Ys Jagan : జగన్ నిర్ణయానికి కుదేలవ్వాల్సిందే.. రంగంలోకి బొత్స…!
ప్రధానాంశాలు:
Ys Jagan : జగన్ నిర్ణయానికి కుదేలవ్వాల్సిందే.. రంగంలోకి బొత్స...!
Ys Jagan : ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు ప్రారంభం అయ్యాయి. 2025-26 బడ్జెట్ సమావేశాలు కావడంతో నేడు ప్రారంభమైన ఈ సమావేశాలలో భాగంగా గవర్నర్ Governer ముందుగా తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అయితే ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశానికి వైసీపీ YCP నేతలు కూడా హాజరు అయ్యారు అయితే ఈ సభ ప్రారంభమైన పది నిమిషాలకే వారు అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లిపోయారు.

Ys Jagan : జగన్ నిర్ణయానికి కుదేలవ్వాల్సిందే.. రంగంలోకి బొత్స…!
Ys Jagan జగన్ న్యూ ప్లాన్
ప్రజల గొంతుక వినిపించాలంటే అసెంబ్లీ Assembly లో వైయస్ఆర్‌సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అన్నారు శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. సభలో ఉండేది ఒకటి అధికార పక్షం, మరోకటి ప్రతిపక్ష పక్షమన్నారు. ఆ హోదాకు ఎంతో విలువ ఉంటుందని, ప్రజల గొంతుక వినపడాలంటే.. మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వా ల్సిందేనని ఖరాకండిగా చెప్పారు. ఎమ్మెల్యేలు ఎవరు శాసన సభకి రారని, ఎమ్మెల్సీలు మాత్రం శాసన మండలి సమావేశాలకి హాజరు అవుతారని అన్నారు.
45 మంది వైసీపీ ఎమ్మెల్సీలు ఉండగా, ఓ నలుగురు దూరమయ్యారు. మండలిలో వైసీపీకి బలం గట్టిగా ఉండడంతో దానిని ఆసరా చేసుకొని రాజకీయాలు చేయాలని అనుకుంటున్నారు. బొత్స botsa satyanarayana నేతృత్వంలో కూటమి ప్రభుత్వంపై గట్టిగా ఫైట్ చేయాలని జగన్ సూచించారు. తాను బయట ఉండి ప్రభుత్వంపై యుద్ధం చేయనుండగా, మండలి వేదికగా చేసుకొని ఫైట్ చేసే బాధ్యతని బొత్సకి జగన్ అప్పగించినట్టు తెలుస్తుంది.