Bhola Shankar Movie Review : చిరంజీవి భోళా శంకర్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bhola Shankar Movie Review : చిరంజీవి భోళా శంకర్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

 Authored By kranthi | The Telugu News | Updated on :10 August 2023,9:00 pm

Bhola Shankar Movie Review and rating in telugu : ఈ మధ్య మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఇటీవలే వాల్తేరు వీరయ్యతో అలరించిన చిరు తాజాగా భోళా శంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా షూటింగ్ చకచకా పూర్తి చేసుకొని ఆగస్టు 11న విడుదలైంది. ఈ సినిమాకు మెహర్ రమేశ్ దర్శకుడు. ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ఎప్పుడైతే ప్రకటించారో అప్పటి నుంచి ఈ సినిమా కోసం మెగా అభిమానులు తెగ ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ అదరగొట్టేశాయి. ఈ సినిమాపై భారీగా అంచనాలను పెంచాయి. ఆ సినిమాలో చిరంజీవి గెటప్ మామూలుగా లేదు. రఫ్పాడించేశారు అనే చెప్పుకోవాలి. భోళా మేనియా పేరుతో ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో విపరీతంగా బజ్ ఏర్పడింది. అసలే మెగాస్టార్ మూవీ రిలీజ్ అంటే మామూలుగా ఉంటుందా? అభిమానులు రచ్చ మామూలుగా ఉండదు కదా.

అనుకున్న దానికంటే ఎక్కువ అంచనాలతో, భారీ హైప్ మధ్య ఈ సినిమా విడుదల విడుదలైంది. ఇప్పటికే జైలర్ సినిమాకు హిట్ టాక్ వచ్చింది. ఒక్క రోజు గ్యాప్ తో భోళా శంకర్ థియేటర్లలో సందడి చేస్తోంది. అయితే.. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన మెహర్ రమేశ్ గురించి చెప్పుకోవాలి. భారీ బడ్జెట్ సినిమాలు తీసి చతికిల పడిన దర్శకుడు ఆయన. ఒక బిల్లా, ఒక కంత్రి, ఒక శక్తి ఈ సినిమాలన్నీ భారీ బడ్జెట్ మూవీసే. కానీ.. ఈ సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా పడ్డాయి. అయినా కూడా మెహర్ రమేశ్ కు మెగాస్టార్ చాన్స్ ఇవ్వడం అనేది గొప్ప విషయం అనే చెప్పుకోవాలి.

Bhola Shankar Movie Review and Rating in telugu

Bhola Shankar Movie Review and Rating in telugu

Bhola Shankar Movie Review : చిరుకు జోడీగా తమన్నా.. చెల్లెలుగా కీర్తి సురేశ్

ఈ సినిమాలో చిరుకు జోడీగా మిల్క్ బ్యూటీ తమన్నా నటించింది. ఇక.. కీర్తి సురేశ్ చిరంజీవికి చెల్లెలుగా నటించింది. కీర్తి సురేశ్ కు జోడీగా సుశాంత్ నటించాడు. కలకత్తా బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా సాగుతుంది. నిజానికి కలకత్తా బ్యాక్ డ్రాప్ లో వచ్చిన చూడాలని ఉంది సినిమా సూపర్ డూపర్ హిట్ అనే విషయం తెలుసు కదా. ఈ మూవీ కూడా అదే బ్యాక్ డ్రాప్ అనేసరికి మెగా అభిమానులు ఫుల్ టు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా కథ ఏంటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దానికి కారణం.. ఈ సినిమా తమిళ్ మూవీ వేదాళం రీమేక్ కావడం. తమిళ్ మూవీ వేదాళం చూసిన వాళ్లకు ఈ స్టోరీ కూడా తెలిసే అవకాశం ఉంది కానీ.. తెలుగులో ఈ సినిమాకు చాలా మార్పులు చేశారు. అలాగే ఇప్పటికే బెనిఫిట్ షోలు కూడా పడ్డాయి. యూఎస్ ప్రీమియర్ షోలు కూడా పడటంతో సోషల్ మీడియాలో భోళా శంకర్ మూవీ రివ్యూలను, కథను పెట్టేస్తున్నారు.

