Vijayasai Reddy : వైఎస్ జగన్ కి కౌంటర్ ఇచ్చిన విజయసాయి రెడ్డి.. విలువలు, విశ్వసనీయత ఉంది కాబట్టే వదిలేశా..!
ప్రధానాంశాలు:
Vijayasai Reddy : వైఎస్ జగన్ కి కౌంటర్ ఇచ్చిన విజయసాయి రెడ్డి.. విలువలు, విశ్వసనీయత ఉంది కాబట్టే వదిలేశా..!
Vijayasai Reddy : వైసీపీ చీఫ్, మాజీ సీఎం జగన్ Ys Jagan తనపై చేసిన కామెంట్స్ పై మాజీ రాజ్యసభ సభ్యడు విజయసాయి రెడ్డి Vijaya sai Reddy తనదైన శైలిలో స్పందించారు. రీసెంట్‌గా జరిగిన ప్రెస్‌మీట్‌లో విజసాయిరెడ్డి గురించి ప్రస్తావించారు జగన్. రాజకీయాల్లో ఉన్న వ్యక్తులకు విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉండాలని అటువంటప్పుడే అతడిని నాయకుడిగా ఎదుటివాళ్లు చూపిస్తారని, కాలర్ ఎగరేసుకుని తిరగడానికి కూడా వీలుంటుందని విజయసాయి రెడ్డిని ఉద్దేశించి అన్నారు.
![Vijayasai Reddy వైఎస్ జగన్ కి కౌంటర్ ఇచ్చిన విజయసాయి రెడ్డి విలువలు విశ్వసనీయత ఉంది కాబట్టే వదిలేశా](https://thetelugunews.com/wp-content/uploads/2025/02/Ys-jagan-3.jpg)
Vijayasai Reddy : వైఎస్ జగన్ కి కౌంటర్ ఇచ్చిన విజయసాయి రెడ్డి.. విలువలు, విశ్వసనీయత ఉంది కాబట్టే వదిలేశా..!
Vijayasai Reddy మాజీ సీఎంకే కౌంటరా..
ఇక సాయిరెడ్డితో పాటు పార్టీ నుంచి వెళ్లి పోయిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు విషయంలో ఎవరికైనా ఇదే వర్తిస్తుంది అని చెప్పారు. దీంతో తనకు వ్యతిరేకంగా జగన్ Jaganఇచ్చిన వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు మాజీ ఎంపీ. జగన్ చెప్పిన విలువలు, విశ్వసనీయత అనే వ్యాఖ్యలనే ఆధారంగా చేసుకుని విజయసాయి స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇచ్చారు.వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్నవాడిని కాబట్టే, ఎవరికీ ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదు. భయం అనేది నాలో ఏ అణువు అణువులోనూ లేదు కాబట్టే రాజ్యసభ Rajya Sabha పదవిని, పార్టీ పదవులతో పాటు రాజకీయాలనే వదులుకున్నా’’ అంటూ ట్వీట్ చేశారు మాజీ ఎంపీ. ఇప్పుడు ఇద్దరి మధ్య ఏం జరిగి ఉంటుందా అనే విషయం చర్చనీయాంశంగా మారింది.
భయం లేదు కాబట్టే అన్ని పదవులను వదులుకున్నట్లు తెలిపారు. అయితే ఈ కౌంటర్‌తో విజయసాయి, జగన్‌కు మధ్య యుద్ధం మొదలైనట్లు చెప్పుకోవచ్చు. సాధారణంగా జగన్ వ్యాఖ్యలకు ఎప్పుడూ కూడా కౌంటర్ ఇవ్వని విజయసాయిరెడ్డి తొలిసారిగా గట్టిగానే కౌంటర్ ఇవ్వడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. స్పందిచారు. వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్న వాడిని కాబట్టే, ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదన్నారు. భయం అనేది తనలో ఏ అణువు అణువు లోను లేదు కాబట్టే రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని మరి రాజకీయాలనే వదులుకున్నానని తెలిపారు. ఆ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.