ys jagan : పుదుచ్చేరి రాజకీయ కల్లోలంలో జగన్ హస్తముందా..?
ys jagan : సరిగ్గా ఎన్నికల నోటిఫికేషన్ రావటానికి ఐదారు రోజుల ముందు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయటం, తద్వారా ప్రభుత్వం పడిపోవటం, బలనిరూపణ విషయంలో ఆ పార్టీ నెగ్గకపోవటం, దీనితో వెనువెంటనే అక్కడ రాష్ట్రపతి పాలన విధించటం జరిగింది. ఇది ఎక్కడో కాదు పుదుచ్చేరి లో ఈ మధ్య జరిగిన వరస సంఘటనలు. వింటుంటే బహుశా సినిమాల్లో కూడా ఇలా జరగదేమో అనిపిస్తుంది. కానీ పుదుచ్చేరి లో మాత్రం ఇదే జరిగింది.
ys jagan : ఢిల్లీ టు పుదుచ్చేరి వయా ఆంధ్రప్రదేశ్.. యానాం
అయితే పుదుచ్చేరి లో ఈ పరిణామాలు జరగటం వెనుక ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి హస్తముందాని ఒక ప్రముఖ పత్రిక న్యూస్ ఐటమ్ క్యారీ చేసింది. ఆ వార్త సారాంశం ఏమిటంటే..? తమిళనాడు లో ఎలాగూ అధికారంలో రావటం కష్టమని భావిస్తున్న బీజేపీ ముందు పుదుచ్చేరిలో తమ పెత్తనం సాగించాలని ప్రణాళిక సిద్ధం చేసుకొని జగన్ ను ఉపయోగించి ఆ పని పూర్తిచేయడానికి సిద్దమైనట్లు రాసింది.
తన వీరాభిమాని, పుదుచ్చేరి కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు (యానాం)తో రాజీనామా చేయించడంతోపాటు మరికొందరి రాజీనామాలకు అవసరమైన ‘వ్యూహాత్మక అస్త్రాలను’ జగన్ సమకూర్చినట్లు కాంగ్రెస్ పార్టీ అనుమానిస్తోందని . బీజేపీ పెద్దల నిర్దేశానుసారం జగన్ పావులు కదిపారని, పుదుచ్చేరి సర్కార్‌ను ఒక పథకం ప్రకారం కూల్చివేశారని భావిస్తోంది. మల్లాడి కృష్ణారావు ద్వారానే ఈ పని పూర్తిచేశారని ఆ పత్రిక చెపుతుంది.
మల్లాడి కృష్ణారావు జనవరి 13న మంత్రి పదవికి రాజీనామా చేశారు. కానీ… సాంకేతిక కారణాల వల్ల అది ఆమోదం పొందలేదు. ఇక.. ఫిబ్రవరి 15న ఆయన ఏపీ సీఎం జగన్‌ను కలిశారు. ఆ భేటీ ముగిసిన పది నిమిషాల్లోనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించా రు. ఆ తర్వాతే పుదుచ్చేరిలో నారాయణస్వామి సర్కా రు పతనానికి పునాదులు పడ్డాయి. యానాం… పుదుచ్చేరిలో భాగం. కానీ.. తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు సమీపంలో ఉంటుంది. యానాం నుంచి మల్లాడి కృష్ణారావు పలుమార్లు ఎమ్మె ల్యేగా ఎన్నికయ్యారు.
మల్లాడి కృష్ణారావుకు సీఎం జగన్ తో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలుస్తుంది. తాను జగన్‌కు వీరాభిమానినని, ఆయన అద్భుతమైన పథకాలు ప్రవేశపెడుతున్నారని ప్రకటిస్తుంటారు. ఒకవేళ జగన్ తమిళనాడులో పార్టీ పెడితే కాంగ్రె్‌సకు రాజీనామా చేసి, జగన్ పార్టీలో చేరతానని కూడా ప్రకటించారు. జగన్ తమిళనాడు సీఎం కావాలని కూడా ఆయన ఆకాంక్షించారు.
జగన్ ప్రోద్బలంతోనే మల్లాడి కృష్ణారావు పుదుచ్చేరిలో రాజకీయ పావులు కదిపారని. తొలుత ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. జగన్‌ను కలిసొచ్చాక ఎమ్మెల్యే పదవికీ మల్లాడి రాజీనామా చేశారు. ఆ తర్వాత రాజీనామా చేసిన ఎమ్మెల్యే బీజేపీ లో చేరారని, కానీ మల్లాది కృష్ణారావు మాత్రం బీజేపీ లో కాకుండా మరో ప్రతిపక్ష పార్టీ ఎన్‌ఆర్ కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమాచారం. దీని వెనుక అమిత్ షా హస్తముందని, ఆయన దగ్గరుండి సీఎం జగన్ ను వాడుకొని మల్లాది కృష్ణారావు ను తమవైపు తిప్పుకొని పుదుచ్చేరిలో రాజకీయ ఎత్తులు వేశారని ఆ పత్రిక రాసుకొచ్చింది.