Aadavallu Meeku Johaarlu Movie Review : మహాసముద్రం తర్వాత శర్వానంద్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఆడవాళ్ళు మీకు జోహార్లు Aadavallu Meeku Johaarlu Movie Review. ఈ సినిమా ఇవాళ రిలీజ్ కానుంది. కానీ.. ఇప్పటికే యూఎస్ లో ప్రీమియర్ షోలు వేశారు. దీంతో యూఎస్ లోని తెలుగు వాళ్లు అప్పటికే సినిమాను చూసేశారు. ఫన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా కిశోర్ తిరుమల తెరకెక్కించిన మూవీ ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఇప్పటికే కిశోర్ తిరుమల తెరకెక్కించిన నేను శైలజ, చిత్రలహరి లాంటి సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.
తాజాగా కిశోర్ తిరుమల.. మళ్లీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అనే జోనర్ తోనే శర్వానంద్, రష్మికా మందన్నా హీరోహీరోయిన్లు ఈ సినిమాను తెరకెక్కించాడు. శర్వానంద్ కు 5 వరుస ప్లాఫ్ ల తర్వాత వచ్చిన సినిమా ఇది. 2018 లో వచ్చిన పడిపడి లేచే మనసు దగ్గర్నుంచి ఇటీవల వచ్చిన మహాసముద్రం వరకు అన్నీ ప్లాఫ్ లే. అందుకే ఈసారి ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శర్వానంద్.. నాకు ఆస్కార్ అవార్డులు వద్దు.. సినిమా ఆడితే చాలు అని చెప్పిన విషయం తెలిసిందే. మరి.. సినిమా లైవ్ అప్ డేట్స్ ఏంటో తెలుసుకుందాం రండి.
ఈ సినిమాలో హీరో పేరు అంటే శర్వానంద్ పేరు చిరు. సినిమా ప్రారంభమే పుష్ప డైరెక్టర్ సుకుమార్ వాయిస్ ఓవర్ తో స్టార్ట్ అవుతుంది. చిరుకు వయసు మీదపడుతున్నా అస్సలు పెళ్లవదు. దానికి కారణం తన కుటుంబ సభ్యులే. తన కుటుంబ సభ్యులు తన మీద చూపిస్తున్న అతి ప్రేమ వల్లే అతడికి పెళ్లి కాకుండా పోతుంది.ఎన్ని పెళ్లి చూపులు చూసినా.. అమ్మాయిలకు ఏదో ఒక వంక పెడుతూ తన కుటుంబ సభ్యులు రిజెక్ట్ చేస్తూ వచ్చేవారు. దీంతో చిరు జీవితాంతం బ్యాచ్ లర్ గానే ఉండిపోతాడా అనే అనుమానం అందరిలోనూ వస్తుంది. అతడిలో కూడా వస్తుంది.
ఒకరోజు చివరకు పెళ్లి చూపులు రాజమండ్రి రైల్వే స్టేషన్ లో పెడతారు. ఆ పెళ్లి కూతురు తండ్రి బ్రహ్మానందం.. అక్కడ కొన్ని కామెడీ సీన్స్ ప్రేక్షకులను నవ్విస్తాయి. చివరకు రష్మిక మందన్నా(ఆధ్య).. చిరు లైఫ్ లోకి వస్తుంది. ఆ తర్వాత ఎన్ని ఎన్ని ఎన్ని ఎన్ని మాటలాడుకున్న పాట వస్తుంది. ఆ తర్వాత ఆధ్యను పడేయడం కోసం చిరు చాలా కష్టాలు పడుతుంటాడు. ఆ తర్వాత ఓ మై ఆధ్య సాంగ్ వస్తుంది. దీంతో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది.
ఫస్ట్ మాత్రం చాలా సరదాగా గడిచిపోయింది. రెండు పాటలు అదుర్స్. పెళ్లి చూపులు.. అమ్మాయిలను రిజెక్ట్ చేయడం.. ఆ తర్వాత ఆధ్య తన లైఫ్ లోకి రావడం.. తనను ప్రేమించడం.. ఇలా సరదా సన్నివేశాలతో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది.
స్టార్ట్ అవుతుంది. ఆధ్య.. చిరును పెళ్లి చేసుకోలేనని చెబుతుంది. దీంతో చిరు షాక్ అవుతాడు. దానికి కారణం ఆధ్య తల్లి వకుల(ఖుష్బూ). ఆ తర్వాత ఆడవాళ్లు మీకు జోహార్లు అనే టైటిల్ సాంగ్. ఈ సాంగ్ లో చిరు, అతడి ఫ్యామిలీ కలిసి సరదాగా డ్యాన్స్ చేస్తారు.
ఆధ్య తల్లి వకులకు పెళ్లి అన్నా.. మగాళ్లు అన్నా అస్సలు పడదు. మ్యారెజ్ సిస్టమ్ కు తను పూర్తిగా వ్యతిరేకం. దీంతో తన తల్లిని ఇంప్రెష్ చేయడం కోసం చిరు.. ఆధ్య వాళ్ల ఫ్యాక్టరీలో చేరుతాడు. ఆ తర్వాత ఆధ్య వాళ్ల ఫ్యామిలీ ఫ్రెండ్స్ సమస్యలను చిరు తీరుస్తాడు. ఆ తర్వాత ఖుష్బూ ఫ్యాక్టరీలో చిరు ఎందుకు చేరాడో అసలు నిజం తెలిసిపోతుంది. అసలు.. ఖుష్బూకు ఎందుకు పెళ్లి అంటే ఇష్టం ఉండదో.. పెళ్లి మీద నమ్మకం ఎందుకు ఉండదో ఫ్లాష్ బ్యాక్ చెబుతుంది. అక్కడ కొన్ని సెంటిమెంట్ సీన్లు ఉంటాయి.
ఫ్లాష్ బ్యాక్ పూర్తయ్యాక క్లైమాక్స్ స్టార్ట్ అవుతుంది. చిరు.. ఆధ్యను పెళ్లి చేసుకోవడం కోసం ఖుష్బూ చెప్పిన అన్ని పనులు చేయాల్సి వస్తుంది. చివరకు ఖుష్బూ మనసును గెలుచుకున్నాక.. ఆధ్యతో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ వస్తుంది. ఆ తర్వాత సినిమా మంచి సందేశంతో ముగుస్తుంది.
సినిమాను పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దాడు కిశోర్ తిరుమల. అయితే.. సినిమా స్టోరీని ప్రేక్షకుడు ఈజీగా గెస్ చేయగలుగుతాడు. సినిమాలో కొన్ని డైలాగ్స్ బాగున్నాయి. రష్మిక స్టయిల్, లుక్ కూడా బాగుంది. శర్వానంద్ ఓకే. ఫ్యామిలీ ఆడియెన్స్ కు నచ్చే సినిమా.
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.