Disney Hotstar : ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌లో డిస్నీ హాట్‌స్టార్ రికార్డు.. క్రికెట్ చరిత్రలోనే ఆల్‌టైమ్ రికార్డ్ నమోదు

Authored By Breaking News 2 | The Telugu News | Published on: October 15, 2023, 10:00 am

Disney Hotstar : ఇండియన్స్ కు క్రికెట్ అంటే ఎంత అభిమానమో తెలుసు కదా. భారత్ లో కొన్ని కొట్ల మంది క్రికెట్ అభిమానులు ఉన్నారు. అందులోనూ దాయాదుల పోరు అంటే ఇక ఆరోజు ఎలాంటి పనులు ఉన్నా ఖచ్చితంగా అన్నీ వాయిదా వేసుకొని మరీ భారత్, పాకిస్థాన్ మ్యాచ్ చూడాల్సిందే. చిరకాల ప్రత్యర్థితో మ్యాచ్ అంటే.. అన్ని రికార్డులు బద్దలు కావాల్సిందే. నిన్న జరిగిన ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ లోనూ అదే జరిగింది. ఈ మ్యాచ్ ప్రసారం అయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ చరిత్ర సృష్టించింది. క్రికెట్ చరిత్రలోనే ఇది ఆల్ టైమ్ రికార్డు అని చెప్పుకోవచ్చు. కొన్ని కోట్ల వ్యూయర్ షిప్ కేవలం ఈ మ్యాచ్ కే దక్కింది. ఇప్పటి వరకు డిస్నీ హాట్ స్టార్ చరిత్రలో ఇన్ని వ్యూస్ ఎప్పుడూ రాలేదు. అందుకే ఇది ఆల్ టైమ్ రికార్డుగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ స్పష్టం చేసింది. అసలే వన్డే ప్రపంచ కప్.. అందులోనూ భారత్, పాక్ మ్యాచ్. అందుకే ఇప్పటి వరకు హాట్ స్టార్ పేరు మీద ఉన్న రికార్డులన్నీ బ్రేక్ అయ్యాయి.

అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నిన్న మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఇది ఒక హైఓల్టేజ్ మ్యాచ్ అని చెప్పుకోవాలి. ఈ మ్యాచ్ కి భారీ స్థాయిలో హాట్ స్టార్ లో వ్యూస్ వచ్చాయి. ఈ మ్యాచ్ కు ఏకంగా 3 కోట్ల 40 లక్షల వ్యూస్ వచ్చాయట. అది కూడా ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్ సమయంలోనే ఎక్కువ వ్యూస్ రికార్డు అయ్యాయట. నిజానికి నిన్నటి మ్యాచ్ లో భారత్ గెలుపు ముందే ఖాయం అయింది. ఎందుకంటే.. పాకిస్థాన్ అనుకున్న రేంజ్ లో ఆడలేదు. చాలా స్వల్ప స్కోర్ నే భారత్ కు నిర్దేశించింది. అయినా కూడా భారత్ బ్యాటింగ్ సమయంలో అది కూడా రోహిత్ శర్మ చెలేరేగి మరీ ఆడిన ఆయన బ్యాటింగ్ సమయంలో ఎక్కువ వ్యూస్ వచ్చాయట. మ్యాచ్ మొత్తం 3 కోట్లకు తగ్గకుండా వ్యూస్ వచ్చినట్టు తెలుస్తోంది. అంటే 3 కోట్ల మంది భారతీయులు కేవలం హాట్ స్టార్ లోనే మ్యాచ్ చూశారన్నమాట.

disney hotstar creates viewership record in india vs pakistan match

#image_title

Disney Hotstar : ఆసియా కప్ లోనూ రికార్డు స్థాయిలో వ్యూస్

ఆసియా కప్ లోనూ భారత్, పాక్ మధ్య జరిగిన మ్యాచ్ లో 2 కోట్ల 80 లక్షల వ్యూస్ వచ్చాయి. ఇప్పటి వరకు అవే అత్యధిక వ్యూస్ గా నమోదయ్యాయి. కానీ.. వరల్డ్ కప్ మ్యాచ్ లో మళ్లీ అదే పాక్, భారత్ మ్యాచ్ లో వ్యూస్ రికార్డును చెరిపేసి 3 కోట్లకు పైగా వ్యూస్ వచ్చి హాట్ స్టార్ చరిత్ర సృష్టించింది. నిజానికి హాట్ స్టార్ కు ఇన్ని వ్యూస్ రావడానికి కారణం.. ఈసారి ఎలాంటి సబ్ స్క్రిప్షన్ లేకుండానే హాట్ స్టార్ లో మ్యాచ్ చూసే అవకాశం కల్పించింది హాట్ స్టార్.

అంటే.. సబ్ స్క్రిప్షన్ ఆప్షన్ అవసరం లేదు. కేవలం యాప్ ను ఇన్ స్టాల్ చేసుకున్నా, లేదా వెబ్ లో హాట్ స్టార్ వెబ్ సైట్ లోకి వెళ్లి మ్యాచ్ ను ఫ్రీగా చూడొచ్చు. లాగిన్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. అందుకే ఈసారి అన్ని కోట్ల వ్యూస్ వచ్చినట్టు తెలుస్తోంది.

Breaking News 2

No bio available for this author.

  1. "Bigg Boss Telugu 10 : నాగార్జున మాస్ వార్నింగ్.. ఝాన్సీ గుట్టు రట్టు!"

  2. "AP Local Elections : బిగ్ బ్రేకింగ్‌ స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు.. ఎవరికి ఎన్ని సీట్లు..?"

  3. "Delhi Protests : ఢిల్లీలో పైచేయి ఎవరిది? అరెస్టులు, నిరసనలతో కేంద్రానికి కొత్త సవాల్!"

  4. "Chandrababu : బీసీ సంక్షేమంలో చంద్రబాబు మార్క్.. 34 శాతం రిజర్వేషన్ల హామీతో వైసీపీకి భారీ చెక్..?"

  5. "Ranabaali : తెలంగాణ హీరో రాయలసీమ యాసను ఎలా పట్టుకున్నాడు? విజయ్ దేవరకొండ సంచలన ప్రయోగం వెనుక సీక్రెట్ ఇదే!"

  6. "AP Cabinet Meeting : స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం.. విపక్షాలకు మైండ్ బ్లాక్..!"

  7. "Vijay Tvk : విజయ్ టీవీకే పార్టీతో తమిళనాడులో పెను భూకంపం.. ఎవరి కొంప మునుగుతుందో తెలిస్తే షాక్..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp