Hanuman Movie Review : హనుమాన్ మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ అండ్ రేటింగ్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hanuman Movie Review : హనుమాన్ మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ అండ్ రేటింగ్..!

 Authored By anusha | The Telugu News | Updated on :11 January 2024,10:31 pm

ప్రధానాంశాలు:

  •  Hanuman Movie Review : హనుమాన్ మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ అండ్ రేటింగ్..!

Cast & Crew

  • Hero : తేజ సజ్జా
  • Heroine : అమృత అయ్యర్
  • Cast : అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్
  • Director : ప్రశాంత్ వర్మ
  • Producer : కె.నిరంజన్ రెడ్డి
  • Music : గౌరహరి ,అనుదీప్ దేవ్, కృష్ణసౌరభ్
  • Cinematography : Dasaradhi Sivendra

Hanuman Movie Review  : చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయమేనా తేజ సజ్జా Teja Sajaa ఇప్పుడు హీరోగా మారాడు. ప్రశాంత్ వర్మ Prashanth Varma కథ, దర్శకత్వం వహించిన హనుమాన్  సినిమా  హనుమాన్ మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ Hanuman Movie Review లో తేజ హీరోగా నటించాడు. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కె.నిరంజన్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. అమృత అయ్యర్ Amritha Aiyer, వరలక్ష్మి శరత్ కుమార్ Varalaxmi Sarathkumar , వినయ్ రాయ్ ప్రధాన పాత్రలు పోషించారు. గౌరహరి Gourahari ,అనుదీప్ దేవ్, కృష్ణసౌరభ్ ఈ ముగ్గురు ఈ సినిమాకి సంగీతం అందించారు. ఇక ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. కానీ కొన్నిచోట్ల ప్రీమియర్లు పడుతున్నాయి. జనవరి 11న వేస్తున్న ప్రీమియర్లకు చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇంకా డిమాండ్ పెరుగుతుండడంతో ప్రీమియర్ షోల సంఖ్యను కూడా పెంచుతున్నారు. ఎన్ని స్క్రీన్ లు, ఎన్ని షోలు వేసిన కూడా హౌస్ ఫుల్ అవుతున్నాయి. దీంతో హనుమాన్ సినిమాకి ఎంత క్రేజ్ ఉందో అర్థం అవుతుంది. అయితే ఇప్పుడు హనుమాన్ సినిమాకు సంబంధించిన ఫస్ట్ రివ్యూ వచ్చింది.

Hanuman Movie Review :  హనుమాన్ మూవీ రివ్యూ – డ్రామా ఎమోషన్స్, విఎఫ్ఎక్స్ అద్భుతం

బాలీవుడ్ Bollywood ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ హనుమాన్ సినిమాను Hanuman Movie Review వీక్షించినట్టుగా ఉన్నారు. ఈ సినిమా అద్భుతంగా ఉందని కితాబు ఇచ్చారు. 3.5 రేటింగ్ ఇచ్చి సినిమా అదిరిపోయిందని కొనియాడారు. హనుమాన్ సినిమా అందరిని ఎంటర్టైన్ చేస్తుందని, డ్రామా ఎమోషన్స్, విఎఫ్ఎక్స్, మైథాలజీ ఇలా అన్ని కోణాలలో అద్భుతంగా ఉందని అన్నారు. ఎన్నో గూస్ బంప్స్ మూమెంట్స్ ఉన్నాయని అన్నారు. అందరూ కచ్చితంగా ఈ సినిమాను చూడాలని రికమండ్ చేశారు. హనుమాన్ సినిమాలో చాలామంది పర్ఫామెన్స్ గురించి మాట్లాడుకోవాలని అన్నారు. హీరోగా తేజ సజ్జా ఎంతో కన్విక్షన్తో నటించారని అన్నారు. వరలక్ష్మి ప్రేక్షకులపై చెరగని ముద్ర వేస్తుందని అన్నారు. వినయ్ రాయ్, సముద్రఖని అద్భుతంగా నటించారని అన్నారు. వెన్నెల కిషోర్ కు మరింత పుటేజ్ వస్తే బాగుండేది అన్నారు.

ఈ సినిమాకు విఎఫ్ఎక్స్ అనేది ప్రధాన బలమని అంటున్నారు. డబ్బింగ్ కూడా బాగుందని, అయితే సినిమా నిడివి కాస్త తగ్గి ఉంటే ఇంకా బాగుండేదని అంటున్నారు. హిందీ వర్షన్ గురించి మాత్రమే చెబుతున్నాను అని ప్రత్యేకంగా ఆదర్శ్ నొక్కి మరి చెప్పారు. ఇలా చూసుకుంటే హనుమాన్ సినిమాకు ఫుల్ పాజిటివ్ రిపోర్టు వచ్చేలా ఉన్నాయి. నార్త్ లో కాస్త పాజిటివ్ టాక్ వచ్చిన కలెక్షన్స్ లో తిరుగు ఉండదు. ఇప్పుడు అక్కడ హనుమాన్ కు సరైన పోటీ కూడా లేదు. కాబట్టి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటే అవకాశం ఉంది. ఇక తెలుగులో ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్స్ బ్రేక్ చేసే అవకాశం ఉంది అని అంటున్నారు. మొత్తానికి ఈ సినిమా అద్భుతంగా ఉందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా విడుదల అవ్వటానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. పూర్తి రివ్యూ తెలుసుకొనేందుకు మా వెబ్ సైట్ ను ఫాలో అవ్వండి.

కథ : Hanuman Movie Review : హనుమాన్ మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ

అంజనాది పర్వతాలు ఉన్న ప్రాంతంలో అంజనాద్రి అనే గ్రామం ఒకటిి ఉంటుంది. ఇక ఆ గ్రామంలో హనుమంతు అనే యువకుడు పని పాట లేకుండా తిరుగుతూ సరదాగా , గడుపుతూ చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉంటాడు. అతని అక్క అంజమ్మ ( వరలక్ష్మి శరత్ కుమార్ ) ఉంటుంది. ఇక తమ్ముడు హనుమంతు అంటే అంజమ్మకు చాలా ఇష్టం. ఆ కారణంతోనే అంజమ్మ పెళ్లి కూడా చేసుకోకుండా అలాగే ఉంటుంది. ఇక హనుమంతుకు చిన్నప్పటినుండి అదే గ్రామానికి చెందిన మీనాక్షి ( అమృత అయ్యర్ ) అనే అమ్మాయి అంటే చాలా ప్రేమ. అయితే అది ఒక గ్రామం కావడంతో అప్పుడప్పుడు బందిపోట్ల దాడులు జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఒకసారి బందిపోట్ల బారి నుండి మీనాక్షిని కాపాడే ప్రయత్నంలో హనుమంతు సముద్రంలో పడిపోతాడు. అనంతరం సముద్రం నుంచి బయటకు వచ్చిన హనుమంతు చాలా బలవంతుడిగా మారతాడు. ఎంత బలం అంటే కొడితే కొండైనా పిండి అయ్యే రేంజ్ లో హనుమంతు బలం ఉంటుంది. ఇదే క్రమంలో చిన్నప్పటినుండే ప్రపంచంలో అందరికంటే గొప్ప సూపర్ మాన్ కావాలన్న కోరికతో తన సొంత తల్లిదండ్రులను చంపిన మైఖేల్ అంజనాద్రి గ్రామానికి వస్తాడు. ఇక్కడ హనుమంతు శక్తిని మైకేల్ తెలుసుకుంటాడు. హనుమంతు శక్తిని చూసి ఆశ్చర్యపోయిన మైఖేల్ తర్వాత ఏం చేశాడు..? అసలు మైకిల్ ఆ ఊరు ఎందుకు వచ్చాడు…? హనుమంతు కి అంత శక్తి ఎక్కడ నుండి వచ్చింది..? ఇక హనుమంతుడికి ఈ కథకి సంబంధమేంటి అనే అంశాలపై సినిమా కథ సాగుతుంది.

విశ్లేషణ : Hanuman Movie Review : హనుమాన్ మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ

ఇక ఈ మూవీ ని చూస్తునంతసేపు ఒక కొత్త సినిమాను చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. అదేవిధంగా సినిమా ఓపెనింగ్ చాలా కొత్తగా ఉండటంతో పాటుు సినిమాలో హనుమంతుడి క్యారెక్టర్ ను అంచనాలకు తగ్గట్లుగా చూపించడం జరిగింది. దీంతో ప్రేక్షకులు ప్రతి నిమిషం ఆంజనేయస్వామిని తలుచుకుంటూనే ఉంటారు. మరి ముఖ్యంగా ఆంజనేయుని రూపమైన వానరానికి మరియు హనుమంతుకి జరిగే సీన్స్ అయితే మైండ్ బ్లాక్ చేస్తాయి. అంతేకాక వానరానికి మాస్ మహారాజా రవితేజ వాయిస్ సూపర్ గా సెట్ అయిందని చెప్పాలి. అదేవిధంగా అక్క తమ్ముళ్లుగా వరలక్ష్మీ శరత్ కుమార్ మరియు తేజ మధ్య జరిగే సన్నివేశాలు కూడా అందర్నీ ఆకట్టుకుంటాయి. మొత్తంగా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ సూపర్ గా ఉంది. ఇక ఫస్ట్ ఆఫ్ సూపర్ గా ఉండడంతో సెకండ్ హాఫ్ పై భారీ అంచనాలు పెట్టుకోవడంతో సెకండ్ హాఫ్ లో సినిమా కాస్త డల్ అయినట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే సెకండ్ హాఫ్ లో వచ్చే సీన్స్ కొన్ని కాస్త లాగ్ అనిపిస్తాయి. కానీ దర్శకుడు ఇలా ఎందుకు చేశాడో క్లైమాక్స్ లో క్లారిటీగా అర్థం అవుతుంది. అదేవిధంగా హనుమంత్ సీక్వెల్ కి లీడ్ ఇచ్చిన విధానం కూడా చాలా బాగుంది. కార్తికేయ 2 మాదిరిగా ఈ సినిమా కూడా నార్త్ సౌత్ లో రికార్డు స్థాయి వసూళ్లను సాధించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

ప్లస్ పాయింట్స్ :

నటన
కథ
దర్శకత్వం
సినిమాటోగ్రఫీ
విఎఫ్ఎక్స్
రవితేజ వాయిస్

మైనస్ పాయింట్స్ :-

సెకండ్ హాఫ్ ల్యాగ్

Rating :

3.3/5

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది