2024 Rewind Modi : ఆసక్తికరంగా ప్రధాని మోదీ 2024 జర్నీ… అయోధ్య రామయ్య నుండి అంతరిక్ష యాత్రికుల వరకు
ప్రధానాంశాలు:
2024 Rewind Modi : ఆసక్తికరంగా ప్రధాని మోదీ 2024 జర్నీ... అయోధ్య రామయ్య నుండి అంతరిక్ష యాత్రికుల వరకు
2024 Rewind Modi : మరి కొద్ది గంటలలో పాత సంవత్సరం 2024కు గుడ్ బై చెప్పి కొత్త సంవత్సరం 2025కు స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. న్యూ ఇయర్ వేళ ప్రతిఒక్కరూ పాత సంవత్సర జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటారు. మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ Modi కూడా 2024లో ఎలా గడిపారు? ఎలాంటి విజయాలు సాధించారు ? ఈ సంవత్సర కాలంలో ఎవరెవరిని కలిసారు? అనేది చూస్తే అవి చాలా ఆసక్తికరంగా కనిపిస్తాయి. ఈ ఏడాది దుబాయ్, సౌదీ అరేబియా వంటి ముస్లిం దేశాలను సందర్శించిన ప్రధాని మోదీ, బ్రూనై, నైజీరియా వంటి ఆఫ్రికా దేశాల్లో సైతం పర్యటించారు.
2024 Rewind Modi మోదీ జర్నీ ఇదే..
అమెరికా, రష్యా వంటి శక్తివంతమైన దేశాలను కూడా ప్రధాని సందర్శించారు. ఇవే కాకుండా ప్రధాని మోదీ అనేక ఇతర దేశాలను కూడా సందర్శించారు. ప్రధాని మోదీ 2024 ఫిబ్రవరి 13 నుంచి 14 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అధికారిక పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి యూఏఈ అధ్యక్షుడు హిస్ హైనెస్ షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. యుఎఇ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, రక్షణ మంత్రి హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్‌ను కూడా ప్రధాని కలిశారు. ప్రధాన మంత్రి దుబాయ్‌లో జరిగిన ప్రపంచ ప్రభుత్వ సదస్సు 2024కి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అదే సందర్భంలో ప్రధాన మంత్రి అబుదాబిలో నిర్మించిన మొట్టమొదటి హిందూ దేవాలయమైన బీఏపీఎస్ ఆలయాన్ని ప్రారంభించారు.
పోలాండ్ నుండి ఉక్రెయిన్‌కు రైలులో ప్రయాణించారు ప్రధాని మోదీ. ఆయనతోపాటు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రయాణించారు. ఒడిశాలోని కంధమాల్‌లో ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించే ముందు ఒక వృద్ధ మహిళ నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు మోదీ. దేశంలోని మెజారిటీ హిందు ప్రజలు కల అయోధ్య రామాలయం. అక్కడ ఆలయాన్ని నిర్మించి స్వయంగా ప్రధాని మెదీ బాలరాముడి ప్రాణప్రతిష్ట (ప్రారంభోత్సవ) కార్యక్రమంలో పాల్గొన్నారు. లడఖ్‌లోని ద్రాస్‌ను సందర్శించారు ప్రధాని మోదీ. ఢిల్లీలో పాఠశాల విద్యార్థులతో కలిసి స్వచ్ఛ భారత్ అభియాన్‌లో ప్రధాని మోదీ కూడా పాల్గొన్నారు. నరేంద్ర మోదీ ఈ ఏడాది సెప్టెంబర్‌లో బ్రూనై సందర్శించారు, అక్కడ క్రౌన్ ప్రిన్స్ హాజీ అల్-ముహతాది బిల్లా ఆయనకు విమానాశ్రయంలో రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ అక్టోబర్ 22-23 తేదీల్లో రష్యాలో పర్యటించారు.