Ys Jagan : ఈ సారి జగన్ 2.0ని చూస్తారు.. కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిని ఎవరిని వదిలిపెట్టను.. జగన్
ప్రధానాంశాలు:
Ys Jagan : ఈ సారి జగన్ 2.0ని చూస్తారు.. కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిని ఎవరిని వదిలిపెట్టను.. జగన్
Ys Jagan : మాజీ సీఎం వైఎస్ జగన్ Ys Jagan తాజాగా ఊహించని కామెంట్స్ చేశారు. ఏపీలో అధికారం కోల్పోయాక వరుస ఎదురుదెబ్బలు తింటున్న నేపథ్యంలో వైసీపీ Ysrcp అధినేత వైఎస్ జగన్ ఇవాళ క్యాడర్ తో చాలా ఆసక్తికర కామెంట్స్ చేశారు. జగన్ 2.0ను చూస్తారంటూ వారికి హామీ ఇచ్చారు. తాజాగా విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన జగన్ .. పార్టీ నేతల్లో స్తబ్దతను తొలగించే ప్రయత్నం చేశారు.
Ys Jagan జగన్ 2.ఓ
చంద్రబాబు Chandrababu Naidu మిమల్ని పెడుతున్న బాధల్ని, కష్టాల్ని చూశానని, ఇబ్బందులు పెట్టిన వారిని ఎక్కడున్నా తీసుకొచ్చి చట్టం ముందు నిలబడతా అంటూ జగన్ హెచ్చరికలు చేశారు. అక్రమ కేసులు పెట్టిన వారిపై ప్రైవేటు కేసులు వేస్తానని తెలిపారు. ఈసారి జగన్ 2.0ని చూడబోతున్నారని మాజీ సీఎం వెల్లడించారు.
తొలి విడతలో ప్రజల కోసం తాపత్రయం పడ్డానని, వారికి మంచి చేసే విషయంలో కార్యకర్తలకు న్యాయం చేయలేకపోయానని జగన్ అంగీకరించారు. ఈసారి మాత్రం అలా ఉండదని నేతలకు జగన్ హామీ ఇచ్చారు. గతంలో ఎన్నికల్లో ఇచ్చిన 99 శాతం హామీలు అమలు చేశామని, కోవిడ్ ప్రభావం పడినా దాన్ని ఎదుర్కొని క్యాలెండర్ ఇచ్చి మరీ సంక్షేమ పథకాలు అందించామని గుర్తుచేశారు. వైసీపీ మాత్రమే గతంలో అన్ని కార్పోరేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికల్ని క్లీన్ స్వీప్ చేయగలిగిందన్నారు.