YS Sunitha : వైఎస్ సునీత రాజకీయాల్లోకి వస్తే ఎటు వైపు? అన్నకి వ్యతిరేకంగానా.. అనుకూలంగానా?
YS Sunitha : ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో వైఎస్ సునీతా రెడ్డి పేరు బాగా వినిపిస్తోంది. తన తండ్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య తర్వాత సునీత పేరు బాగా వినిపిస్తోంది. ప్రస్తుతం సునీత రెడ్డి రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. నిజానికి.. వైఎస్ సునీతను ప్రస్తుతం చంద్రబాబు.. ఆమె తండ్రి హత్య కేసు విషయంలో బాగా వాడుకుంటున్నారు అని అంటున్నారు. కావాలని కడవ ఎంపీ అవినాష్ రెడ్డిని ఈ కేసులో ఇరికించే ప్రయత్నాన్ని చంద్రబాబు అండ్ కో.. వెనుక ఉండి నడిపిస్తున్నారని.. ముందు సునీతను పెట్టి ఈ తతంగాన్ని నడిపిస్తున్నట్టు అంటున్నారు.
అంటే.. సునీతను చంద్రబాబు రాజకీయాల్లోకి తీసుకురావాలని అనుకుంటున్నారా? టీడీపీ తరుపున తనను పోటీ చేయించాలని భావిస్తున్నారా? అనేది తెలియదు. మరోవైపు తన అన్న జగన్.. ఏపీలో ముఖ్యమంత్రి. అన్నకు వ్యతిరేకంగా సునీతను పైకి తీసుకురావాలనేది చంద్రబాబు వ్యూహంగా తెలుస్తోంది.ప్రస్తుతం పచ్చ మీడియా కూడా సునీత రెడ్డిపై పాజిటివ్ గానే కథనాలు రాస్తోంది. ఒకవేళ.. కడప ఎంపీగా సునీతను బరిలోకి దించాలని చంద్రబాబు అనుకుంటున్నారా? లేక పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా బరిలో దింపుతారా?
YS Sunitha : కడప నుంచి బరిలోకి దించుతారా?
ఈ రెండు సీట్లలో ఎవరు పోటీ చేసినా టీడీపీకి ఒనగూరే ప్రయోజనం అయితే ఏం ఉండదు. ఎందుకంటే.. ఆ రెండు సీట్లు వైసీపీకి కంచుకోట. వైఎస్ వివేకానంద రెడ్డిని జగనే హత్య చేయించారని ప్రజల్లోకి బలంగా తీసుకొని ఆయన కూతురును బరిలోకి దించి.. ఆ సానుభూతితో ఓట్లను దండుకోవాలనేది చంద్రబాబు ప్లాన్ గా తెలుస్తోంది. కానీ.. అది వర్కవుట్ అయ్యే పనేనా. అసలు వివేకా హత్యలో ఇన్వాల్వ్ ఎవరు అయ్యారో ఏపీ ప్రజలందరికీ తెలుసు. తమ్ముని బమ్మి చేయాలని చంద్రబాబు అనుకుంటే వాళ్లు చూస్తూ కూర్చుంటారా? అసలు.. సునీతకు రాజకీయాల్లో ఆసక్తి ఉందా? ఇవన్నీ తెలియాలి కదా. చూద్దాం మరి.. ఏం జరుగుతుందో.