T20 World Cup 2022 : 2007 T20 వరల్డ్ కప్ ఈ ఏడాది కప్పుకి ఆ ఒక్క తేడా మినహా మిగతాదంతా సేమ్ టు సేమ్..!!
T20 World Cup 2022 : T20 వరల్డ్ కప్ టోర్నీ 2007వ సంవత్సరం నుండి స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. ఫస్ట్ T20 వరల్డ్ కప్ టోర్నీ కెప్టెన్ ధోని ఆధ్వర్యంలో ఇండియా గెలవడం జరిగింది. అప్పటినుండి ఇప్పటివరకు మరోసారి ఇండియా T20 వరల్డ్ కప్ గెలవలేదు. అయితే ఈ ఏడాది T20 వరల్డ్ కప్ టోర్నీలో ఇండియా సెమీఫైనల్ లో ఉండటంతో… కప్ గెలవాలని ఇండియన్ క్రికెట్ ప్రేమికులు కోరుకుంటున్నారు. జరుగుతున్న టోర్నీలో నరాలు తిరిగే ఉత్కంఠ భరితంగా ప్రతి మ్యాచ్ ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులు ఈ టోర్ని ఎంతగానో ఆస్వాదిస్తున్నారు.
కనీసం ఎటువంటి అంచనాలు లేకుండా పసికున్న లాంటి జింబాబ్వే, నెదర్లాండ్స్ లాంటి జట్లు కూడా బలమైన టీమ్స్ పాకిస్తాన్ మరియు సౌత్ ఆఫ్రికాలను ఓడించడం హైలెట్. అక్టోబర్ 16వ తారీకు నుండి జరుగుతున్న ఈ టోర్ని ఇప్పుడు ఆఖరి ఘట్టానికి చేరుకుంది. సెమీస్ లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, భారత్ జట్లు చోటు సంపాదించాయి. అయితే 2007వ సంవత్సరంలో జరిగిన T20 వరల్డ్ కప్ టోర్నీకి ఈ ఏడాది జరుగుతున్న దానికి ఒక్క తేడా మినహా మిగతాదంతా ఒకేలా ఉందని క్రికెట్ ప్రేమికులు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.
పూర్తి విషయంలోకి వెళ్తే 2007 T20 వరల్డ్ కప్ టోర్నీలో సెమీ ఫైనల్ కి చేరుకున్న టీమ్స్… ఇండియా, పాకిస్తాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా. అయితే ఇప్పుడు 2022 T20 వరల్డ్ కప్ టోర్నీలో సెమిస్ లో ఒక్క ఆస్ట్రేలియా మినహా మిగతా మూడు టీములతో పాటు… కొత్తగా ఇంగ్లాండ్ చేరింది. ఈ ఒక్క తేడా మిగతాదంతా 2007 టీ20 వరల్డ్ కప్ టోర్నీ మాదిరిగానే.. పరిస్థితులు ఏర్పడ్డాయి అని అంటున్నారు. ఇక ఇదే సమయంలో 2007 మాదిరిగానే ఈ ఏడాది T20 వరల్డ్ కప్ భారత్ గెలిస్తే బాగుంటుందని ఇండియన్ క్రికెట్ ప్రేమికులు తాజా వార్త పై కామెంట్లు పెడుతున్నారు.