T20 World Cup 2022 : ఇండియానీ ఓడిస్తే వరల్డ్ కప్ గెలిచినట్లే… బంగ్లాదేశ్ కెప్టెన్ కామెంట్స్..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

T20 World Cup 2022 : ఇండియానీ ఓడిస్తే వరల్డ్ కప్ గెలిచినట్లే… బంగ్లాదేశ్ కెప్టెన్ కామెంట్స్..!!

 Authored By sekhar | The Telugu News | Updated on :1 November 2022,3:40 pm

T20 World Cup 2022 : ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న T20 వరల్డ్ కప్ టోర్నీలో టీమిండియా దూసుకుపోతుంది. ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్ లలో రెండిటిలో గెలవడం జరిగింది. ఆదివారం సౌత్ ఆఫ్రికా జరిగిన మ్యాచ్ లో ఓటమిపాలైంది. ఈ తరుణంలో నవంబర్ రెండవ తారీకు బంగ్లాదేశ్ తో జరగబోయే మ్యాచ్ గెలిచి సెమిస్ బేర్త్ కన్ఫామ్ చేసుకోవడానికి రోహిత్ సేన రెడీ అయింది. పరిస్థితి ఇలా ఉంటే నవంబర్ రెండవ తారీకు జరగబోయే మ్యాచ్ గురించి మీడియా సమావేశంలో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

జరగబోయే మ్యాచ్ లో టీమిండియానే ఫేవరెట్ అయినా గాని ఆ జుట్టును ఓడించేందుకు తాము 100% కష్టపడతామని తెలిపారు. వరల్డ్ కప్ గెలవడానికి వచ్చిన ఇండియాని ఓడిస్తే తమకు వరల్డ్ కప్ గెలిచినంత ఆనందమని షాకింగ్ కామెంట్స్ చేశారు. జరగబోయే ఈ టోర్నీలో ప్రతి మ్యాచ్ కీలకమేనని.. ఇకనుండి ప్రత్యర్థి ఎవరనేది పట్టించుకోమని టీంగా మొత్తం అందరూ కలిసికట్టుగా రాణించడానికి రెడీగా ఉన్నట్లు తెలిపారు.

T20 World Cup 2022 on Bangladesh captain Shakib Al Hasan comments on India

T20 World Cup 2022 on Bangladesh captain Shakib Al Hasan comments on India

ఈ టోర్నీలో ఐర్లాండ్ ఇంకా జింబాబ్వే లాంటి జట్లు పాకిస్తాన్, ఇంగ్లాండ్ టీములకు షాక్ ఇవ్వగా తాము కూడా ఆ రీతిగానే ఇండియాతో జరిగే మ్యాచ్ ఆడతామని చెప్పుకొచ్చారు. దీంతో బంగ్లాదేశ్ కెప్టెన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కావాలని భారత్ పై ఒత్తిడి పెంచడానికి షకీబ్ ఈ రీతిగా కామెంట్లు చేసినట్లు క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు. టోర్నీలో భారత్ మరియు బంగ్లాదేశ్ రెండు జట్టులు నాలుగు పాయింట్లతో సమానంగా ఉన్న… మెరుగైన రన్ రేట్ కారణంగా టీమ్ ఇండియా పాయింట్స్ టేబుల్ లో రెండో స్థానంలో నిలిచింది. దీంతో బంగ్లాదేశ్ మూడో స్థానంలో ఉంది.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది