Kingdom Movie Review : కింగ్‌డమ్ మూవీ ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ ఖాతాలో హిట్ పడ్డట్టేనా ?
Kingdom Movie Review : విజయ్ దేవరకొండ vijay devarakonda , bhagya sri borse నటించిన కింగ్డమ్ చిత్రం మరి కొద్ది గంటలలో రిలీజ్ అవుతోంది. గౌతమ్ తిన్ననూరి జెర్సీ తర్వాత తెరకెక్కించిన చిత్రం ఇదే. సూర్య దేవర నాగవంశీ ఈ చిత్రానికి నిర్మాత. యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. ఈ మూవీలో విజయ్ దేవరకొండ అన్న పాత్రలో హీరో సత్యదేవ్ నటించారు.ఇప్పటికే ప్రీమియర్ షోలు పడగా, ఈ షోల నుంచి కింగ్డమ్ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది ?

Kingdom Movie Review : కింగ్‌డమ్ మూవీ ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ ఖాతాలో హిట్ పడ్డట్టేనా ?
Kingdom Movie Review అదరగొట్టేసినట్టేనా?
ప్రీమియర్ షోలు చూస్తున్న ఆడియన్స్ ట్విట్టర్ లో ఈ చిత్రం గురించి ఏమంటున్నారు ? అనేది చూస్తే.. కింగ్డమ్ కథ బ్రిటిష్ టైం పీరియడ్ నేపథ్యంలో చాలా ఆసక్తికరంగా మొదలవుతుంది.ఫస్ట్ హాఫ్ బావుంది అంటూ నెటిజన్లు ట్విట్టర్ లో పోస్ట్ లు పెడుతున్నారు. తొలి 30 నిమిషాలు దర్శకుడు నెమ్మదిగా కథని బిల్డ్ చేస్తూ ఆ వరల్డ్ లోకి తీసుకువెళ్లాడు. విజయ్ దేవరకొండ ప్రతి ఫ్రేమ్ లో తన నటనతో కట్టిపడేశాడు.
విజయ్ దేవరకొండ గత చిత్రాల కంటే ఈ మూవీలో అతడి నటన కాస్త భిన్నంగా ఉంటుంది. బాడీ లాంగ్వేజ్ లో కూడా మార్పులు చూడొచ్చు. అనిరుద్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయినట్లు ఆడియన్స్ చెబుతున్నారు. సత్యదేవ్, విజయ్ దేవరకొండ మధ్య ఎమోషనల్ సీన్స్ వర్కౌట్ అయినట్లు చెబుతున్నారు. ఈ చిత్రంతో విజయ్ దేవరకొండ పరిణితి చెందిన నటుడిగా మారినట్లు ఆడియన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. స్క్రీన్ ప్లే అంతగా వర్కౌట్ కాలేదని అంటున్నారు. శ్రీలంక ఫారెస్ట్ నేపథ్యంలో సాగే కథ ఆసక్తికరంగా ఉంటుంది. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ ఆసక్తికరంగా సాగింది సెకండ్ హాఫ్ లో బోట్ సన్నివేశం అద్భుతంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఓవరాల్ గా విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.