Kanguva Movie Review : సూర్య కంగువ మూవీ ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్..!
Kanguva Movie Review : కోలీవుడ్ Kollywood స్టార్ Surya సూర్య లీడ్ రోల్ లో శివ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా కంగువ రివ్యూ Surya Kanguva Review . ఈ ఇయర్ మోస్ట్ ఎవైటెడ్ మూవీగా వచ్చిన కంగువ పీరియాడికల్ కథతో భారీ స్కేల్ లో తెరకెక్కింది. మరి భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం. Kanguva Movie Review కథ : గోవాలో Gova […]
ప్రధానాంశాలు:
Kanguva Movie Review : సూర్య కంగువ మూవీ ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్..!
Kanguva Movie Review : కోలీవుడ్ Kollywood స్టార్ Surya సూర్య లీడ్ రోల్ లో శివ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా కంగువ రివ్యూ Surya Kanguva Review . ఈ ఇయర్ మోస్ట్ ఎవైటెడ్ మూవీగా వచ్చిన కంగువ పీరియాడికల్ కథతో భారీ స్కేల్ లో తెరకెక్కింది. మరి భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.
Kanguva Movie Review కథ :
గోవాలో Gova బౌంటీ హంటర్ గా పనిచేస్తుంటాడు ఫ్రాన్సిస్ (సూర్య) అతనికి గర్ల్ ఫ్రెండ్ దిశా పటాని తో పాటుగా యోగి బాబు కూడా సపోర్ట్ గా ఉంటారు. ఐతే ఆ టైం లో అతనికి జీటా తారసపడుతుంది. ఆమెతో ఏదో అనుబంధం ఉంది అని తెలుసుకుంటాడు. అదేంటో తెలుకోవాలని ఆరాటపడతాడు. అలా ఆమెతో ఉన్న బంధాన్ని తెలుసుకునేందుకు చేసే ప్రయత్నంలో 1000 ఏళ్ల కిదకు వెళ్తాడు. అతనే కంగువ. అక్కడ రెండు తెరల మధ్య యుద్ధం లో ఎవరు గెలిచారు. ఆ తెగకు ఫ్రాన్సిస్ కు ఉన్న సంబంధం ఏంటి.. చివరకు కథ ఎలా ముగించాడు అన్నదే సినిమా కథ.
నటీనటులు : సూర్య, Surya దిశా పటాని Disha Patani , బాబీ సిం హా, యోగిబాబు తదితరులు.
సంగీతం : దేవి శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ : వెట్రి పలనిసామి
ఎడిటింగ్ : నిషాద్ యూసఫ్
ప్రొడక్షన్ : స్టూడియో గ్రీన్
నిర్మాతలు : కె యి జ్ఞానవెల్ రాజా
Kanguva Movie Review విశ్లేషణ :
శివ దర్శకత్వంలో భారీ స్కేల్ లో కంగువ తెరకెక్కింది. ఐతే ఈ సినిమా కథ బాగానే ఉన్నా కథనం ఆశించిన స్థాయిలో లేదు. ముఖ్యంగా సినిమాలో ఎమోషన్ ఎక్కడ వర్క్ అవుట్ కాలేదు. సూర్య తెర మీద ఎంత కష్టపడి వర్క్ అవుట్ చేసినా సరే ఎక్కడ కూడా ఆడియన్స్ కు ఎంగేజింగ్ గా అనిపించలేదు. అక్కడక్కడ కొన్ని సీన్స్ పర్వాలేదు అనిపిస్తుంది. సినిమా ఓపెనింగ్ ఫస్ట్ హాఫ్ అంతా యావరేజ్ గా సాగుతుంది. సినిమాను నిలబెట్టాల్సి ఉన్న సెకండ్ హాఫ్ సినిమాను మరింత ట్రాక్ తప్పేలా చేసింది. ఐతే సినిమా క్లైమాక్స్ కాస్త ఊపందుకున్నా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. సూర్య కంగువ తెర మీద మేకర్స్ ఎంత కష్టపడ్డారో కనిపిస్తుంది కానీ.. దాన్ని ప్రేషకుడికి చేరవేయడంలో విఫలమయ్యారు.
శివ డైరెక్షన్ పరంగా భారీ విజువల్స్.. భారీ స్కేల్ ని తీసుకున్నాడు కానీ అసలు వర్క్ అవుట్ అవ్వాల్సిన ఎమోషన్ గురించి లైట్ తీసుకున్నాడు అనిపిస్తుంది. సూర్య వన్ మ్యాన్ షోగా కంగువ ఉన్నా కూడా ఆశించిన స్థాయిలో మాత్రం సినిమా లేదని చెప్పొచ్చు.హీరో పాత్రని చాలా బలంగా రాసుకున్నా అందులో ఎమోషన్ కొరవడింది. మరోపక్క విలన్ చాలా వీక్ గా అనిపించాడు. సో ఈ కారణాలన్నీ కూడా కంగువని ట్రాక్ తప్పేలా చేశాయి. సినిమాను సూర్య ఫ్యాన్స్ ఒకసారి చూడొచ్చు.
నటన & సాంకేతిక వర్గం :
సూర్య ఎప్పటిలానే రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో అదరగొట్టాడు. ముఖ్యంగా కంగువగా అతను ఆకట్టుకున్నాడు. ఐతే సూర్య ఎంత కష్టపడినా సినిమా ప్రేక్షకుల హృదయాలను టచ్ చేయలేదు. మరోపక్క దిశా పటాని కేవలం కొద్ది సీన్స్ కే పరిమితమైంది. బాబీ డియోల్ ని సరిగా వాడుకోలేదు. మిగతా పాత్రలన్నీ పరిధి మేరకు నటించి మెప్పించారు.
ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే.. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ సాంగ్స్, బిజిఎం ఇంప్రెస్ చేశాయి. కెమెరా మెన్ పనితనం బాగుంది. ఐతే విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త పడితే బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. డైరెక్టర్ శివ మేకింగ్ ఎంత రిచ్ గా ఉన్నా ఎమోషనల్ కనెక్టివిటీ లేక సినిమాకు డ్రా బ్యాక్ అయ్యేలా చేశాడు. Kanguva Movie Review and Rating In Telugu , Surya Kanguva Review, Kanguva Review & Rating, kanguva Review , Disha Patani , Bobby Deol , Aarash Shah , Karthi
ప్లస్ పాయింట్స్ :
సూర్య
విజువల్స్
మ్యూజిక్
మైనస్ పాయింట్స్ :
స్క్రీన్ ప్లే
మిస్సింగ్ ఎమోషన్
ప్రిడిక్టబుల్
బాటం లైన్ :
కంగువ కేవలం సూర్య ఫ్యాన్స్ కు మాత్రమే..!
రేటింగ్ : 2/5