Dhoni : ప్రస్తుతం ఐపీఎల్ హంగామా మాములుగా లేదు. ప్రతి జట్టు కూడా అందుకు తగ్గ ప్రదర్శన చేస్తుంది. ఆదివారం రోజు రెండు మ్యాచ్‌లు జరగగా, ఆ రెండు కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగాయి. తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై గుజరాత్ టైటాన్స్ మంచి విజయం సాధించింది. ఇక ఆ తర్వాత విశాఖ తీరం వేదికగా చెన్నై సూపర్ కింగ్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మంచి ఫైట్ జరిగింది. ఇందులో సమష్టిగా రాణించిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 5 వికెట్లకు 191 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్(35 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 52), రిషభ్ పంత్(32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 51) హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. పృథ్వీ షా(27 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43) తొలి మ్యాచ్‌లో సత్తా చాటాడు.
ఇక చెన్నై బౌలర్స్ లో మతీష పతీరణ మూడు వికెట్లు తీయగా.. ముస్తాఫిజుర్ రెహ్మాన్, రవీంద్ర జడేజా తలో వికెట్ పడగొట్టారు. అయితే ఈ మ్యాచ్‌లో రీఎంట్రీ తర్వాత వచ్చిన పంత్ హాఫ్ సెంచరీ చేయడం విశేషం. తొలి 23 బంతుల్లో 23 పరుగులే చేసిన అతను తర్వాతి 9 బంతుల్లో 28 పరుగులు చేశాడు. ఇక 192 పరుగుల లక్ష్యచేధనకు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 171 పరుగులే చేసి ఓటమిపాలైంది. అజింక్యా రహానే(30 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 45), మహేంద్ర సింగ్ ధోనీ(16 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37 నాటౌట్), డారిల్ మిచెల్(26 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 34) మాత్రమే కాస్త పరుగులు రాబట్టారు. మిగతా వారంతా నిరాశపరిచారు.
చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఈ సీజన్‌లో తొలిసారి బ్యాట్ పట్టి దుమ్ము లేపాడు. పాత ధోనీని తలపిస్తూ బౌలర్లను వణికించాడు. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ధోనీ ఆకాశమే హద్దుగా చెలరేగిన ధోని 16 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37 పరుగులతో అజేయంగా నిలిచాడు.అయితే ధోని విధ్వంసం సృష్టించిన ఆ జట్టు విజయం సాధించలేకపోయింది. అన్రిచ్ నోకియా వేసిన ఆఖరి ఓవర్‌లో అయితే ధోని 4, 6, 0, 4, 0, 6లతో 20 పరుగులు చేశాడు. ధోనీ తొలి బంతినే బౌండరీ బాదాడు. ఆ మరుసటి బంతికే ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న తన వింటేజ్ బ్యాటింగ్‌తో చెలరేగాడు. తనకు అచ్చొచ్చిన విశాఖ మైదానంలో పాత ధోనీని తలపిస్తూ బౌలర్లను భయపెట్టాడు. విశాఖ తీరాన ధోని విధ్వంసం చూసి క్రికెట్ ప్రియులు మైమరచిపోయారు.
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
This website uses cookies.