Ys Jagan : అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో జగన్ కు మాత్రమే దక్కిన అరుదైన గౌరవం… మరేవరి వల్ల కాదు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ys Jagan : అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో జగన్ కు మాత్రమే దక్కిన అరుదైన గౌరవం… మరేవరి వల్ల కాదు…!

 Authored By ramu | The Telugu News | Updated on :1 May 2024,7:24 pm

ప్రధానాంశాలు:

  •  Ys Jagan : అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో జగన్ కు మాత్రమే దక్కిన అరుదైన గౌరవం... మరేవరి వల్ల కాదు...!

అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగి ఉన్న భారతదేశంలో తండ్రి కొడుకులు ఇద్దరూ ముఖ్యమంత్రిగా ఎదగటం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. అయితే ఇలాంటి ఘనత భారతదేశంలో అతి తక్కువ మంది మాత్రమే సాధించారు. మహారాష్ట్రలో శంకర్రావు చవాన్ – అశోక్ చవాన్ , జమ్మూ కాశ్మీర్ లో షేక్ అబ్దుల్లా – ఫరూక్ అబ్దుల్లా , ఉత్తరప్రదేశ్లో మూల్యం సింగ్ యాధవ్ – అఖిలేష్ యాదవ్ , ఇక కర్ణాటకలో దేవె గౌడ – కుమారస్వామి , తమిళనాడులో కరుణానిధి – ఎంకె స్టాలిన్ వీరు మాత్రమే ఈ అరుదైనా ఘనతను సాధించారు. ఇక ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ నుండి 2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఈ జాబితాలో చేరారు.

Ys Jagan : తెలుగువారెవరికి దక్కని ఘనత…

ఈ విధంగా భారతదేశం మొత్తంలో అనేక రాష్ట్రాలలో తండ్రి కొడుకులు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టడం చూసాం. కానీ తెలుగు రాష్ట్రాలలో మాత్రం వైయస్ జగన్ ఒక్కడే ఈ అరుదైన ఘనతను సాధించారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పలువురు ముఖ్యమంత్రి కుమారులు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నప్పటికీ వారు ఎవరు ఈ ఘనతను సాధించలేకపోయారు. అయితే తండ్రి అకాల మరణం తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరగక ముందే వైయస్ జగన్ సొంతంగా పార్టీ పెట్టుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇక విభజన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో కొద్దిపాటి తేడాతోనే జగన్ ఛాన్స్ కోల్పోయారు. ఆ తర్వాత 2019లో మాత్రం ఘన విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు.

అయితే భారతదేశంలో ఇప్పటివరకు తండ్రి తర్వాత ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన వారు ఉన్నారు కానీ ఇప్పటివరకు ఎవరూ కూడా వరుసగా రెండుసార్లు ముఖ్యమంత్రి పదవిని చేపట్టలేదు. మహారాష్ట్రలో చవాన్ లు , ఒడిస్సాలో పట్నాయక్ లు , యూపీలో మూలయం అఖిలేష్ , కర్ణాటకలో దేవె గౌడ కుమారస్వామి ఇలా చెప్పుకుంటూ పోతే ఎవరూ కూడా వరుసగా రెండుసార్లు ముఖ్యమంత్రి కాలేదు. కానీ ఇప్పుడు వైయస్ జగన్ ముందు ఈ అరుదైన రికార్డు నిలిచిందని చెప్పాలి. ఈ నెలలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ గెలిస్తే ఈ ఘనత సాధిస్తారు.

Ys Jagan అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో జగన్ కు మాత్రమే దక్కిన అరుదైన గౌరవం మరేవరి వల్ల కాదు

Ys Jagan : అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో జగన్ కు మాత్రమే దక్కిన అరుదైన గౌరవం… మరేవరి వల్ల కాదు…!

Ys Jagan : తండ్రికి తగ్గ తనయుడు…

అయితే వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2004లో జరిగిన ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో వైయస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత 2009లో జరిగిన ఎన్నికల్లో కూడా వైయస్ రాజశేఖర్ రెడ్డి ఒంటి చేత్తో తన పార్టీని గెలిపించుకున్నారు. ఈ విధంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు వరుసగా రెండుసార్లు ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. ఆ తర్వాత సొంతంగా పార్టీ స్థాపించుకున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి 2014లో పరాజయం పొందినప్పటికీ 2019లో ఘనవిజయం సాధించి పవర్ చేజిక్కించుకున్నారు. ఇక ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో వైయస్ జగన్ గెలిచినట్లయితే తన తండ్రి రికార్డును సమం చేస్తారు. భారతదేశం మొత్తం ఎవరికీ సాధ్యం కానీ ఈ ఘనతను జగన్ అందుకుంటారు. మరి ఈ ఘనత జగన్ కు లభిస్తుందా లేదా అనేది తెలియాలంటే జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది