Rowdy Boys Movie Review : రౌడీ బాయ్స్ మూవీ రివ్యూ , రేటింగ్..!
Rowdy Boys Movie Review : దిల్ రాజు సోదరుడు శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా తెరకెక్కిన చిత్రం రౌడీ బాయ్స్. అనుపమ పరేమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఎట్టకేటకు సంక్రాంతి సందర్బంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది. హర్ష కోనుగంటి దర్శకత్వం వహించిన ఈ సినిమాను దిల్ రాజు, శిరీష్ కలిసి శ్రీ వెంకటేశ్వర బ్యానర్స్ పై నిర్మించారు.
దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా.. టీజర్ తోనే ఆకట్టుకోగా… తొలి రోజే మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఆశిష్, అనుపమ జోడీ ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంటుందని అంటున్నారు.
Rowdy Boys Movie Review చిత్రం : రౌడీ బాయ్స్
నటీనటులు : ఆశిష్, అనుపమ పరమేశ్వరన్ తదితరులు.
నిర్మాత : దిల్ రాజు
సంగీత దర్శకుడు :- దేవిశ్రీ ప్రసాద్
దర్శకుడు :- శ్రీ హర్ష కొనుగంటి
కథ: అక్షయ్ (ఆశిష్) LIT కాలేజ్ లో ఇంజనీరింగ్ చేస్తూ ఉంటాడు. కావ్య (అనుపమ పరమేశ్వరన్) BMC మెడికల్ కాలేజ్ లో మెడిసిన్ చదువుతూ ఉంటుంది. మెడికల్ కాలేజీకి, ఆశిష్ చేరబోయే కాలేజీకి అస్సలు పడదు. రెండు కాలేజీల విద్యార్థులు ఎప్పుడు ఎదురుపడినా కొట్టుకుంటూనే ఉంటారు. కావ్య క్లాస్ మేట్ విక్రమ్ (విక్రమ్ సహిదేవ్) కూడా తనను ప్రేమిస్తూ ఉంటాడు. వీరి ప్రేమకథ ఎలంటి ట్విస్ట్‌లతో నడిచింది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Rowdy Boys Movie Review : నటీనటుల పర్‌ఫార్మెన్స్:
దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ రెడ్డి ఈ సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. ఈ సినిమా కోసం ఆశిష్ చాలా కష్టపడినట్లు తెలిసిపోతోంది. డాన్స్ విషయంలో కానీ, యాక్షన్ విషయంలో కానీ చాలా జాగ్రత్త తీసుకున్నారు. అక్షయ్ పాత్ర ఆశిష్ కి సూట్ అయ్యింది. అనుపమ మేకోవర్ కూడా పాత్రకి తగ్గట్టుగా ఉంది. మిగతా పాత్రలు కూడా సినిమాకు మంచి ప్లస్ అయ్యాయి. నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియాలో మొదటి సారి స్క్రీన్‌పై కనిపించిన విక్రమ్ సహిదేవ్‌కు ఇందులో ఫుల్ లెంత్ పాత్ర లభించింది. కార్తీక్ రత్నం, శ్రీకాంత్ అయ్యంగార్, జయప్రకాష్ ఇలా మిగిలిన నటీనటులందరూ తమ పాత్రల పరిధిలో బాగానే నటించారు.
టెక్నికల్ టీం పర్‌ఫార్మెన్స్:
ప్రథమార్థాన్ని కాలేజీ నేపథ్యంలో నడిపించిన శ్రీహర్ష.. సెకండాఫ్‌లో పూర్తి లివ్-ఇన్ రిలేషన్ వైపు వెళ్లిపోయాడు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు వినడానికి, చూడటానికి కూడా బాగున్నాయి. నేపథ్య సంగీతం కూడా అలరించింది. స్క్రీన్ మీద సినిమా ఇంత అందంగా కనిపించడానికి కారణం మది. ఆయన సినిమాటోగ్రఫీకి 100కి 100 మార్కులు వేయవచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్ :
హీరో హీరోయిన్ కెమిస్ట్రీ
దేవి శ్రీ ప్రసాద్ సంగీతం
సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్:
రొటీన్ స్టోరీ
ఓవరాల్‌గా చెప్పాలంటే.. ఈ రౌడీ బాయ్స్ అక్కడక్కడా ఆకట్టుకుంటారు. శ్రీహర్ష మంచి కథను ఎంచుకున్నా.. కథనం కొంచెం దెబ్బకొట్టింది. సినిమా కొంత డిఫరెంట్‌గా అనిపించినా ప్రేక్షకులని అలరిస్తుంది.