస్… కేంద్ర పథకం కింద రూ. 4 లక్షలు…ఇప్పుడే పొందండి…!

విద్యాలక్ష్మి పోర్టల్ లో ఎడ్యుకేషన్ లోన్ శోధించటానికి దశలు : విద్యాలక్ష్మి పోర్టల్ లో ఎడ్యుకేషన్ లోన్ కోసం వెతకడానికి ముందుగా పోర్టల్ లోని రుణాల కోసం శోధన క్యాబ్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. లాగిన్ పేజీ ఓపెన్ అవుతుంది. అప్పుడు మీరు మీ రిజిస్టర్ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ క్యాప్చకోడ్ నమోదు చేయాలి. దాని తర్వాత లాగిన్ అయ్యేందుకు లాగిన్ బటన్ పై కూడా క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ ఖాతా డాష్ బోర్డు పై వస్తుంది. అప్పుడు మీరు స్టడీ లొకేషన్ కోర్సు కావలసిన లోన్ ఎంచుకొని సెర్చ్ బటన్ పై క్లిక్ చేస్తే చాలు,రుణ పథకాలు మరియు వాటిపై అందించే బ్యాంకుల జాబితా మీ స్క్రీన్ పై వస్తుంది. దాని తర్వాత బ్యాంకుని ఎంచుకొని లోన్ రిపే మెంట్ ఆప్షన్లను ఎంచుకోవాలి. దాని తర్వాత అభ్యర్థించిన పత్రాలను కూడా అప్లోడ్ చేయాలి. దానిపై సమర్పించు క్లిక్ చెయ్యండి..

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది