Dhoni : ధోని ధ‌నాధ‌న్ షాట్స్‌కి ప‌ర‌వ‌శించిపోయిన విశాఖ ప్ర‌జ‌లు..పాత ధోనిని మైమ‌రిపించాడుగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Dhoni : ధోని ధ‌నాధ‌న్ షాట్స్‌కి ప‌ర‌వ‌శించిపోయిన విశాఖ ప్ర‌జ‌లు..పాత ధోనిని మైమ‌రిపించాడుగా..!

Dhoni : ప్ర‌స్తుతం ఐపీఎల్ హంగామా మాములుగా లేదు. ప్ర‌తి జ‌ట్టు కూడా అందుకు త‌గ్గ ప్ర‌ద‌ర్శ‌న చేస్తుంది. ఆదివారం రోజు రెండు మ్యాచ్‌లు జ‌ర‌గ‌గా, ఆ రెండు కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగాయి. తొలి మ్యాచ్‌లో స‌న్‌రైజర్స్‌పై గుజ‌రాత్ టైటాన్స్ మంచి విజ‌యం సాధించింది. ఇక ఆ త‌ర్వాత విశాఖ తీరం వేదిక‌గా చెన్నై సూప‌ర్ కింగ్, ఢిల్లీ క్యాపిట‌ల్స్ మ‌ధ్య మంచి ఫైట్ జ‌రిగింది. ఇందులో సమష్టిగా రాణించిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 పరుగుల […]

 Authored By ramu | The Telugu News | Updated on :1 April 2024,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Dhoni : ధోని ధ‌నాధ‌న్ షాట్స్‌కి ప‌ర‌వ‌శించిపోయిన విశాఖ ప్ర‌జ‌లు..పాత ధోనిని మైమ‌రిపించాడుగా..!

Dhoni : ప్ర‌స్తుతం ఐపీఎల్ హంగామా మాములుగా లేదు. ప్ర‌తి జ‌ట్టు కూడా అందుకు త‌గ్గ ప్ర‌ద‌ర్శ‌న చేస్తుంది. ఆదివారం రోజు రెండు మ్యాచ్‌లు జ‌ర‌గ‌గా, ఆ రెండు కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగాయి. తొలి మ్యాచ్‌లో స‌న్‌రైజర్స్‌పై గుజ‌రాత్ టైటాన్స్ మంచి విజ‌యం సాధించింది. ఇక ఆ త‌ర్వాత విశాఖ తీరం వేదిక‌గా చెన్నై సూప‌ర్ కింగ్, ఢిల్లీ క్యాపిట‌ల్స్ మ‌ధ్య మంచి ఫైట్ జ‌రిగింది. ఇందులో సమష్టిగా రాణించిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 5 వికెట్లకు 191 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్(35 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 52), రిషభ్ పంత్(32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 51) హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. పృథ్వీ షా(27 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43) తొలి మ్యాచ్‌లో స‌త్తా చాటాడు.

Dhoni ధ‌నాధ‌న్ షాట్స్‌తో దుమ్ము రేపిన ధోని

ఇక చెన్నై బౌల‌ర్స్ లో మతీష పతీరణ మూడు వికెట్లు తీయగా.. ముస్తాఫిజుర్ రెహ్మాన్, రవీంద్ర జడేజా తలో వికెట్ పడగొట్టారు. అయితే ఈ మ్యాచ్‌లో రీఎంట్రీ తర్వాత వ‌చ్చిన పంత్ హాఫ్ సెంచ‌రీ చేయ‌డం విశేషం. తొలి 23 బంతుల్లో 23 పరుగులే చేసిన అతను తర్వాతి 9 బంతుల్లో 28 పరుగులు చేశాడు. ఇక 192 ప‌రుగుల ల‌క్ష్యచేధనకు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 171 పరుగులే చేసి ఓటమిపాలైంది. అజింక్యా రహానే(30 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 45), మహేంద్ర సింగ్ ధోనీ(16 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37 నాటౌట్), డారిల్ మిచెల్(26 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 34) మాత్ర‌మే కాస్త ప‌రుగులు రాబ‌ట్టారు. మిగ‌తా వారంతా నిరాశ‌ప‌రిచారు.

చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఈ సీజ‌న్‌లో తొలిసారి బ్యాట్ ప‌ట్టి దుమ్ము లేపాడు. పాత ధోనీని తలపిస్తూ బౌలర్లను వణికించాడు. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ధోనీ ఆకాశమే హద్దుగా చెలరేగిన ధోని 16 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37 పరుగులతో అజేయంగా నిలిచాడు.అయితే ధోని విధ్వంసం సృష్టించిన ఆ జ‌ట్టు విజ‌యం సాధించ‌లేక‌పోయింది. అన్రిచ్ నోకియా వేసిన ఆఖరి ఓవర్‌లో అయితే ధోని 4, 6, 0, 4, 0, 6లతో 20 పరుగులు చేశాడు. ధోనీ తొలి బంతినే బౌండరీ బాదాడు. ఆ మరుసటి బంతికే ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న తన వింటేజ్ బ్యాటింగ్‌తో చెలరేగాడు. తనకు అచ్చొచ్చిన విశాఖ మైదానంలో పాత ధోనీని తలపిస్తూ బౌలర్లను భయపెట్టాడు. విశాఖ తీరాన ధోని విధ్వంసం చూసి క్రికెట్ ప్రియులు మైమ‌ర‌చిపోయారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది