Varudu Kaavalenu Movie Review : ‘వరుడు కావలెను’ మూవీ రివ్యూ.. భావోద్వేగాల సమ్మిళిత కుటుంబ కథా చిత్రం..
Varudu Kaavalenu Movie Review: టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య నటించిన సినిమాలన్నీ కూడా దాదాపుగా ప్రేక్షకులకు నచ్చాయి. డిఫరెంట్ స్టోరిస్ సెలక్ట్ చేసుకుంటూ తనకంటూ స్పెషల్ ట్రాక్ ఏర్పాటు చేసుకున్నాడు నాగశౌర్య. తెలుగు ప్రేక్షకులకు చివరగా ‘అశ్వత్థామ’ చిత్రంలో కనిపించిన నాగశౌర్య తాజాగా ‘వరుడు కావలెను’ చిత్రంతో పలకరించాడు. ఈ చిత్రం శుక్రవారం విడుదల కాగా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని బ్లాక్ బాస్టర్ దిశగా దూసుకుపోతున్నది. స్టార్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశారు. చిన్నసినిమానే అయినప్పటికీ ప్రమోషన్స్ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ గ్రాండ్‌గానే చేశారు.
టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేయగా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సందడి చేశారు. ఇకపోతే ఈ సినిమా ట్రైలర్ విడుదల అయినప్పటి నుంచే సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ బాగా పెరిగిపోయాయి. మహిళా దర్శకురాలు లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు ఇండియాతో పాటు యూఎస్‌లోనూ మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. రితూవర్మ హీరోయిన్‌గా నటించగా, నాగశౌర్యకు సరైన జోడీగా సినిమాలో కనిపించిందని ప్రేక్షకులు అంటున్నారు. స్టైలిష్ అమ్మ, అత్త పాత్రలకు కేరాఫ్ అయిన సీజన్డ్ యాక్ట్రెస్ నదియా.. ఈ చిత్రంలో అత్త పాత్రను పోషించింది. అత్త పాత్రలో నదియా హుందాగా కనిపించడంతో పాటు బలమైన ఎమోషన్స్ పండించిందని నెటిజన్లు, ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. ఈ చిత్రానికి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చాలా కీలకమని అనుకుంటున్నారు.
మొత్తంగా సినిమాకు హిట్ టాక్ రాగా బ్లాక్ బాస్టర్‌గా మూవీ దూసుకుపోవడం ఖాయమని అంటున్నారు. భారీ ఓపెనింగ్స్, సినిమాకు వస్తున్న టాక్ గురించి తెలుసుకుని మేకర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. విశాల్ చంద్రశేఖర్ అందించిన మ్యూజిక్ సినిమాకు అడ్వాంటేజ్ కాగా, ‘దిగు దిగు దిగు నాగ’ సాంగ్ ప్రేక్షకులు ఫేవరెట్ అయిపోయింది. ఈ చిత్రంలో కామెడీ కాని, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కాని చాలా ఫ్రెష్‌గా ఉన్నాయని, ఇంతకు మునుపు ఎన్నడూ ఇటువంటి ఎమోషన్స్ చూసి ఉండబోరని అంటున్నారు.
Varudu Kaavalenu Movie Review: అదిరిపోయిన ఫ్లాష్ బ్యాక్..
‘వరుడు కావలెను’ సినిమా కథ విషయానికొస్తే.. హీరో నాగశైర్య ఈ చిత్రంలో ఆకాశ్ అనే అర్కిటెక్ట్ రోల్ ప్లే చేశాడు. ఇండియా నుంచి దుబాయ్‌కు వెళ్లి అక్కడ అర్కిటెక్ట్‌గా సెటిల్ అయిపోయాడు. ఎన్ఆర్ఐగా ఉన్న అర్కిటెక్ట్ ఆకాశ్ తన ప్రాజెక్టు పనిరిత్యా ఇండియాకు వస్తాడు. అలా ఇండియాకు వచ్చిన క్రమంలో ప్రాజెక్టు వర్క్‌లో ఉన్న కంపెనీ మేనేజర్ అయిన భూమి(రితూవర్మ)ను చూస్తాడు. చూసిన ఫస్ట్ డే నుంచి భూమిని ఫాలో అవుతూ ఆమెను ప్రేమిస్తే ఆమెనే పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. ఈ క్రమంలోనే ఆకాశ్ భూమి తల్లి అయిన నదియాతో ఎలా ఇంటరాక్ట్ అవుతాడు? భూమికి పెళ్లి చేయడానికి నదియా ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది.
ప్రేమ, పెళ్లి విషయంలో మొండిగా ఉంటూనే భూమి ఆకాశ్‌ను ఎలా ప్రేమిస్తుంది. ఇంతలో ఎదురయ్యే ట్విస్ట్ ఏంటీ.. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌తో ప్రజెంట్ స్టోరికి లింక్ ఎలా అవుతుంది అనేది తెలియాలంటే మిగతా స్టోరి. కాగా, అది వెండితెరపైన చూస్తేనే బాగుంటుంది. డిఫరెంట్ స్టోరిస్ సెలక్షన్‌లో ఎప్పుడూ ముందుండే నాగశౌర్య…ఈ సారి హెల్దీ రొమాంటిక్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ స్టోరి సెలక్ట్ చేసుకున్నాడని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఇక ఈ చిత్రం తర్వాత నాగశౌర్య నటించబోయే చిత్రాలు చాలా వైవిధ్యంగా ఉన్నాయి. ‘లక్ష్య, ఫలానా అబ్బాయి, ఫలానా అమ్మాయి, నారి నారి నడుమ మురారి, పోలీసు వారి హెచ్చరిక’ చిత్రాలతో పాటు అనిష్ కృష్ణ డైరెక్షన్‌లో ఓ మూవీ చేస్తున్నాడు నాగశౌర్య.