HCA And SRH : ఎస్ఆర్‌హెచ్ వివాదంపై స్పందించిన హెచ్‌సీఏ.. వారి వల్లే గొడవ
ప్రధానాంశాలు:
HCA And SRH : ఎస్ఆర్‌హెచ్ వివాదంపై స్పందించిన హెచ్‌సీఏ.. వారి వల్లే గొడవ
HCA And SRH : గత కొద్ది రోజులుగా సన్ రైజర్స్, sunrisers hyderabad హెచ్‌సీఏ HCA మధ్య వివాదం నడుస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే సన్‌రైజర్స్ చేసిన ఆరోపణల పట్ల హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) స్పందించింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) విడుదల చేసిన లేఖలో ఎస్‌ఆర్‌హెచ్ చేసిన ప్రతీ ఆరోపణకు వివరణ ఇచ్చింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఉద్యోగుల్లోని కొందరు వ్యక్తుల వల్లే ఈ గొడవ తలెత్తిందని హెచ్‌సీఏ స్పష్టం చేసింది.

HCA And SRH : ఎస్ఆర్‌హెచ్ వివాదంపై స్పందించిన హెచ్‌సీఏ.. వారి వల్లే గొడవ
HCA And SRH ఏంటి ఈ గొడవ..
ఎస్ఆర్‌హెచ్ తీరు సరిగా లేదని, మొదట జరిగిన ఒప్పందానికి.. తర్వాత జరిగిన పరిణామాలకు సంబంధంలేదని హెచ్‌సీఏ పేర్కొంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్‌రావు ఉచితంగా పాస్‌ల కోసం డిమాండ్ చేశారన్న దాంట్లో వాస్తవం లేదని కేవలం 3,900 పాస్‌లు ఇస్తామని చెప్పి 2,500 పాస్‌లు ఇచ్చారని హెచ్‌సీఏ తెలిపింది.
తాము కోటాకు మించి కాంప్లిమెంటరీ పాసులను ఎన్నడూ అడగలేదని పేర్కొంటూ.. సోమవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. హెచ్‌సీఏ క్లబ్ సెక్రటరీలకు ఇచ్చే పాసులు సరిపోక.. మరికొన్ని పాసులను డబ్బులిచ్చి కొనుగోలు చేయడానికి అవకాశమివ్వాలని కోరాం. అందుకు ఎస్‌ఆర్‌హెచ్ అంగీకరించింది. ఆ తర్వాత ఇలా ఈమెయిల్స్‌ను లీక్ చేయడం పద్ధతికాదు’’ అని ఆ ప్రకటనలో వివరించింది. స్టేడియానికి రంగులు వేయడానికి ఖర్చుచేశామని చెప్పిన ఎస్‌ఆర్‌హెచ్.. పనుల వివరాలు మాత్రం చెప్పడం లేదని వివరించింది. ఇప్పటివరకు జరిగిన విషయాలను పక్కనబెట్టి విశాల దృక్పథంతో సమస్యల పరిష్కారానికి హెచ్‌సీఏతో చర్చలకు రావాలని కోరుతున్నాం అని ప్రకటనలో పేర్కొంది.