Bhola Shankar Movie Review and rating in telugu

Bhola Shankar Movie Review and rating in telugu

నటీనటులు : చిరంజీవి, తమన్నా భాటియా, కీర్తి సురేశ్, రఘుబాబు, మురళీ శర్మ, రవి శంకర్, వెన్నెల కిషోర్, తులసి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, రావు రమేశ్, సురేఖ వాణి, సుశాంత్

డైరెక్టర్ : మెహర్ రమేశ్

మ్యూజిక్ డైరెక్టర్ : మహతి స్వర సాగర్

నిర్మాత : రామబ్రహ్మం సుంకర

Bhola Shankar Movie Review : భోళా శంకర్ సినిమా కథ ఇదే

ఈ సినిమా నేపథ్యం మొత్తం కలకత్తాలో సాగుతుంది. భోళా శంకర్ ఒక టాక్సీ డ్రైవర్. తనకు ఒక చెల్లెలు ఉంటుంది. కీర్తి సురేశ్ ను బాగా చదివించి మంచి కెరీర్ ఇవ్వాలని చాలా కష్టపడుతుంటాడు భోళా శంకర్. అందుకే బాధ్యతగా తన చెల్లెలును మంచి చదువు చదివిస్తుంటాడు. అలాగే.. ఆయనకు సామాజిక బాధ్యత కూడా ఎక్కువే. ఎందుకంటే అన్యాయం జరిగితే అస్సలు సహించడు. ఏ అమ్మాయికి ఆపద వచ్చినా వెంటనే అక్కడ వాలిపోతాడు. అక్కడ తన టాక్సీ ఉంటుంది. అయితే.. కలకత్తాలో చాలామంది మహిళలు మిస్ అవుతూ ఉంటారు. దీంతో ఆ కేసు విషయంలో పోలీసులకు శంకర్ సాయం చేస్తాడు. ఇంతలో తన చెల్లెలుకు కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఆ తర్వాత అసలు శంకర్ తన సొంత అన్న కాదని తెలుసుకుంటుంది. దీంతో అతడి ఫ్లాష్ బ్యాక్ గురించి తెలిసి షాక్ అవుతుంది. అసలు శంకర్ ఎవరు? ఆయన దగ్గరికి కీర్తి సురేశ్ ఎలా వచ్చింది.. తనను చెల్లెలుగా ఎందుకు భావించాడు అనేదే అసలు కథ.

Bhola Shankar Movie Review and rating in telugu

Bhola Shankar Movie Review and rating in telugu

Bhola Shankar Movie Review : విశ్లేషణ

ముందే చెప్పినట్టుగా ఈ సినిమా తమిళం మూవీ రీమేకే కావచ్చు కానీ.. తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా కథలో పలు మార్పులు చేశాడు దర్శకుడు. స్టోరీ చూసి ఇదేదో మాస్ మూవీ కావచ్చు అని అనుకుంటారు కానీ.. ఇది మాస్ మూవీనా.. క్లాస్ మూవీనా అనే కన్నా.. సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కామెడీ మాత్రం అదరగొట్టేశారు అని చెప్పుకోవాలి. సినిమాలో మాస్, క్లాస్ తో పాటు వినోదం కావాల్సినంత ఉంది. ఇక.. తన చెల్లెలుకి, తనకు మధ్య ఉండే సెంటిమెంట్ సినిమాకు ప్లస్ అవుతుంది. ఇక.. చిరు సరసన నటించిన తమన్నా మాత్రం తన అందాలతో గ్లామర్ ట్రీట్ ఇచ్చిందనే చెప్పుకోవాలి. ముఖ్యంగా చిరు నటన గురించి చెప్పుకోవాలి. సినిమా మొత్తాన్ని తన భుజాల మీద వేసుకొని నడిపించారు. పవన్ కళ్యాణ్ డైలాగ్స్ తోనూ మెప్పించారు చిరు.

ప్లస్ పాయింట్స్

యాక్షన్ ఎపిసోడ్

విలన్ ఫేస్ ఆఫ్

సెకండ్ హాఫ్

సిస్టర్ సెంటిమెంట్

మైనస్ పాయింట్స్

ఫస్ట్ హాఫ్

కామెడీ

చిరంజీవి స్క్రీన్ స్పేస్

మ్యూజిక్

Bhola Shankar Review Movie : లాస్ట్ గంట సినిమాకే హైలెట్

ఈ సినిమా ఫస్ట్ హాఫ్ గురించి పక్కన పెడితే లాస్ట్ గంట మాత్రం మామూలుగా ఉండదట. ఈ సినిమాకు అదే హైలెట్ అంటున్నారు. మొత్తానికి పవర్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా భోళా శంకర్ థియేటర్లలోకి వచ్చేశాడు. లాస్ట్ గంట సినిమాకు థియేటర్లలో విజిల్స్ పడుతున్నాయి. కుర్చీల్లో జనాలు కూర్చోలేకపోతున్నారు. ఏది ఏమైనా మెగాస్టార్ అభిమానులకు భోళా శంకర్ సినిమాతో పండగ ముందే వచ్చేసింది. లెట్స్ గో అండ్ వాచ్ ది మూవీ ఇన్ థియేటర్స్.

దితెలుగున్యూస్ రేటింగ్ : 3/5

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది