England T20 World Cup 2022 : 4 సంవత్సరాలలో.. 4 వరల్డ్ కప్ లు.. ఇంగ్లాండ్ విజయం వెనక ఆ మాస్టర్ మైండ్ వ్యక్తి..!!
England T20 World Cup 2022 : నిన్న T20 వరల్డ్ కప్ ఇంగ్లాండ్ గెలవడం తెలిసిందే. పాకిస్తాన్ జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి విశ్వ విజేతగా ఇంగ్లాండ్ అవతరించింది. బౌలింగ్ ఇంకా బ్యాటింగ్ పరంగా అన్ని రకాలుగా ఇంగ్లాండ్ ఆటగాళ్లు సమిష్టిగా ఆడారు. ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్ లో మొదట పాకిస్తాన్ బ్యాటింగ్ చేసి 138 పరుగులు చేయక తర్వాత బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ఆటగాళ్లు కొన్ని ఓవర్ లు మిగిలి ఉండగానే… టార్గెట్ చేదించారు. దీంతో 2010, 2022లో రెండుసార్లు t20 ప్రపంచ కప్ ఇంగ్లాండ్ వసమయింది.
ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ బౌలర్ కరణ్ … అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. నాలుగు ఓవర్లు వేసి మూడు వికెట్లు తీసి 12 రన్స్ మాత్రమే ఇవ్వటం జరిగింది. బెన్ స్టోక్స్… కీలకమైన సమయంలో అద్భుతమైన బ్యాటింగ్ చేసి నిలకడగా ఆడి ఇంగ్లాండ్ గెలవడంలో ప్రముఖ పాత్ర పోషించాడు. అయితే ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఈ రీతిగా గ్రౌండ్ లో ఆడటం వెనకాల ఓ మాస్టర్ మైండ్ ఉందని.. తాజాగా వార్తలు బయటకు వస్తున్నాయి. విషయంలోకి వెళ్తే ఆ జట్టు పరిమిత ఓవర్ ల కోచ్ మ్యాథ్యూ మాట్ … ఇంగ్లాండ్ కప్ గెలవడంలో ప్రముఖ పాత్ర పోషించడం జరిగిందట.
ఆస్ట్రేలియా దేశానికి చెందిన మ్యాథ్యూ మాట్ గత నాలుగేళ్లలో కోచ్ గా ఆయన ట్రాక్ రికార్డ్ చూస్తే… మ్యాథ్యూ మాట్ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకున్న టీంలు విశ్వ విజేతలుగా నిలిచాయి. 2018 నుంచి 2022 వరకు ఆస్ట్రేలియా మహిళల జట్టు కోచ్ గా వ్యవహరించారు. ఆయన ఆధ్వర్యంలో ఆస్ట్రేలియా ఉమెన్స్ టీం 2018, 2020 టి20 ప్రపంచకప్ లను.. 2022 వన్డే ప్రపంచకప్ లను సొంతం చేసుకుంది. ఇక లేటెస్ట్ గా 2022 T20 ప్రపంచ కప్ పురుషుల జట్టు విషయంలో ఇంగ్లాండ్ నీ విశ్వవిజేతగా నిలిపాడు. మ్యాథ్యూ మాట్ … గ్రౌండ్ లో ఉండే ఆటగాళ్లతో వేసే వ్యూహాలు … ప్రత్యర్థి జక్టులను ఇబ్బందుల్లోకి నెట్టేస్తాయి. ఈ రీతిగానే ఈ ప్రపంచకప్ టోర్నీలో మాట్… ఇంగ్లాండ్ టీం చేత తన మాస్టర్ మైండ్ తో ఆడించి… జట్టు గెలవడంలో ప్రముఖ పాత్ర పోషించినట్లు ఆయనపై ఇప్పుడు ప్రస్తుతం వార్తలు కుప్పలు తేప్పలుగా వస్తున్నాయి.