Ys Sharmila : షర్మిలకు ఒకేరోజు మూడు షాకులు.. ఇలా జ‌రిగిందేంటి..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ys Sharmila : షర్మిలకు ఒకేరోజు మూడు షాకులు.. ఇలా జ‌రిగిందేంటి..?

Ys Sharmila : ఏపీ రాజకీయాలు ఇప్పుడు మహా ఇంట్రెస్టింగ్ గా సాగుతున్నాయి. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేనంత పోటీ వాతావరణం ఈ సారి కనిపిస్తోంది. అటు టీడీపీ, జనసేన, బీజేపీలు కూటములుగా ఏర్పడ్డాయి. దాంతో పాటు కాంగ్రెస్ కూడా వామపక్షాలతో కలిసి కూటమిగా ఏర్పడింది. కానీ వైసీపీ మాత్రం సింగిల్ గానే వస్తోంది. ఇక జగన్ మీదనే ఆయన సొంత చెల్లెలు షర్మిల బాణం ఎక్కు పెడుతోంది. జగన్ పై ఎన్నో ఆరోపణలు చేస్తోంది. వరుసగా […]

 Authored By ramu | The Telugu News | Updated on :9 May 2024,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Ys Sharmila : షర్మిలకు ఒకేరోజు మూడు షాకులు.. అటు ప్రచారంలో.. ఇటు కోర్టులో..!

Ys Sharmila : ఏపీ రాజకీయాలు ఇప్పుడు మహా ఇంట్రెస్టింగ్ గా సాగుతున్నాయి. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేనంత పోటీ వాతావరణం ఈ సారి కనిపిస్తోంది. అటు టీడీపీ, జనసేన, బీజేపీలు కూటములుగా ఏర్పడ్డాయి. దాంతో పాటు కాంగ్రెస్ కూడా వామపక్షాలతో కలిసి కూటమిగా ఏర్పడింది. కానీ వైసీపీ మాత్రం సింగిల్ గానే వస్తోంది. ఇక జగన్ మీదనే ఆయన సొంత చెల్లెలు షర్మిల బాణం ఎక్కు పెడుతోంది. జగన్ పై ఎన్నో ఆరోపణలు చేస్తోంది. వరుసగా ప్రచారాలు చేస్తోంది. పంచ్ డైలాగులతో దూసుకుపోతున్న షర్మిలకు తాజాగా ఒకేరోజు మూడు షాక్ లు తగిలాయి.

Ys Sharmila : అద్దె చెల్లించాలంటూ..

ప్రస్తుతం ఆమె కడప ఎంపీగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె తాజాగా మంగళవారం నాడు ప్రచారం నిర్వహించారు. అయితే ఆమెను ప్రచారం చేస్తున్న సమయంలో ఆమె వాహనాన్ని అప్పులోళ్లు అడ్డుకున్నారు. తమ వాహనాలకు చెల్లించాల్సిన అద్దె రూ.6 లక్షలు ఇవ్వాలంటూ గొడవ పడ్డారు. అయితే వారికి ఏదో సర్ది చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆమె ప్రచారాన్ని బెనీటమైన్స్ బాధితులు అడ్డుకున్నారు. అయితే తనకు బెనీటమైన్స్ తో సంబంధం లేదని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది షర్మిల. అయితే ఆమె వారికి సరైన సమాధానం చెప్పుకుండానే వెళ్లిపోయింది.

Ys Sharmila షర్మిలకు ఒకేరోజు మూడు షాకులు ఇలా జ‌రిగిందేంటి

Ys Sharmila : షర్మిలకు ఒకేరోజు మూడు షాకులు.. ఇలా జ‌రిగిందేంటి..?

ఇక ఆమెకు, ఆమె సోదరి సునీతకు కోర్టులో మరో షాక్ తగిలింది. ప్రచారంలో వైఎస్ వివేకానంద హత్య గురించి మాట్లాడొద్దంటూ ఇప్పటికే కడప కోర్టు ఆర్డర్ వేసింది. అయితే దాన్ని సవాల్ చేస్తూ వారిద్దరూ అటు హైకోర్టులో పిటిషన్ వేశారు. కానీ ఈ కేసును కడప కోర్టులోనే తేల్చుకోవాలంటూ హై కోర్టు ఆర్డర్ వేసింది. దాంతో వారిద్దరూ మరోసారి కడప కోర్టును ఆశ్రయించారు. ఈ విషయంపై మరోసారి విచారణ జరిపిన కోర్టు వారిద్దరికీ మరో షాక్ ఇచ్చింది. తప్పుడు సమాచారంతో పిటిషన్ వేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇద్దరికీ రూ.10వేల ఫైన్ విధించింది కోర్టు. ఆ జరిమానాను కడప జిల్లా లీగల్ సెల్ కు కట్టాలంటూ ఆదేశించింది. ఇలా ఒకేరోజు ఇలా వరుస షాకులు తగలడం షర్మిలకే మొదటిసారి కావచ్చేమో.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది