Kuppam : కుప్పం పోవచ్చు.. 25 వేలు ఓట్లు మైనస్.. చికిత్స చేయని బాబు.. వేరే ఆప్షన్?… వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Kuppam : కుప్పం పోవచ్చు.. 25 వేలు ఓట్లు మైనస్.. చికిత్స చేయని బాబు.. వేరే ఆప్షన్?… వీడియో

Kuppam : వైనాట్ 175. చాలా రోజుల నుంచి ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పే మాట ఇదే. ఎందుకంటే.. రాష్ట్రంలో ఉన్న 175 అసెంబ్లీ నియోజకవర్గాలను ఎందుకు గెలవలేం అని ఏపీ సీఎం జగన్ అంటున్నారు. కుప్పంలో స్థానిక ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. మరి అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు గెలవదు.. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో వైసీపీ 175 నియోజకవర్గాల్లో గెలవాలి అనేది వైసీపీ ప్లాన్. కుప్పంలో చాలా ఏళ్ల నుంచి టీడీపీ అధినేత చంద్రబాబే గెలుస్తూ […]

 Authored By kranthi | The Telugu News | Updated on :2 April 2023,4:00 pm

Kuppam : వైనాట్ 175. చాలా రోజుల నుంచి ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పే మాట ఇదే. ఎందుకంటే.. రాష్ట్రంలో ఉన్న 175 అసెంబ్లీ నియోజకవర్గాలను ఎందుకు గెలవలేం అని ఏపీ సీఎం జగన్ అంటున్నారు. కుప్పంలో స్థానిక ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. మరి అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు గెలవదు.. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో వైసీపీ 175 నియోజకవర్గాల్లో గెలవాలి అనేది వైసీపీ ప్లాన్. కుప్పంలో చాలా ఏళ్ల నుంచి టీడీపీ అధినేత చంద్రబాబే గెలుస్తూ వస్తున్నారు. కానీ.. ఈసారి కుప్పంలో వైసీపీ జెండా ఎగురుతుంది అని వైసీపీ నేతలు కాలర్ ఎగరేసి మరీ చెబుతున్నారు.

who will win in kuppam constituency

who will win in kuppam constituency

దీంతో చంద్రబాబు కూడా అలర్ట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిజానికి కుప్పంలో టీడీపీకి పక్కాగా పడే ఓట్లు కొన్ని ఉన్నాయి. అవి సుమారుగా 25 వేల వరకు ఉంటాయి. వాటిని తీసేయాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది. వాటిని ఎలా తీసేస్తుంది. అది కుదరదు కదా అంటే.. అవి బోగస్ ఓట్లు. తమిళనాడు నుంచి కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు వాళ్లను తీసుకొచ్చి బోగస్ ఓట్లు సృష్టించారు అని. ఆ బోగస్ ఓట్లు ఖచ్చితంగా చంద్రబాబుకే పడతాయి. అందుకే.. ఆ ఓట్లను తీసేయడమో లేక ఆ ఓట్లను తమవైపునకు తిప్పుకోవడమో చేసేందుకు ప్లాన్ చేస్తోంది వైసీపీ. అందుకే.. కుప్పంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న 30 వేల ఫ్యామిలీలకు వైసీపీ పలురకాలుగా డబ్బును పంచేసిందట.

2024 people will decide tdp vs ycp winner

2024 people will decide tdp vs ycp winner

Kuppam : ఆ బోగస్ ఓట్లు ప్రతిసారి చంద్రబాబుకే

వచ్చే సంవత్సరం ఎన్నికలు ముందే వెళ్లినట్టు తెలుస్తోంది. పూర్తిగా వ్యవస్థల ద్వారా టీడీపీని అష్టదిగ్భందనం చేస్తోంది వైసీపీ. కుప్పంలో ఉన్న టీడీపీ కార్యకర్తలు అంతగా యాక్టివ్ గా లేరు. ఓడిపోయే పరిస్థితి ఇప్పటి వరకు చంద్రబాబుకు రాలేదు. టీడీపీ సులభంగా అక్కడ గెలుస్తూ ఉండటంతో టీడీపీ కార్యకర్తలకు అక్కడ పోరాడే అవకాశం ఇప్పటి వరకు రాలేదు. ఇప్పుడు ఓడిపోయే ప్రమాదం ఉన్నందున.. టీడీపీ నేతలు ఇప్పుడు పోరాడాలి అంటే వాళ్లకు కష్టం అవుతోంది. అది ఒకవిధంగా టీడీపీకి మైనస్.. వైసీపీకి ప్లస్ అవుతోంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు ఎలాంటి వ్యూహాలు రచిస్తారో వేచి చూడాల్సిందే.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది