YS Bharati : వైఎస్ భారతి చేతికి ఏమైంది అని కంగారు పడుతున్న వాళ్లకి బిగ్ న్యూస్ !
YS Bharati : ఏపీ సీఎం వైఎస్ జగన్ భార్య వైఎస్ భారతి చేతికి ఏమైంది. ఎవరైనా గమనించారా? తాజాగా ఆమ చేయిని చూసి చాలామంది షాకయ్యారు. అవును.. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాను రాష్ట్ర ప్రభుత్వం సన్మానించిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఆయన కోసం ఏపీ ప్రభుత్వం విందును ఏర్పాటు చేసింది. విజయవాడలో జరిగిన ఈ కార్యక్రమానికి గవర్నర్ తో పాటు సీఎం జగన్, ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆకుల వెంకటశేషసాయి, వైఎస్ జగన్ భార్య వైఎస్ భారతి కూడా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో కనిపించిన వైఎస్ భారతి తన చేతికి కట్టుతో కనిపించారు. తన కుడి చేతికి కట్టు కట్టారు. చేయి కిందికి వదిలేయకుండా కట్టు మెడకు కట్టుకొని వచ్చారు. ఆమెను అలా చూసి చాలామంది షాక్ అయ్యారు. కుడి అసలు ఆమెకు ఏమైంది అని అందరూ షాక్ అయ్యారు. కానీ.. ఆమె చేయి బెణకడం వల్లనే అలా కట్టు కట్టుకున్నారట. అయితే.. ఆ గాయం ఎలా అయింది అనేది చాలామందికి తెలియడం లేదు.
YS Bharati : డాక్టర్ల సలహా మేరకే ఆమె ఆ కట్టు కట్టుకున్నారా?
అయితే.. వైఎస్ భారతికి చేయి బెణికినట్టు తెలుస్తోంది కానీ.. తన చేయి ఎలా బెణికిందో మాత్రం తెలియడం లేదు. కానీ.. డాక్టర్ల సలహా మేరకు వైఎస్ భారతి కట్టు కట్టుకున్నట్టు తెలుస్తోంది. కొన్ని రోజుల వరకు తనను అలాగే కట్టు కట్టుకొని ఉండాలని డాక్టర్లు సలహాలు ఇచ్చారట. అందుకే ఆ కార్యక్రమం మొత్తం ఆమె కట్టుతోనే కనిపించారు. అయితే.. ఆ కార్యక్రమానికి వచ్చిన వాళ్లంతా వైఎస్ భారతి కట్టును చూసి ఆశ్చర్యపోయారు. ఆమెకు ఏమైందని భయపడ్డారు. కానీ.. అది పెద్ద గాయం కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. నిజానికి.. తన చేయి బెణికిన తర్వాత కట్టు కట్టుకొని ఇలా భారతి బయటికి రావడం ఇదే తొలిసారి.