YSRCP : సీట్ల గెలుపుపై వైసీపీ లెక్కలు.. మరి టీడీపీ సంగతేంటి..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

YSRCP : సీట్ల గెలుపుపై వైసీపీ లెక్కలు.. మరి టీడీపీ సంగతేంటి..?

YSRCP : ఏపీలో ఎన్నికల పర్వం ముగిసింది. గెలుపు అంచనాలపై అన్ని పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. అయితే పోలింగ్ కు ముందు తర్వాత కూడా వైసీపీ ఓ లెక్క చెబుతోంది. వైనాట్ 175 అని గర్జిస్తోంది. తమకు కచ్చితంగా 175 సీట్లు వస్తాయని.. ఇది తమ లెక్క అని అంటోంది. మరి టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పాలని సవాల్ విసురుతోంది. అయితే ఇప్పటి వరకు సీట్ల గురించి టీడీపీ ఏ మాత్రం లెక్కలు చెప్పట్లేదు. నారా […]

 Authored By ramu | The Telugu News | Updated on :21 May 2024,8:45 pm

ప్రధానాంశాలు:

  •  YSRCP : సీట్ల గెలుపుపై వైసీపీ లెక్కలు.. మరి టీడీపీ సంగతేంటి..?

YSRCP : ఏపీలో ఎన్నికల పర్వం ముగిసింది. గెలుపు అంచనాలపై అన్ని పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. అయితే పోలింగ్ కు ముందు తర్వాత కూడా వైసీపీ ఓ లెక్క చెబుతోంది. వైనాట్ 175 అని గర్జిస్తోంది. తమకు కచ్చితంగా 175 సీట్లు వస్తాయని.. ఇది తమ లెక్క అని అంటోంది. మరి టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పాలని సవాల్ విసురుతోంది. అయితే ఇప్పటి వరకు సీట్ల గురించి టీడీపీ ఏ మాత్రం లెక్కలు చెప్పట్లేదు. నారా లోకేష్‌ మాత్రం ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తమ కూటమికి 160కి పైగా సీట్లు వస్తాయని చెబుతున్నారు. కానీ అటు చంద్రబాబు, పవన్ మాత్రం స్పందించట్లేదు.

YSRCP టీడీపీలో అనుమానాలు..

సరే పార్టీలు అన్న తర్వాత ఎవరి అంచనాలు వారికి ఉంటాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ కంటే కాస్త ఎక్కువగానే టీడీపీ పంపకాలు చేసిందని టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే ఈసారి కచ్చితంగా గెలవాలనే కసి టీడీపీ కూటమిలో ఉంది. అందుకే ఎలాంటి పనికి అయినా తెగించేసిందని అంటున్నారు. వాస్తవానికి వైసీపీతో పోలిస్తే టీడీపీలో కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఓటు బ్యాంకు బదిలీ కాలేదని టీడీపీ చెబుతోంది. జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకున్నా సరే ఆ పార్టీల ఓట్లు తమకు పడలేదని టీడీపీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఇక వైసీపీ కూడా గెలుపు గట్టి ధీమాతో ఉన్నా సరే ఆ పార్టీకి కొన్ని ఇబ్బందులు తప్పవని అంటున్నారు. ఎందుకంటే సిట్టింగ్ స్థానాలు చాలా వరకు ఛేంజ్ చేశారు.

YSRCP సీట్ల గెలుపుపై వైసీపీ లెక్కలు మరి టీడీపీ సంగతేంటి

YSRCP : సీట్ల గెలుపుపై వైసీపీ లెక్కలు.. మరి టీడీపీ సంగతేంటి..?

అంతే కాకుండా ఎన్నికలకు ముందు చాలా మంది మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలుకూడా వైసీపీని వీడారు. వారంతా వైసీపీ వ్యతిరేక రాగం ఎత్తుకున్నారు. అందుకే ఇప్పుడు ఆ పార్టీ నేతల్లో కొంత ఆందోళన ఉంది. అయితే పోలింగ్ నాడు ఓ వేవ్ ఏర్పడిందని అన్ని పార్టీలు అంచనా వేస్తున్నారు. ఆ వేవ్ తమకే ఎక్కువ లాభం చేస్తుందని టీడీపీ భావిస్తోంది. అందుకే గెలుపుపై అంత ధీమాగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీకి కనీసం 110 సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. కచ్చితంగా అధికారంలోకి రాబోతున్నామని చెబుతున్నారు. చూడాలి మరి టీడీపీ అంచనాలు ఏ మాత్రం నిజం అవుతాయో.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది