Ysrcp : వైసీపీ క్లీన్ స్వీప్.. టీడీపీ అంత దారుణంగా ఓడిపోవ‌డానికి కార‌ణం ఏంటి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ysrcp : వైసీపీ క్లీన్ స్వీప్.. టీడీపీ అంత దారుణంగా ఓడిపోవ‌డానికి కార‌ణం ఏంటి..!

Ysrcp : ఇటీవ‌ల జరిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో కూట‌మి అతి పెద్ద విజ‌యాన్ని సాధించి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. దీంతో వైసీపీపై ప్ర‌జ‌ల‌లో భారీ నెగెటివిటీ ఉంద‌ని అంద‌రు భావించారు. అయితే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం ఆరు స్థానాలకు.. ఏడుగురు బరిలోకి దిగారు. ఈ స్టాండింగ్ కమిటీ పదవులకు.. వైఎస్సార్‌సీపీ తరఫున.. రెండో డివిజన్‌ కార్పొరేటర్‌ అంబడిపూడి నిర్మలకుమారి, మూడో డివిజన్‌ కార్పొరేటర్‌ […]

 Authored By ramu | The Telugu News | Updated on :11 July 2024,5:00 pm

ప్రధానాంశాలు:

  •  Ysrcp : వైసీపీ క్లీన్ స్వీప్.. టీడీపీ అంత దారుణంగా ఓడిపోవ‌డానికి కార‌ణం ఏంటి..!

Ysrcp : ఇటీవ‌ల జరిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో కూట‌మి అతి పెద్ద విజ‌యాన్ని సాధించి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. దీంతో వైసీపీపై ప్ర‌జ‌ల‌లో భారీ నెగెటివిటీ ఉంద‌ని అంద‌రు భావించారు. అయితే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం ఆరు స్థానాలకు.. ఏడుగురు బరిలోకి దిగారు. ఈ స్టాండింగ్ కమిటీ పదవులకు.. వైఎస్సార్‌సీపీ తరఫున.. రెండో డివిజన్‌ కార్పొరేటర్‌ అంబడిపూడి నిర్మలకుమారి, మూడో డివిజన్‌ కార్పొరేటర్‌ భీమిశెట్టి ప్రవల్లిక, 33వ డివిజన్‌ కార్పొరేటర్‌ వల్లూరి ఎన్‌డీఎస్‌ మూర్తి, 41వ డివిజన్‌ కార్పొరేటర్‌ ఇర్ఫాన్‌, 43వ డివిజన్‌ కార్పొరేటర్‌ బాపటి కోటిరెడ్డి, 57వ డివిజన్‌ కార్పొరేటర్‌ ఇసరపు దేవి పోటీలో నిలిచారు. తెలుగు దేశం పార్టీ నుచి 32వ డివిజన్ కార్పొరేటర్ రామ్మోహన్‌రావు పోటీ చేశారు.

Ysrcp : ట్విస్ట్ ఏంటంటే!

ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగించింది. ఆరుకు ఆరు స్థానాలనూ గెలుచుకుంది. అది కూడా భారీ మెజారిటీతో కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అధికారంలో ఉండి కూడా విజయవాడ రాజకీయాలపై తెలుగుదేశం పార్టీ పట్టు కోల్పోయిందనడానికి ఈ ఎన్నికల ఫలితాలను ప్రామాణికంగా తీసుకోవచ్చంటూ చెబుతున్నారు.ఈ ఎన్నికల్లో- వైఎస్ఆర్సీపీకి చెందిన నిర్మల కుమార్- రెండో డివిజన్, భీమిశెట్టి ప్రవళ్లిక- మూడో డివిజన్, బాపటి కోటిరెడ్డి- 33వ డివిజన్, మహ్మద్ ఇర్ఫాన్- 41వ డివిజన్, వల్లూరి ఎన్డీఎస్ మూర్తి, ఈసరాపు దేవి- 57వ డివిజన్ విజయం సాధించారు. వీరిలో ఈసరాపు దేవి, నిర్మల కుమార్, భీమిశెట్టి ప్రవళ్లికు 47 చొప్పున ఓట్లు పోల్ అయ్యాయి. వల్లూరి ఎన్డీఎస్ మూర్తి, మహ్మద్ ఇర్ఫాన్‌కు 45 చొప్పున, బాపటి కోటిరెడ్డికి 46 ఓట్లు పడ్డాయి.

Ysrcp వైసీపీ క్లీన్ స్వీప్ టీడీపీ అంత దారుణంగా ఓడిపోవ‌డానికి కార‌ణం ఏంటి

Ysrcp : వైసీపీ క్లీన్ స్వీప్.. టీడీపీ అంత దారుణంగా ఓడిపోవ‌డానికి కార‌ణం ఏంటి..!

గెలిచిన అభ్యర్థులకు మున్సిపల్ కార్పొరేషన్ ఇన్‌ఛార్జ్ కమిషనర్ డాక్టర్ మహేష్..డిక్లరేషన్ సర్టిఫికెట్లను అందజేశారు. వీఎంసీలో 49 మంది సభ్యుల బలం ఉంది వైఎస్ఆర్సీపీకి. టీడీపీకి 13, బీజేపీ, సీపీఎంలకు ఒక్కొక్కరు చొప్పున కార్పొరేటర్లు ఉన్నారు. కేశినేని శ్వేత రాజీనామా చేయడం వల్ల ఒక డివిజన్ ఖాళీగా ఉంది. పాలకవర్గంగా ఉన్న పార్టీ కార్పొరేటర్లే స్టాండింగ్‌ కమిటీకి ఎన్నిక కావడం సాధారణంగా జరుగుతుంటుంది.. ఈ ప్రక్రియ ఏకగ్రీవంగా జరుగుతుంది. వీఎంసీ ఏర్పాటైన తర్వాత స్టాండింగ్‌ కమిటీలోని పదవులకు గతంలో ఎప్పుడూ ఎన్నికలు జరగలేదు.. ఇప్పుడు తొలిసారిగా ఈ స్టాండింగ్‌ కమిటీకి ఎన్నికలు జరిగాయని చెబుతున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది