ICC World Cup 2023 : దక్షిణాఫ్రికా చేతుల్లో భారత్ ఓడాల్సిందే.. దేవుళ్లను కోరుకుంటున్న క్రికెట్ ఫ్యాన్స్.. ఎందుకో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

ICC World Cup 2023 : దక్షిణాఫ్రికా చేతుల్లో భారత్ ఓడాల్సిందే.. దేవుళ్లను కోరుకుంటున్న క్రికెట్ ఫ్యాన్స్.. ఎందుకో తెలుసా?

 Authored By kranthi | The Telugu News | Updated on :3 November 2023,5:00 pm

ప్రధానాంశాలు:

  •  2011 సెంటిమెంట్ 2023 లో వర్కవుట్ అవుతుందా?

  •  భారత్.. దక్షిణాఫ్రికా చేతుల్లో ఓడిపోతుందా? గెలుస్తుందా?

  •  నవంబర్ 5న ఏం మిరాకిల్ జరుగుతుందో?

ICC World Cup 2023 : ప్రస్తుతం భారత్ ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 లో దూసుకుపోతోంది. ఓటమి ఎరుగని టీమ్ గా చరిత్ర సృష్టిస్తోంది. ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్ లు అన్నింట్లో గెలిచి సత్తా చాటింది. సొంత గడ్డపై గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తోంది భారత్. అజేయ భారత్ గా నిలుస్తోంది. ఇప్పటికే సెమీస్ కు క్వాలిఫై అయిన తొలి జట్టుగా రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు భారత్ ఏడు మ్యాచ్ లు ఆడింది. అన్నింట్లో విజయం సాధించింది. ఇంకో రెండు మ్యాచ్ లను భారత్ ఆడాల్సి ఉంది. లీగ్ దశలో మొత్తం 9 మ్యాచ్ లో ఆడాలి. 7 మ్యాచ్ లలో ఆడి అన్నింట్లో గెలిచి సత్తా చాటింది. వరల్డ్ కప్ లో టాప్ ప్లేస్ లో నిలిచింది. అయినా కూడా మరో రెండు మ్యాచ్ లు ఆడాలి. లీగ్ దశలో ఇంకా రెండు మ్యాచ్ లలో ఆడినా, ఆడకున్నా, గెలిచినా, గెలవకున్నా భారత్ కు వచ్చిన నష్టమేమీ లేదు. ఎందుకంటే… భారత్ ఇప్పటికే సెమీస్ కు చేరుకుంది కాబట్టి.

నవంబర్ 5న భారత్.. దక్షిణాఫ్రికాతో తన తదుపరి మ్యాచ్ ను ఆడనుంది. ఆ తర్వాత లీగ్ దశలో చివరి మ్యాచ్ ను నవంబర్ 12న నెదర్లాండ్స్ తో ఆడనుంది. అయితే.. ఈ రెండు మ్యాచ్ లలో దక్షిణాఫ్రికా చేతుల్లో భారత్ ఓడిపోవాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. అదేంటి ఎవరైనా గెలవాలని కోరుకుంటారు కానీ.. వీళ్లేంటి ఓడిపోవాలని కోరుకోవడం ఏంటి అంటారా? అక్కడే ఉంది తిరకాసు. నిజానికి.. దక్షిణాఫ్రికా కూడా ఈ వరల్డ్ కప్ లో మంచి ఫామ్ లో ఉంది. ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్ లలో ఒక్క మ్యాచ్ లోనే ఓడిపోయి రెండో ప్లేస్ లో ఉంది. 12 పాయింట్లు సాధించింది. అందుకే మొదటి, రెండో స్థానాల్లో ఉన్న భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరగబోయే మ్యాచ్ గురించే అందరూ ఆలోచిస్తున్నారు. అయితే.. 2011 లో జరిగిన వన్డ్ వరల్డ్ కప్ లో భారత్ గెలిచిన విషయం తెలుసు కదా. ఆ టోర్నీలో లీగ్ దశలో భారత్ ఒక్క మ్యాచ్ లోనే ఓడిపోయింది. అది కూడా దక్షిణాఫ్రికా చేతుల్లో. దక్షిణాఫ్రికా చేతుల్లో లీగ్ మ్యాచ్ లో ఓడిపోయినా చివరకు కప్ మాత్రం గెలుచుకుంది.

ICC World Cup 2023 : ఆ సెంటిమెంట్ ఈసారి వర్కవుట్ అవుతుందా?

అప్పుడు లీగ్ దశలో భారత్.. దక్షిణాఫ్రికా చేతుల్లో ఓడిపోవడంతో కప్ గెలవడం వల్ల.. ఈసారి కూడా భారత్.. దక్షిణాఫ్రికా చేతుల్లో ఓడిపోతే 2023 వరల్డ్ కప్ మనదే అంటూ భారత్ క్రికెట్ ఫ్యాన్స్ లెక్కలు వేసుకుంటున్నారు. అయితే.. మరికొందరు మాత్రం అలా ఏం లేదు.. భారత్ అన్ని మ్యాచ్ లలో గెలవాలి. దక్షిణాఫ్రికాపై కూడా గెలవాలి అంటూ చెప్పుకొస్తున్నారు. ఇక.. భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఈనెల 5న మ్యాచ్ కోల్ కతాలో జరగనుంది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది