Brett Lee : 2013 తర్వాత ఐసీసీ ట్రోఫీ కోసం టీం ఇండియా నిరీక్షణ సాగుతుంది. ఈసారి ఎలాగైనా టి20 వరల్డ్ కప్ గెలుస్తుంది అని అనుకున్నప్పటికీ సెమీస్ వరకు వెళ్లి వెనుతిరిగింది. దీంతో టీమ్ ఇండియా అభిమానులు అందరూ నిరాశ పడ్డారు. 2011లో వన్డే వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా ఇంకా తర్వాత నుండి కప్పు గెలవలేకపోతుంది. 2015 మరియు 2019 వరల్డ్ కప్లలో సెమీఫైనల్ వరకు వెళ్లినప్పటికీ ఫైనల్లో చోటు దకించుకోలేకపోయింది. 2014లో కూడా వరల్డ్ కప్ ఫైనల్ వరకు వెళ్లి పరాజయం పొంది.
అలాగే ఆ తర్వాత 2016లో కూడా సెమిస్ వరకు వెళ్లి వెనుతిరిగింది. అయితే వచ్చే సంవత్సరంలో వన్డే వరల్డ్ కప్ ను భారతదేశంలో నిర్వహించనున్నారు. దీంతో సొంత గడ్డ పైన ఎలాగైనా సరే కప్పు కొట్టి తీరాలని భారత జట్టు పట్టుదలతో ఉంది. ఇప్పటికే బీసీసీఐ వన్డే వరల్డ్ కప్ కోసం సన్నాహాలను ప్రారంభించింది. 2024 టీ20 వరల్డ్ కప్ కోసం బీసీసీఐ ఇప్పటి నుండే ప్రణాళికలు రూపొందిస్తుంది. ఇక ఈ ఫార్మేట్ కు హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా నియమించనుందని సమాచారం. ఐసీసీ ట్రోఫీను నెరవేర్చే సత్తా సూర్య కుమార్ యాదవ్ కి ఉందని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రెట్ లీ అభిప్రాయపడ్డాడు.

సూర్య కుమార్ టి20 లో గ్లోబల్ సూపర్ స్టార్ గా ఎదిగాడని బ్రేట్ లీ చెప్పుకోచ్చాడు. అతను ఆడే షాట్లు నాకు చాలా ఇష్టమని, అలాగే ఆస్ట్రేలియాా వికెట్ల మీద సూర్య కుమార్ భయం లేకుండా ఆడాడని బ్రేట్ లీ తెలియజేశాడు. ఏదో ఒక రోజు అతను టీమిండియా కు కచ్చితంగా వరల్డ్ కప్ ను అందించగలుగుతాడని చెప్పుకొచ్చాడు. ఇక సూర్యకుమార్ కు నేను ఇచ్చే సలహా అంటూ ఏం లేదని నీ ఆట ను ఇలాగే కొనసాగించు అంటూ బ్రెట్ లీ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేశాడు. బ్రెట్లీ అంచనాలకు తగ్గట్టుగా సూర్య కుమార్ తన ఆటను ప్రదర్శిస్తాడో లేదో వేచి చూడాలి.