Ponniyin Selvan 1 Movie Review : పొన్నియ‌న్ సెల్వ‌న్-1 మూవీ ఫస్ట్ రివ్యూ… ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ponniyin Selvan 1 Movie Review : పొన్నియ‌న్ సెల్వ‌న్-1 మూవీ ఫస్ట్ రివ్యూ… !

 Authored By sandeep | The Telugu News | Updated on :29 September 2022,11:50 pm

Ponniyan Selvan 1 First Review : త‌మిళ ప్రేక్ష‌కులు బాహుబ‌లిగా భావిస్తున్న చిత్రం పొన్నియన్ సెల్వన్ . ఈ చిత్రం శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా ఏకకాలంలో విడుద‌ల కానున్న ఈ చిత్రంలో ఐశ్వర్యారాయ్, చియాన్ విక్రమ్, కార్తీ, జయం రవి, త్రిష వంటి వారు నటిస్తూ ఉన్నారు. భారీ క్యాస్టింగ్ ఉండ‌డంతో సినిమాపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. దుబాయ్ ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యుడుగా చెప్పుకునే ఉమైర్ సంధూ తాజాగా ఈ సినిమా ఫస్ట్ రివ్యూ అంటూ ఒక ఫస్ట్ రివ్యూ పోస్ట్ చేశారు.ఈ సినిమా అద్భుతంగా ఉందని ప్రొడక్షన్ డిజైనింగ్ కూడా సూపర్ గా ఉందని చెప్పుకొచ్చారు.

చియాన్ విక్రమ్, కార్తీ ప్రేక్షకుల మన్ననలు అందుకుంటారని ఐశ్వర్యరాయ్ బచ్చన్ మళ్ళీ తన ఫామ్ లోకి వచ్చేసిందని ఆయన పేర్కొన్నారు. అనేక ట్విస్టులతో చప్పట్లు కొట్టి అద్భుతమైన సీన్లతో సినిమా సాగుతుందంటూ ఆయన కామెంట్ చేయడంతో దానికి మణిరత్నం భార్య నటి సుహాసిని ఆసక్తికరంగా కామెంట్ చేశారు. అసలు విడుదల కాని సినిమాని మీరు ఎలా చూశారు? మీరు ఎవరు? అంటూ ఆమె కామెంట్ చేశారు. టోటల్‌గా 10 కోట్లు బిజినెస్ చేసిన ‘పొన్నియన్ సెల్వన్ 1’కి తెలుగులో బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే, మినిమమ్ 10.5 కోట్లు వసూళ్లు రాబట్టాలని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

Ponniyan Selvan 1 Movie Review and Rating in Telugu

Ponniyan Selvan 1 Movie Review and Rating in Telugu

Ponniyin Selvan 1 Movie Review : త‌మిళ బాహుబ‌లి..

కల్కి కృష్ణ మూర్తి రాసిన ‘పొన్నియన్ సెల్వన్’ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాని రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నారు. వివిధ భాషల్లో ఆయా భాషలకు చెందిన ప్రముఖ నటులతో ఈ సినిమాకి వాయిస్ ఓవర్ అందిస్తుండడం విశేషం. తమిళంలో కమల్ హాసన్‌తో, కన్నడలో ఉపేంద్రతో, మలయాళంలో ముమ్ముట్టి, హిందీలో అజయ్ దేవగణ్ వంటి స్టార్ హీరోలతో వాయిస్ ఓవర్ ఇస్తుండడంతో ఆయా భాషల్లో ‘పొన్నియన్ సెల్వన్ 1’కి అదనపు ఆకర్షణ కానుంది. . ఈ సినిమాను తెలంగాణలో మల్టీప్లెక్స్‌లో రూ. 295 విక్రయించడం అనేది ఈ సినిమాకు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది.

 

నటీనటులు: విక్రమ్, ఐశ్వర్యరాయ్, జయం రవి, కార్తీ, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శోభిత ధూళిపాల, ప్రభు, ఆర్. శరత్ కుమార్, విక్రమ్ ప్రభు, జయరామ్, ప్రకాష్ రాజ్, రెహమాన్, ఆర్. పార్తిబన్ తదితరులు.
డైరెక్టర్: మణిరత్నం
నిర్మాతలు: మణిరత్నం, శుభస్కరన్ అల్లి రాజా
మ్యూజిక్ డైరెక్టర్ : ఏఆర్ రెహమాన్
సినిమాటోగ్రఫీ: రవి వర్మన్

ప్రేమకథా చిత్రాల దర్శకుడిగా పేరొందిన మణిరత్నం తెరకెక్కించిన మూవీనే ‘పొన్నియన్ సెల్వన్’. ఇందులో విక్రమ్, ఐశ్వర్యరాయ్, త్రిష, కార్తి, జయం రవి, శోభిత ధూళిపాళ్ల సహా ఎంతో మంది స్టార్లు నటించారు. ఈ సినిమాను మణిరత్నం, శుభకరణ్ అల్లిరాజయ్య సంయుక్తంగా నిర్మించారు. ఈ భారీ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు. నేడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.

