KCR VS Tummala : కేసీఆర్‌కు నేనే మంత్రి పదవి ఇప్పించా అన్న తుమ్మల.. ఓడిపోయినా పిలిచి మంత్రి పదవి ఇచ్చా అన్న కేసీఆర్
ప్రధానాంశాలు:
కేసీఆర్ కు నిజంగానే తుమ్మల మంత్రి పదవి ఇప్పించారా?
తుమ్మలకు, కేసీఆర్ కు ఎక్కడ చెడింది?
తుమ్మలను కావాలని ఖమ్మంలో ఓడించారా?
KCR VS Tummala : ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు ఇటీవలే బీఆర్ఎస్ పార్టీకి బైబై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అయితే.. తుమ్మల నాగేశ్వరరావు చాలా రోజుల నుంచి బీఆర్ఎస్ లో యాక్టివ్ గా లేరు. 2018 ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన తుమ్మల.. 2018 ఎన్నికల్లో ప్రస్తుతం మంత్రిగా ఉన్న పువ్వాడ అజయ్ చేతిలో ఘోరంగా ఓటమి చెందారు. అప్పటి నుంచి తుమ్మల నాగేశ్వరరావు పార్టీలో అంటీముట్టనట్టు ఉన్నారు. నిజానికి తుమ్మల నాగేశ్వరరావు ఓడిపోవడంతో.. పువ్వాడ అజయ్ బీఆర్ఎస్ లో చేరారు. అప్పటి నుంచి ఇంకా తుమ్మలకు పార్టీపై విసుగు వచ్చింది. అజయ్ బీఆర్ఎస్ లో చేరడంతో ఖమ్మం జిల్లాలో తుమ్మల ప్రభావం తగ్గింది. అలాగే.. ఆయన పార్టీకి దూరమయ్యారు కానీ.. పార్టీని వీడలేదు. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడటంతో తన రాజకీయ భవిష్యత్తు కోసం బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ తరుపున ఖమ్మం నుంచి పోటీ చేస్తున్నారు.
ఈనేపథ్యంలో ఇటీవల ఖమ్మం బహిరంగ సభలో సీఎం కేసీఆర్ తుమ్మల ప్రస్తావన తీసుకొచ్చారు. తుమ్మలకు నేను అన్యాయం చేశానని మాట్లాడుతున్నారు. ఆయన ఖమ్మంలో ఓడిపోయారు అజయ్ తో. ఓడిపోయిన తర్వాత ఇంట్లోకి పోయి మూలకు కూర్చొంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను పాత స్నేహితం ఉందని.. సీనియర్ నాయకుడు అని మంత్రి పదవి ఇచ్చి.. ఎమ్మెల్సీని చేసి మళ్లీ టికెట్ ఇచ్చాను. పాలేరు నుంచి ఉపఎన్నికలో టికెట్ ఇచ్చి మేమంతా వచ్చి దండం పెడితే బ్రహ్మాండంగా గెలిపించారు. నేను ఒక్కటే చెబుతున్నా. నువ్వు ఓడిపోయి ఉంటే.. మంత్రిని చేసి, ఎమ్మెల్సీని చేసి, ఎమ్మెల్యేను చేస్తే 5 ఏళ్లు జిల్లా మీద ఏకఛత్రాధిపత్యం ఇస్తే నువ్వు చేసింది ఏంటి.. గుండు సున్నా. ఖమ్మం జిల్లాలో ఒక్క సీటు రాకుండా చేశావు. ఎవరు ద్రోహం చేశారు. ఎవరు, ఎవరికి అన్యాయం చేశారు. బీఆర్ఎస్ తుమ్మలకు అన్యాయం చేసిందా? లేదా తుమ్మల బీఆర్ఎస్ కు అన్యాయం చేశాడా? మీరే చెప్పాలి అని కేసీఆర్ సభాముఖంగా చెప్పారు.
KCR VS Tummala : కేసీఆర్ కు తుమ్మల కౌంటర్
నేను ప్రజల కోసమే పార్టీలోకి వెళ్లాను తప్పితే పదవుల కోసం కాదు. పదవులన్నీ నన్ను వెతుక్కుంటూ వస్తున్నాయి తప్పితే నేను ఎవరి దగ్గరికి వెళ్లి దేహీ అని పదవుల కోసం అడుక్కోలేదు. నీ పదవులు కూడా ఒకప్పుడు నేను ఇచ్చే స్థితిలో ఉన్నా. 1995 లో నీకు ట్రాన్స్ పోర్ట్ మినిస్ట్రీ ఇచ్చే దాంట్లో నా భాగస్వామ్యం ఉంది. నువ్వు ఈరోజు పదవి ఇచ్చేదేంది. నీకోసం, నీ పార్టీ కోసం, ఈ జిల్లా అభివృద్ధి కోసం 5 ఏళ్లు త్యాగం చేశాను. అందలం ఎక్కించా. దాన్ని ఓర్వలేక ఈ జిల్లాలో నీ కుటుంబ సభ్యులే డబ్బులు ఇచ్చి మరీ నన్ను ఓడించారు.. అని తుమ్మల మండిపడ్డారు.