Abhishek Sharma : రాసి పెట్టుకొని మరీ సెంచరీ కొట్టావ్.. నువ్వు తోపు అభిషేక్..!
ప్రధానాంశాలు:
Abhishek Sharma : రాసి పెట్టుకొని మరీ సెంచరీ కొట్టావ్.. నువ్వు తోపు అభిషేక్..!
Abhishek Sharma : సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ తాజాగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసకర శతకంతో చెలరేగాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో శనివారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 40 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఈ సెంచరీని అభిషేక్ శర్మ తనదైన శైలిలో సెలెబ్రేట్ చేసుకున్నాడు.

Abhishek Sharma : రాసి పెట్టుకొని మరీ సెంచరీ కొట్టావ్.. నువ్వు తోపు అభిషేక్..!
Abhishek Sharma ఇది కదా..
జేబులో నుంచి ఓ పేపర్ తీసి.. అందరికి చూపిస్తూ సంతోషం వ్యక్తం చేశాడు. ఆ పేపర్‌పై ‘This one is for Orange army (ఈ సెంచరీ ఆరెంజ్ ఆర్మీ కోసం)’అని రాసి ఉంది. ప్రస్తుతం ఈ సెలెబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారగా.. ‘రాసి పెట్టుకొని మరి కొట్టాడు సామీ’అని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
పంజాబ్ కింగ్స్ ఫీల్డర్ల తప్పిదాలతో పాటు యశ్ ఠాకూర్ నోబాల్‌తో ఔటయ్యే ప్రమాదం నుంచి బచాయించిన అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అభిషేక్.. మరో 21 బంతుల వ్వవధిలో సెంచరీ మార్క్ అందుకున్నాడు. ట్రావిస్ హెడ్‌తో కలిసి తొలి వికెట్‌కు 171 పరుగులు జోడించిన అభిషేక్.. క్లాసెన్‌తో కలిసి రెండో వికెట్‌కు 51 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు.ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.