క‌థ‌:

పరాంతక చోళుడుకు ఆదిత్య కరికాలన్, అరుల్ మొలి వర్మన్ కుందవై అనే ముగ్గురు సంతానం . అదిత రాజు బంగారు భవనాన్ని నిర్మిస్తాడు. తండ్రిని బంగారు భవనంలో ఉండాల్సిందిగా కోరుతాడు. మిత్రుడు అయిన వందియతేవన్ సాయంతో కబురు పంపుతాడు. అయితే వెళ్లే దారిలో వందియతేవన్ కదంపూర్ భవనంలో కాసేపు బస చేస్తాడు. అక్కడే చోళ రాజ కోశాధికారి పలువెట్టయ్య కరికాలపై చేసిన కుట్ర గురించి తెలుస్తుంది. పినతండ్రి మధురాంతకన్‌ను గద్దె ఎక్కించేందుకు పలువెట్టయార్ కుట్రలు పన్నుతుంటాడు. ఆ పథకం ప్రకారమే.. కదంబూర్‌లోని భవనంలోకి ఆదిత్య కరికలన్‌ను రప్పించి హత్య చేస్తారు. ఈ హత్య నేరం వందియతేవన్‌పై ప‌డ‌గా,అత‌ను ఆ స‌మ‌స్య నుండి ఎలా బ‌య‌ట‌ప‌డ‌తాడు. వందియతేవన్, కుందవై మధ్య లవ్ ట్రాక్ ఏంటి అనేది థియేట‌ర్ లో చూడాల్సిందే.

న‌టీన‌టుల పర్‌ఫార్మెన్స్

విక్రమ్, కార్తీ, జయం రవి, త్రిష మరియు ఐశ్వర్య రాయ్ బచ్చన్ కీలక పాత్రల్లో న‌టించ‌గా, వారి వారి పాత్ర‌ల‌కు పూర్తి న్యాయం చేశారు. ముఖ్యంగా విక్ర‌మ్ న‌ట‌న అదిరిపోయింద‌ని అంటున్నారు. ప‌దో శ‌తాబ్ధం కాలం న‌టి గెట‌ప్ లో అద్భుతంగా క‌నిపించ‌డ‌మే కాక న‌ట‌న‌తోను ఇంప్రెస్ చేశాడు విక్ర‌మ్. మిగ‌తా న‌టీనన‌టులు కూడా పోటీ ప‌డి న‌టించారు.

టెక్నిక‌ల్ ప‌ర్‌ఫార్మెన్స్:

మ‌ణిర‌త్నం చిత్రాన్ని చాలా అద్భుతంగా తెర‌కెక్కించాడు. తాను అనుకున్న‌ట్టుగా చిత్రాన్ని మ‌లిచాడు. రెహ‌మాన్ సంగీతం కూడా పీక్స్‌లో ఉంది .విజువల్స్ ఈ సినిమాకు ప్లస్ అయినట్లు తెలిసింది. అయితే, సెకెండాఫ్‌లో స్క్రీన్‌ప్లే, గ్రాఫిక్స్‌లో క్వాలిటీ మిస్ అవడం, కథ ఫ్లాట్‌గా సాగడం దీనికి మైనస్‌గా మారాయి

ప్ల‌స్ పాయింట్స్:

న‌టీన‌టులు
సంగీతం

మైన‌స్ పాయింట్స్

సాగ‌దీత స‌న్నివేశాలు
గ్రాఫిక్స్ లో క్వాలిటీ

ఫైన‌ల్ గా..

తమిళ బాహుబలిగా వచ్చిన ‘పొన్నియన్ సెల్వన్’ మూవీ పూర్తిగా పిరియాడిక్ యాక్షన్ ప్యాక్‌గా తెరకెక్కించారు.. ఇందులో నటీనటులంతా చక్కగా నటించగా, అక్కడక్కడా దర్శకత్వ లోపం కనిపిస్తుంది. కానీ, కొత్త అనుభూతి మాత్రం ప్రేక్ష‌కుల‌కి ద‌క్కుతుంది. బాహుబ‌లి రేంజ్‌లొ సినిమా మ‌ళ్లీ చూడాలంటే ఈ సినిమాకి వెళ్లొచ్చు.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది