YS Jagan Mohan Reddy : ఈ డేరింగ్ నిర్ణయాలు చూసి వైఎస్ జగన్ ను శభాష్ అనాల్సిందే..!
ప్రధానాంశాలు:
YS Jagan Mohan Reddy : ఈ డేరింగ్ నిర్ణయాలు చూసి వైఎస్ జగన్ ను శభాష్ అనాల్సిందే..!
YS Jagan Mohan Reddy : సన్నిహితులైన సరే నమ్మకస్తుడైన సరే కొమ్ములు తిరిగిన రాజకీయ నాయకుడైనా సరే ఎలాంటి వారికైనా వై.యస్ జగన్మోహన్ రెడ్డి ఉపయోగించేది ఒకటే సూత్రం. పలాన సీట్ లో పలానా అభ్యర్థి గెలవడు అని ఆలోచన వచ్చింది అంటే చాలు ఎలాంటి మొహమాటం లేకుండా వారిని పక్కన పెడుతున్నారు. అయితే ప్రస్తుతం ఇదే ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్నన రాజకీయ స్ట్రాటజీ. అయితే ఆంధ్ర రాష్ట్రంలో మరోసారి అధికారమే లక్ష్యంగా వైఎస్ఆర్సిపి పార్టీ చేయబడుతున్న వ్యూహాలు సొంత పార్టీ నేతలకే దిమ్మతిరిగేలా చేస్తున్నాయి. పార్టీ మారుతామన్న బెదిరింపులు, నియోజకవర్గంలో ఆందోళనలు, ఇలా ఎవరు ఎన్ని చేసినా సరే దేనికి కూడా వై.ఎస్ జగన్ తలవంచటం లేదు. సిట్టింగ్ లు స్థానచరనానికి అంగీకరిస్తే సరే సరే లేకుంటే ప్లాన్ బి అమలుపరుస్తున్నారు వై.యస్ జగన్. ఈ క్రమంలోనే కొత్త అభ్యర్థులను వెంటనే తెరపైకి తీసుకువచ్చి నియోజకవర్గంలో చక్రం తిప్పేస్తున్నారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…..
ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సిద్ధమవుతున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు 65 నియోజకవర్గాలలో కో -ఆర్డినేటర్లను వైసిపి నియమించింది.అదేవిధంగా ఏడు జాబితాలో 31 సిట్టింగ్ లకు కూడా అవకాశం కల్పించింది. నియోజకవర్గంలో ఎదురవుతున్న అన్ని సమీకరణలను పరిగణలోకి తీసుకొని వైఎస్ఆర్సిపి అధిష్టానం కో-ఆర్డినేటర్లను నియమిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకు వైసీపీ పార్టీ ఏడు జాబితాలను విడుదల చేయడం జరిగింది. త్వరలో మరో జాబితాను కూడా విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే తాజాగా విడుదల చేసిన 7వ జాబితాలో కూడా ఇద్దరు కొత్త అభ్యర్థులను నియమించడం జరిగింది.
అయితే ఇప్పటికే పలు నియోజకవర్గాలలో కొత్త కోఆర్డినేటర్లను నియమించినప్పటికీ అక్కడ పోటీ చేసేందుకు కొందరు ఆసక్తి చూపించడం లేదు. దీంతో అలాంటి వారిని నిర్మొహమాటంగా పక్కకు పెట్టి కొత్తవారిని తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు వై.యస్ జగన్మోహన్ రెడ్డి . ఈ క్రమంలోనే మరో రెండు రోజుల్లో కొత్త జాబితాను కూడా వైసిపి పార్టీ విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే గెలుపు గుర్రాల కోసం పరుగులు తీస్తున్న వైఎస్ఆర్సిపి పార్టీ ఎలాంటి నాయకులనైనా సరే పక్కన పెట్టేసి కొత్తవారికి అవకాశాలు ఇస్తూ దూసుకెళ్తోంది. అలాగే కొత్త అభ్యర్థులను నియమించే క్రమంలో ఆ నియోజకవర్గానికి చెందిన వైఎస్ఆర్సిపి నేతల తో కూడా సమన్వయ చర్చలు జరిపి వారిని పక్కన పెట్టడానికి గల కారణాలను కూడా వారి ముందుకు తీసుకెళ్తున్నారు. మొత్తంగా వైసిపి పార్టీ నియోజకవర్గ రాజకీయ సమీకరణాలు , సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని గెలుపు గుర్రాలకి అవకాశం కల్పిస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో సొంత పార్టీలోనే అభ్యర్థులకు అర్థం కాని పరిస్థితి నెలకొంది.