vizag : విశాఖలో వైసీపీ భయానికి కారణమేంటి..? వ్యూహంలో భాగమేనా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

vizag : విశాఖలో వైసీపీ భయానికి కారణమేంటి..? వ్యూహంలో భాగమేనా..?

 Authored By brahma | The Telugu News | Updated on :7 March 2021,12:45 pm

vizag : విశాఖపట్నం రాష్ట్రానికి కాబోయే రాజధాని అంటూ సీఎం జగన్ ప్రకటించాడు. ఎంతో వ్యతిరేకత వచ్చిన కానీ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. అది చూసి వామ్మో జగన్ గుండె సామాన్యమైనది కాదు అని అనుకున్నారు. ఎలాంటి భయం లేకుండా, బెరుకు లేకుండా పరిపాలన చేస్తున్న జగన్, తాజాగా జరుగుతున్నా మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం కొంచం భయపడుతున్నట్లే కనిపిస్తున్నాడు.

vizag

vizag

vizag : మేయర్ అభ్యర్థిపై గందరగోళం

విశాఖ మున్సిపల్ ఎన్నికల్లో దాదాపు 98 డివిజన్స్ లో తమ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ పార్టీ, మేయర్ అభ్యర్థి ఎవరు అనేది మాత్రం ప్రకటించలేదు. విశాఖ మేయర్ స్థానం బిసి జనరల్‌కు రిజర్వేషన్ ఖరారయింది. దీంతో ఆశావహులైన అభ్యర్థుల కోసం ప్రధాన పార్టీలు జల్లెడ పడితే తెలుగుదేశం పార్టీ నుంచి నలుగురు క్లీన్ చిట్ ఉన్న అభ్యర్థులు తెరపైకి వచ్చారు. వారిలో ఒకరిని ఖరారు చేస్తూ పీలా శ్రీనివాస్ పేరును ఐదు రోజుల క్రితమే పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కార్పొరేటర్ అభ్యర్థుల జాబితాతో పాటు విడుదల చేశారు. అనంతరం శుక్రవారం చంద్రబాబు రోడ్ షోలో బహిరంగంగా ప్రకటించారు.

నీ వైసీపీ మాత్రం తమ అభ్యర్థిని ప్రకటించలేదు. దీనికి ప్రధాన కారణం టీడీపీ ప్రకటించిన అభ్యర్థి ని చెపుతున్నారు. ఎన్నికల సమయంలో అవతలి అభ్యర్థి ఎవరు అనే దానిని గమనించి మిగిలిన పార్టీలు తమ తమ అభ్యర్థిని రంగంలోకి దించుతాయి. టీడీపీ నుండి పల్ల శ్రీనివాసును ఖారారు చేయటంతో వైసీపీలో అతనికి పోటీ ఇచ్చే నేత కనిపించలేదని తెలుస్తుంది. దాదాపు 30 ఏళ్ల నుండి రాజకీయంలో ఉంటున్న పల్ల శ్రీనివాసు కు క్లిన్ చిట్ ఉంది. అలాంటి నేత వైసీపీ కి లేకపోవటం వెలితే అని చెప్పాలి.

ముఖ్యంగా పార్టీ అధికారంలో ఉండటంతో ఆశావహులు సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. ముందుగానే మేయర్ అభ్యర్థి ఎవరు అనేది ప్రకటిస్తే ఆ తరువాత రెబల్స్ ఎక్కువయ్యే అవకాశం లేకపోలేదు. ఈ భయంతో కూడా వైసీపీ మేయర్ అభ్యర్థి ఎవరు అనేది ఫైనల్ చేయలేదని తెలుస్తుంది. ఉన్నత విద్యనభ్యసించిన బీసీ మహిళను ఆస్థానంలో కూర్చోబెట్టాలని అధిష్ఠానం యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు వంశీకృష్ణ పేరు విస్తృతంగా ప్రచారంలో ఉంది.

ప్రధానంగా 21 వ వార్డు అభ్యర్థి సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్, పెందుర్తి ప్రాంతానికి చెందిన శరగడం చిన అప్పలనాయుడు, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తనయుడు వంశీకృష్ణ పేర్లు కూడా ఈ రేసులో ఉన్నట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఒకవేళ మహిళా నేతకే ఈ అవకాశం దక్కితే, తొమ్మిదో వార్డు నుంచి పోటీ చేస్తున్న వెంకటరత్నం స్వాతితో పాటు, 12వ వార్డు నుంచి పోటీ చేస్తున్న రోహిణి, 75‌వ వార్డు నుంచి పోటీ చేస్తున్న తిప్పల జ్వాల పేర్లు తెరపైకి వచ్చే అవకాశం ఉంది. విశాఖ మేయర్ సీటు వైసీపీ కైవసం చేసుకుంటే పైనా పేర్కొన్న వాళ్లలో ఎవరికో ఒకరికి మేయర్ పదవి దక్కే అవకాశం ఉంది.

brahma

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది