YS Jagan Mohan Reddy : జగన్‌కి బ్యాడ్ టైం.. మళ్లీ మంచి రోజులు వచ్చేదెప్పుడు..!
YS Jagan Mohan Reddy : రాజకీయాలలో బండ్లు-ఓడలు, ఓడలు- బండ్లు అవుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఎవరి పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పడం చాలా కష్టం. ఏపీలో అధికారం కోల్పోయాక వైసీపీ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతుంది. ఓటమి చెందిన తర్వాత చాలా మంది ముఖ్య నేతలు పూర్తిగా సైలెంట్ అయ్యారు. ఇద్దరు, ముగ్గరు నేతలు తప్పా మిగితా నేతలు పెద్దగా యాక్టివ్ గా లేకపోవడం వైసీపీలో తీవ్ర చర్చ జరగుతుంది. అయితే ఇది […]
ప్రధానాంశాలు:
YS Jagan Mohan Reddy : జగన్‌కి బ్యాడ్ టైం.. మళ్లీ మంచి రోజులు వచ్చేదెప్పుడు..!
YS Jagan Mohan Reddy : రాజకీయాలలో బండ్లు-ఓడలు, ఓడలు- బండ్లు అవుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఎవరి పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పడం చాలా కష్టం. ఏపీలో అధికారం కోల్పోయాక వైసీపీ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతుంది. ఓటమి చెందిన తర్వాత చాలా మంది ముఖ్య నేతలు పూర్తిగా సైలెంట్ అయ్యారు. ఇద్దరు, ముగ్గరు నేతలు తప్పా మిగితా నేతలు పెద్దగా యాక్టివ్ గా లేకపోవడం వైసీపీలో తీవ్ర చర్చ జరగుతుంది. అయితే ఇది ఇలా ఉంటే కొందరు నేతలు మాత్రం ప్రతిపక్షంలో ఉండడం అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారట. నిన్న మొన్నటి వరకు అధికారాన్ని అనుభవించిన నేతలు ప్రతిపక్షంలో ఉండటానికి తెగ ఇబ్బంది పడిపోతున్నారట.
YS Jagan Mohan Reddy జగన్ పరిస్థితి ఏంటి ?
గత పద్నాలుగు ఏళ్లుగా జగన్ తో నడిచిన నేతల ఆలోచనలో తేడా కనపడుతుందంట. ముఖ్యంగా పార్టీలో మొదటి నుంచి ఉండి, అందునా జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉన్న నేతలు ఇప్పుడు పార్టీ మారానుకోవడం పెద్ద చర్చకు తెరలేపింది. జగన్ కాంగ్రెస్ ను విభేధించి బయటకు వచ్చిన రాజకీయంగా చాలా ఇబ్బందులు పడుతున్న సమయంలో జగన్ కు వెన్నంటే నిలిచిన నేతలు సైతం ఇప్పుడు పార్టీ మారాలనుకోవడం ఏంటా అని సొంత పార్టీలోనే గుసగుసలు వినబడుతున్నాయి. జగన్ ఒక రకంగా సొంత మనుషులుగా ముద్ర ఉన్న నేతలు ఇప్పుడు పార్టీ మారుతుండడంపై రకరకాల చర్చలు కొనసాగుతున్నాయి. ఇలాంటి కష్టకాలంలో జగన్ ను ఒంటరిని చేసి వెళ్లడం ఎంత వరకు సబబు అన్న చర్చ పార్టీలో అంతర్గతంగా జరుగుతుంది.
వైసీపీలో ఎందరో నాయకులు ఉన్నా..ముఖ్యంగా బాలినేని,సామినేని ఉదయభాను లాంటి వ్యక్తులు పార్టీ మారడం పట్ల బిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇదంతా జగన్ చేసుకున్నదేనా లేక రాజకీయమే అలా ఉందా అన్నది కూడా లోతైన చర్చ సాగుతోంది. జగన్ అయినా ఎవరు అయినా పదవులు ఇచ్చినంతవరకే. తీసుకున్న వారికే ఆ విధేయత పార్టీ పట్ల నిబద్ధత ఉండాలి అని అంటున్నారు. ఆ విషయంలో టీడీపీ బెటర్ అని అంటున్నారు. ఇక ఇదిలా ఉంటే టీడీపీ ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం అనేక అమలు కానీ హామీలు ఇచ్చిందని..వాటి అమలు అంత ఈజీ కాదు అప్పుడు జనాలు మళ్లీ జగన్ వైపే చూస్తారనే భరోసాతో వైసీపీ క్యాడర్ ఉంది. మరి ప్రస్తుతం జగన్‌కి బ్యాడ్ టైం నడుస్తుండగా, రానున్న రోజులలో ఆయనకి మంచి జరుగుతుందా లేదా అనేది చూడాలి.