Vijayasai Reddy : విజయసాయి రెడ్డి విషయంలో తగ్గిన వైసీపీ.. కారణం వేరేది ఉందా?
Vijayasai Reddy : కొన్నేళ్ల నుండి వైసీపీలో ఉన్న విజయసాయి రెడ్డి Vijayasai Reddy ఇటీవల రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. అయితే విజయసాయిరెడ్డి Vijayasai Reddy వైసీపీ YCP నుంచి తప్పుకున్నాక సైలెంట్ అయిపోతారని అందరు అనుకున్నారు. కాని ఆయన Jagan జగన్ ను మాత్రం వదిలేసి ఆయన చుట్టూ ఉన్న కోటరీని టార్గెట్ చేశారు. వారి వల్లే తనకు ఈ సమస్యలు అనుకున్నారో ఏమో కానీ జగన్ బాబాయ్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కుమారుడైన విక్రాంత్ రెడ్డిని టార్గెట్ చేశారు.
Vijayasai Reddy : అసలు కారణం ఇది..
విక్రాంత్ రెడ్డి చేసిన కాకినాడ పోర్టు డీల్ తో తనకు సంబంధం లేదని, ఆయనే కర్త, కర్మ, క్రియ అంటూ సీఐడీకి చెప్పడంతో పాటు బహిరంగంగానూ చెప్పేశారు. దీంతో సుబ్బారెడ్డికీ, ఆయనకూ మధ్య ఉన్న గ్యాప్ ఏ స్దాయిలో ఉందో బయటపడింది. అయితే గతంలో వైసీపీకి, రాజకీయాలకు గుడ్ బై చెప్పినప్పుడు సాయిరెడ్డి గుర్తించి అంతగా మాట్లాడని వైసీపీకి ఈసారి మాత్రం మాట్లాడక తప్పని పరిస్ధితి ఎదురైంది. వైసీపీ YCP వ్యూహాత్మకంగా మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, గుడివాడ అమర్నాథ్ తో ఆచితూచి మాట్లాడించింది.

Vijayasai Reddy : విజయసాయి రెడ్డి విషయంలో తగ్గిన వైసీపీ.. కారణం వేరేది ఉందా?
ఇప్పటికిప్పుడు సాయిరెడ్డిపై విరుచుకుపడితే ఆయన భవిష్యత్తులో వైసీపీ పూర్తి గుట్టు విప్పేయడం ఖాయం అనుకున్నారో ఏమో కాని కొంచెం ఆలోచించి మాట్లాడారు. వివాదం మరింత ముదిరితే ఏకంగా జగన్ కేసుల్లో ఆయన అప్రూవర్ గా కూడా మారే ప్రమాదం లేకపోలేదు. అప్పుడు నేరుగా జగన్ Jagan అక్రమాస్తుల కేసులో పీకల్లోతు ఇరుక్కుపోవడం ఖాయం. అందుకే విజయసాయి రెడ్డి Vijayasai Reddy విషయంలో ఆచితూచి స్పందించినట్టు సమాచారం.